మహిళలకు అండగా ‘సఖి వన్‌స్టాప్‌’

ప్రారంభించిన మంత్రులు తానేటి వనతి, అవంతి శ్రీనివాస్‌

విశాఖపట్నం: అభాగ్య, బాధిత మహిళలకు అండగా ఉండేందుకే సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనతి అన్నారు. విశాఖలో మంత్రులు తానేటి వనతి, అవంతి శ్రీనివాస్‌ సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సఖి వన్‌స్టాప్‌ సెంటర్లు ఐదు రకాల సేవలందిస్తాయని, లైంగికంగా, ఇతరత్రా వేధింపులకు గురయ్యే మహిళలు, 181 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేసి సహాయం పొందవచ్చన్నారు. మహిళలలో ఉన్న 53 శాతం ఎనీమియాను తగ్గించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. మహిళా సంక్షేమ ప్రభుత్వమని, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. మహిళలకు అండగా ఉండేందుకు సఖి వన్‌ స్టాప్‌ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. 

Read Also:చంద్రబాబు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నాడు

తాజా వీడియోలు

Back to Top