ఆడపిల్లలకు రక్షణ, స్వేచ్ఛ ఉండాలనేది సీఎం లక్ష్యం

మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత
 

గుంటూరు: ఆడపిల్లలకు పూర్తి రక్షణ, స్వేచ్ఛ ఉండాలనేది ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని హోంమంత్రి మేకతోటి సుచరిత, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. గుంటూరులో వైయస్‌ఆర్‌ కిశోర పథకాన్ని మంత్రులు సుచరిత, తానేటి వనిత ముఖ్యఅతిథులుగా పాల్గొని ప్రారంభించారు. మహిళలకు  అన్ని రంగాల్లో 50 శాతం అవకాశాలు కల్పించిన ఏకైక సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు. సైబర్‌ నేరాల అడ్డుకట్టకు ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు.

Read Also: ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలు రద్దు

Back to Top