మంత్రి  విశ్వ‌రూప్‌కు అస్వ‌స్థ‌త‌.. ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

తూర్పుగోదావరి: రవాణ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అస్వస్థత గురయ్యారు. శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు విశ్వరూప్‌ను వెంటనే రాజమహేంద్రవరంలోని బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మంత్రి విశ్వరూప్‌ హెల్త్‌ కండీషన్‌ను పరిశీలించిన వైద్యులు.. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఆయనను ఎన్ఐసీయూలో అబ్జర్వేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు. దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వర్ధంతి సందర్భంగా మంత్రి విశ్వరూప్ పలు కార్యక్రమాల్లో​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన చేయి లాగుతుందని నాయకులకు చెప్పడంతో విశ్వరూప్‌ను వెంటనే రాజమహేంద్రవరం తీసుకెళ్లారు. 

తాజా వీడియోలు

Back to Top