తిరుపతి జిల్లా: ముఖ్యమంత్రి సొంత జిల్లాలో వరుసగా చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే కూటమి సర్కార్ సిగ్గుపడాలని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. తిరుపతి జిల్లాలో మూడేళ్ల చిన్నారి హత్యాచారం ఘటన సంచలనం రేపింది. వడమాలపేట మండలం ఏఎంపురంలో మూడేళ్ల చిన్నారిని చాక్లెట్‌లు కొనిస్తాను అని మాయమాటలు చెప్పి సుశాంత్ అనే అబ్బాయి తీసుకుని వెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ ఘటనపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ మేరకు చిన్నారి కుటుంబ సభ్యులను వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధులు ఆర్కే రోజా, భూమన కరుణాకర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, తదితరులు పరామర్శించారు. నారాయణ స్వామి, మాజీ డిప్యూటీ సీఎం ఆ ఘటన అత్యంత దారుణం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడపిల్లలపై అఘాయిత్యాలు, దారుణాలు పెరిగిపోతున్నాయి, ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తుంది మా నాయకుడు వైయస్ జగన్ వస్తున్నారనగానే మాత్రం హడావిడి చేస్తున్నారు, కూటమి ప్రభుత్వంలో ఆడపిల్లల మాన ప్రాణాలకు రక్షణ కరువైంది సిగ్గుతో తలదించుకునే పరిస్ధితులు రాష్ట్రంలో ఏర్పడ్డాయి, మహిళా లోకంపై జరుగుతున్న అరాచకాలకు అంతేలేకుండా పోయింది. గతంలో మా హయాంలో దిశా యాప్ లో ఎవరికి ఏం జరిగినా పోలీసులు వెంటనే రక్షణ కల్పించేవారు, కానీ ఇప్పుడు దిశ యాప్ లేదు, రక్షణ లేకుండా పోయింది నియంతల సామ్రాజ్యాలే కూలిపోయాయి చంద్రబాబు గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్ ఇప్పుడేం సమాధానం చెబుతావు, మీ పాలనలో జరుగుతున్న అరాచకాలకు బాధితులకు ఏం సమాధానం చెబుతావు నేను మాజీ డిప్యూటీ సీఎం అయినా నేను బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తే నాపై కూడా పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు, ఇదేక్కడి వ్యవస్ధ, ఇదెక్కడి రాజ్యాంగం చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి కఠినంగా శిక్షించాలి ఆర్ కే రోజా, మాజీ మంత్రి మా నగరి నియోజకవర్గంలో చిన్నపాపను అత్యంత దారుణంగా రేప్ చేసి చంపడం అత్యంత దారుణమైన ఘటన, ప్రభుత్వ చేతకానితనం వల్లే ఇదంతా జరుగుతోంది చంద్రబాబు, అనిత, పవన్ కళ్యాణ్ సిగ్గుపడాలి, ఎన్నికల ముందు మీరు చెప్పిందేమిటి, ఇప్పుడు చేస్తున్నదేంటి, ఈ ఐదు నెలల్లో దాదాపు వందమందికి పైగా అత్యాచారాలు, హత్యలు, దారుణాలు జరిగాయి. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇలా జరుగుతుందా ఆడవారికి చిన్న కష్టం వచ్చినా తొక్కి నార తీస్తానన్న పవన్ ఇప్పుడు ఎంతమందిని తొక్కి నార తీశారు, హోంమంత్రి అనిత నువ్వెందుకు అఘాయిత్యాలు ఆపలేకపోతున్నావు, నేరస్ధులకు ఎందుకు భయం కల్పించలేకపోతున్నావు చంద్రబాబు...ఆడపిల్ల పుట్టుకనే అవమానించారు, ఆయన సొంత జిల్లాలో ఇది రెండో ఘటన, గతంలో పుంగనూరులో జరిగింది, ఇప్పుడు ఇది రెండోది, ఇబ్బడిముబ్బడిగా లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులు పెడితే మద్యం తాగి ఆ మత్తులో జరుగుతున్నవి కాదా ప్రభుత్వం ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలి, రాష్ట్రమంతా గంజాయి, లిక్కర్ విచ్చలవిడిగా అమ్ముతున్నారు, నేరస్తుడిని పట్టుకున్నామంటున్నారు కానీ అసలు నేరస్తుడికి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, మీ చేతకానితనం కాదా పవన్ నియోజకవర్గం పిఠాపురంలో అఘాయిత్యం జరిగితే ఇంతవరకు ఆ కుటుంబాన్ని ఆయన పరామర్శించలేదు, బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంలో అత్తాకోడళ్ళపై దారుణం జరిగితే ఇంతవరకు బాలకృష్ణ పరామర్శించలేదు, లోకేష్ నియోజకవర్గంలో 24 గంటల్లో ముగ్గురిని రేప్ చేస్తే ఆయన పట్టించుకోలేదు ఆడపిల్లల రక్షణ బాధ్యత ఇకనైనా తీసుకోండి, తప్పు చేస్తే ఉరి తీస్తారన్న భయం కల్పించండి, జగన్ గారిపై కక్షతో దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్‌లను నిర్వీర్యం చేశారు చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్‌లో అన్‌స్టాపబుల్ షోలకు వెళతారు కానీ ఇలాంటి ఘటన దగ్గరకు రారు నిందితుడిని కఠినంగా శిక్షించాలి, ఉరిశిక్ష విధించాలని మేం కోరుతున్నాం భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భధ్రతలు క్షీణించాయి, హత్యలు, దారుణాలు, అఘాయిత్యాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయి పోలీస్ వ్యవస్ధ నిర్వీర్యమైంది, ఈ రోజు జరిగిన ఈ దారుణానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి, బాలిక కుటుంబానికి కనీసం రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులు, ప్రభుత్వానిదే బాధిత కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అండగా ఉంటుంది. నేరస్తులను కఠినంగా శిక్షించాలని మేం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.