ఆర్థిక ఇబ్బందులున్నా.. సంక్షేమంలో ముందడుగు

ఒకేసారి 4 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దే

ఈనెల 25న పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం

మంత్రులు బొత్స సత్యనారాయణ, శ్రీరంగనాథరాజు

గుంటూరు: ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక పథకాలు అమలు చేస్తున్నారని అమలు చేస్తున్నారని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. వెనుకబడిన కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పదవులు కల్పించిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దేనన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో రూ.46 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంత్రులు బొత్స సత్యనారాయణ, శ్రీరంగనాథరాజు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు, విడదల రజిని శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఒకేసారి 4 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దన్నారు. కరోనా సమయంలో కూడా సీఎం జగన్‌ ప్రజలను ఆదుకున్నారని, గ్రామ సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. చంద్రబాబు తన అనుకూల మీడియాతో పథకం ప్రకారం ప్రభుత్వంపై బురదచల్లుతున్నారని మండిపడ్డారు. మంత్రి శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ.. ఈనెల 25న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నామని వివరించారు.

Back to Top