రాజధాని రైతులకు అండగా ఉంటాం

చంద్రబాబు రోజురోజుకు దిగజారి మాట్లాడుతున్నారు

ఇన్ సైడర్ ట్రేడింగ్‌లో అందరి జాతకాలు బయటపడతాయి.

చంద్రబాబు మంగళగిరిలో పోటీ చేసినా ఓడించేవారు 

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: రాజధాని రైతులకు మేం అండగా ఉంటామని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రైతు కూలీలకు సీఎం వైయస్‌ జగన్‌ రూ.5 వేలకు పింఛన్‌ పెంచారని, సీఎంకు కృతజ్ఞతలు తెలిపేందుకు రైతులు వచ్చారన్నారు. దీన్ని కూడా రాజకీయం చంద్రబాబు చంద్రబాబుకు తగదన్నారు. రోజు రోజుకు చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.  సిఎం వైయస్ జగన్ తో రాజధాని రైతులు కలసి తమ సమస్యలు చెబితే వాటిపై కూడా విమర్శలా?. సిఎం వైయస్ జగన్ తప్పకుండా రైతులకు న్యాయం చేస్తారు. రాజధాని అంశం రాష్ట్రం పరిధిలో ఉంటుందని కేంద్రం చెప్పినా రాద్దాంతం చేయడం సబబు కాదన్నారు. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు అన్నారు. ఐదేళ్లలో చంద్రబాబు మంగళగిరిలో అడుగుపెట్టేందుకు భయపడ్డారు. చంద్రబాబు నిజంగా రైతు మిత్ర అయి ఉంటే మంగళగిరిలో లోకేష్‌ను ఎందుకు ఓడించారని ప్రశ్నించారు. చంద్రబాబు మంగళగిరిలో పోటీ చేసినా ఓడించేవారన్నారు.  ఏమీ తెలుసుకోకుండానే చంద్రబాబు మాట్లాడుతున్నారు. గ్రామస్థాయి నేతగా చంద్రబాబు రోజురోజుకు దిగజారి మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు అమరావతి రైతులు ఎవరూ సహకరించలేదు. పూలింగ్ అని చెప్పి చంద్రబాబు బలవంతపు భూసేకరణకు దిగారు.  భూములు ఇచ్చిన రైతులకు చంద్రబాబు ఏం చేశారు.  రాజధాని నిర్మాణానికి లక్షా ఆరు వేల ఎకరాలు అవసరమా?.  ఐదేళ్లుగా కౌలు పెంచమని రైతులు అడిగినా, రైతుకూలీల పింఛన్‌  పెంచమన్నా చంద్రబాబు స్పందించలేదు. ఎవరూ అడగకపోయినా వైయస్ జగన్ కౌలు 15 ఏళ్లకు, పింఛన్‌ ఐదువేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ హైవేను ఆనుకుని జయభేరి అపార్ట్ మెంట్స్ కట్టారు. ఈస్ట్ ఫేస్ లో రైతులు తమ భూముల్లో భవనాలు కడితే, జయభేరీ అపార్ట్ మెంట్స్ అమ్ముడుపోవని చంద్రబాబు భావించలేదా?స్థానికంగా 600 ఎకరాల రైతులకు అన్యాయం చేసింది నిజం కాదా? రాజధాని కోసం 8648 చదరపు కిలోమీటర్ల ఎకరాలు అవసరమా? ఇన్ సైడర్ ట్రేడింగ్ కు సంబంధించి అందరి జాతకాలు బయటపడతాయి. సిఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు తన పవర్ ను ఉపయోగించినా మంగళగిరిలో వార్డును గెలిపించుకోలేకపోయారు. అక్రమనిర్మాణంలో ఉన్న చంద్రబాబు ఎప్పుడైనా మంగళగిరి వచ్చారా? రైతులకోసం పనిచేసేవారైతే మీరు ముందు సమస్యల గురించి అక్కడ ఎమ్మెల్యే, ఎంపీని కలవండి. ఆ తర్వాత సిఎంని కలవండి.. అక్కడకి సమస్యలు తీరకపోతే మీ నిర్ణయం మీరు తీసుకోండి. అధికారులను, పోలీసులను కూడా చంద్రబాబు బెదిరిస్తున్నారు. ఉండవల్లి గ్రామంలో పేదలు అనేకమంది నివసిస్తున్నారు. ఎప్పుడూ వారికి  ఫాగింగ్ చేయలేదు. చంద్రబాబు నివాసం ప్రాంతంలో ఫాగింగ్ కింద ఐదులక్షలు ఖర్చుపెట్టించారు. చంద్రబాబు ఇంటివద్ద ఎల్ఈడీ బల్బులు పెట్టించేందుకు పంచాయతీ నుంచి రూ.50 లక్షల నిధులు డ్రా చేయించారు. గత డీజీపీ ఠాగూర్ ను  చంద్రబాబు సొంతప్రయోజనాలకు వాడుకున్నారు. చంద్రబాబు అబద్దాలు భరించలేక తెనాలి సభ నుంచి ప్రజలు మధ్యలోనే వెళ్లిపోయారు. ఇకనైనా చంద్రబాబు బుద్ధి చెచ్చుకోవాలి. లేదంటే టీడీపీకి ఇప్పుడు వచ్చిన 23 సీట్లు కూడా రావని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హితవు పలికారు.

Back to Top