స‌ద‌ర‌న్ జోన‌ల్‌ కౌన్సిల్ సమావేశానికి మంత్రులు బుగ్గన, పెద్దిరెడ్డి హాజరు

రాష్ట్ర విభజన సమస్యలపై ప్రస్తావించిన మంత్రులు

అమరావతి: కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. దక్షిణాది రాష్ట్రాల జోన‌ల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ అమిత్‌ షా అధ్యక్షతన ప్రారంభమైన సమావేశంలో మంత్రులు బుగ్గన, పెద్దిరెడ్డి రాష్ట్ర విభజన సమస్యలను ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి నిధులు ఇవ్వాలని కోరారు. ఏపీ, తెలంగాణ మధ్య సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. రెవెన్యూ లోటు గ్రాంట్, 7 జిల్లాల ప్యాకేజీ నిధుల అంశాన్ని, రామాయ‌ప‌ట్నం పోర్టు, భోగాపురం ఎయిర్‌పోర్టు త‌దిత‌ర అంశాల‌పై సమావేశంలో ప్రస్తావించారు. 

తాజా వీడియోలు

Back to Top