వేసవిలోనూ తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు

వాటర్‌ గ్రిడ్‌పై మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి, బుగ్గన, అనిల్‌ సమీక్ష

అమరావతి: 2022 నాటికి ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు అన్నారు. వాటర్‌ గ్రిడ్‌పై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌లు పాల్గొన్నారు. సమీక్షలు పలు అంశాలపై చర్చించారు. సుమారు రూ. 46,675 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు రెండు దశల్లో అమలు కానున్నట్లు చెప్పారు. 2022 నాటికి ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి అందించాలన్నదే లక్ష్యమని, 30 ఏళ్ల పాటు వినియోగించుకునేలా వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు డిజైన్‌. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు. రిజర్వాయర్ల నుంచి తాగునీటి అవసరాలకు పైపులైన్ల ద్వారా నీటి సరఫరా. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సర్ఫేస్‌ వాటర్‌ సరఫరాకు సత్వర చర్యలు. గోదావరి జిల్లాల్లో ఆక్వాకల్చర్‌ కారణంగా భూగర్భ జలాలు కలుషితం. ప్రత్యామ్నాయంగా పైపులైన్ల ద్వారా తాగునీటిని అందించేందుకు ప్రణాళిక. చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా. గిరిజన గ్రామలకూ సురక్షిత మంచినీటి సరఫరాకు చర్యలు. తాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలకు నీటి సరఫరాలో సమతుల్యత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 
 

Back to Top