వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వంలో ప్రజలందరికీ మేలు  

గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే అల‌జంగి జోగారావు

పార్వ‌తీపురం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌లంద‌రికీ మేలు చేస్తుంద‌ని ఎమ్మెల్యే అల‌జంగి జోగారావు అన్నారు. ఆవాలవలస గ్రామంలో ఎమ్మెల్యే గడప గడపకు కార్యక్రమం చేపట్టి ప్రజల దీవెనలు అందుకున్నారు.  సీతానగరం మండలం, బూర్జ సచివాలయం పరిధిలో గల ఆవాలువలస గ్రామంలో గురువారం 226వ రోజున  ఎమ్మెల్యే అలజంగి జోగారావు గడప గడపకు వెళ్లి ప్రజలను కలుసుకుని వారికి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు అమలు తీరును అడిగి తెలుసుకుని, వారికి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు, గ్రామంలో గల సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కారం అయ్యేలా చూడమని ఆదేశించారు.

కుల, మత, వర్గ, వర్ణ, పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ మేలు చేస్తున్న రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారిని వచ్చే 2024 సాదారణ ఎన్నికల్లో కూడా మళ్లీ సీఎంగా దీవించి గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. ఎమ్మెల్యేను ప్ర‌తి ఇంటి వ‌ద్ద ప్రజలు దీవించి తప్పక తమ మద్దతు ఉంటుందని తెలుపుతూ నిండు మనుసుతో ఆశీర్వదించారు.  కార్యక్రమంలో జెడ్పీటీసీ మామిడి బాబ్జీ, స్థానిక సర్పంచ్ గుజ్జల దాసు, వివిధ గ్రామాల సర్పంచ్లు బొన్నాడ తిరుపతిరావు, గునుపూరు అన్నం నాయుడు, బలగ శ్రీనివాసరావు, తెంటు రామారావు, వైయ‌స్ఆర్‌ సీపీ సీనియర్ నాయకులు పోల ఈశ్వర నారాయణ, ఆర్వీ, వై రాధాకృష్ణ, పరువాడ అచ్చుత నాయుడు, బోగి శంకరరావు, సోషియల్ మీడియా ఇంచార్జీ బి శివ, స్థానిక నాయకులు, కార్యకర్తలు, మండల అధికారులు, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Back to Top