ఆదాయం తగ్గినా.. పథకాల అమలులో ముందడుగు

ఎన్నికల ముందు కాపులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం

కాపులను వేధించిన నీచ చరిత్ర గత టీడీపీ ప్రభుత్వానిది

మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌

విశాఖపట్నం: రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వ ధ్యేయమని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. వైయస్‌ఆర్‌ కాపు నేస్తం పథకం ప్రారంభం అనంతరం మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు కాపులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామన్నారు. కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా.. సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందడుగులు వేస్తున్నారన్నారు. వైయస్‌ఆర్‌ కాపు నేస్తం పథకం ద్వారా కాపుల్లోని ఎంతో మంది నిరుపేదలకు మేలు చేకూరుతుందన్నారు. 

గత ప్రభుత్వం కాపులను మనోవేధనకు గురిచేసిందని, ముద్రగడ పద్మనాభం లాంటి నేతను సైతం చంద్రబాబు వెంటాడి వేధించారని గుర్తుచేశారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి మధ్య తేడా ప్రజలు గమనించారన్నారు. 
 

Back to Top