మహానేత గొప్పతనం భావితరాలకూ తెలియాలి

హెల్త్‌ యూనివర్సిటీకి డాక్టర్‌ వైయస్‌ఆర్‌ పేరు పెట్టడం సముచితం, ప్రశంసనీయం

ఎన్టీఆర్‌ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు

పిల్లనిచ్చిన మామను వాడు, వీడు అని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో మాట్లాడాడు

ఎన్టీఆర్‌కు నైతిక విలువలు శూన్యమని చంద్రబాబు స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు

అధికారం లేనప్పుడు మాత్రమే బాబుకు ఎన్టీఆర్‌ గుర్తుకొస్తారు

రాష్ట్రానికి 3 మెడికల్‌ కాలేజీలు తెచ్చిన ఘనత మహానేత వైయస్‌ఆర్‌ది

తండ్రి బాటలో నడుస్తూ సీఎం వైయస్‌ జగన్‌ మరో 17 మెడికల్‌ కాలేజీలు తెస్తున్నారు

అసెంబ్లీలో హెల్త్‌ యూనివర్సిటీ చర్చలో మంత్రి విడదల రజనీ..

అసెంబ్లీ: ‘‘డాక్టర్‌ వైయస్‌ఆర్, ప్రజలూ రెండూ ఒక్కటే. వైయస్‌ఆర్‌ జ్ఞాపకాలు, ఆయన విజయాలు, ఆయన అందించిన సేవలు, ఆయన చూపిన దాతృత్వం, ఆయన మంచితనం, గొప్పదనం భావితరాలకు తెలియజేయాలంటే వైయస్‌ఆర్‌ పేరుతో ఏం చేసినా సరిపోదు. అందుకే హెల్త్‌ యూనివర్సిటీకి డాక్టర్‌ వైయస్‌ఆర్‌ పేరు పెట్టడం సముచితం, ప్రశంసనీయం, ఆహ్వానించాల్సిన విషయం’’ అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ అన్నారు. వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి అనేకమంది ప్రాణాలు కాపాడారని, పేదలకు ఉచితంగా వైద్యం అందించారని, మరీ ముఖ్యంగా 3 మెడికల్‌ కాలేజీలు రాష్ట్రానికి తెచ్చారని చెప్పారు. హెల్త్‌ యూనివర్సిటీకి వైయస్‌ఆర్‌ పేరు పెట్టడంలో తప్పేంటని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ను వాడు, వీడు అని సంబోధించిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తుచేశారు. హెల్త్‌ యూనివర్సిటీకి వైయస్‌ఆర్‌ పేరుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో మంత్రి విడదల రజని మాట్లాడారు. 

‘‘ఎన్టీఆర్‌ గురించి మాట్లాడే హక్కు టీడీపీకి లేదు. అధికారం దూరమైన ప్రతీసారి ఎన్టీఆర్‌ గుర్తుకువస్తారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని గుర్తువస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఎన్టీఆర్‌ను పట్టించుకోరు. ఎన్టీఆర్‌ ఫొటో, పేరు కనిపించకూడదని మాట్లాడుతారు. ఎన్టీఆర్‌ గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలు, తెలుగువారు ఎవరూ మర్చిపోలేదు. 2019 ఎన్నికల ముందు మాట్లాడిన వీడియోను అసెంబ్లీలో ప్రదర్శించారు. 

చంద్రబాబు, రాధాకృష్ణ మనసులో ఎంత దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నాయో వీడియో చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది. ఆ మాటలు చంద్రబాబువి కాదా..? ఎన్టీఆర్‌ గురించి మాట్లాడే అర్హత టీడీపీ సభ్యులకు లేదు. 

ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీయే ఉందా ఇంకా అని రాధాకృష్ణ  అడిగితే.. ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీ పేరు మారుస్తాం.. అది ఎప్పుడో మరిచిపోయారు.. వాడిది అయిపోయింది.. వాడిది అప్పుడు.. అని ఎన్టీఆర్‌ గురించి చంద్రబాబు మాట్లాడారు. 

ఎన్టీఆర్‌ మీద గౌరవం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉంది. అపారమైన గౌరవం ఉంది కాబట్టే ఒక జిల్లాకు ఎన్టీఆర్‌ జిల్లా అని పేరు పెట్టారు. ఇది మా నాయకుడికి ఎన్టీఆర్‌ మీదున్న గౌరవం. చంద్రబాబుకు ఉన్న దుర్బుద్ధి, వెన్నుపోటు ఆలోచన ఏంటో చంద్రబాబు–రాధాకృష్ణ వీడియో ద్వారా స్పష్టం అవుతుంది. 

అప్పట్లో 2009 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతాడని ఎన్నికల కమిషన్‌కు ఒక లెటర్‌ రాశాడు. 
కక్ష ఉంటే నాపై తీర్చుకోండి.. ఆరోగ్యశ్రీని ఆపవద్దు అని వైయస్‌ఆర్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. 
నేటి నుంచి ఆరోగ్యశ్రీ బంద్‌ అని చంద్రబాబు కుట్ర చేశాడు. చంద్రబాబు మనస్తత్వం ఏంటో అర్థం అవుతుంది. 

ఎన్టీఆర్‌లో నైతిక విలువలు శూన్యం అని చంద్రబాబు అప్పట్లో స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. 
వీ డోంట్‌ నీడ్‌ ఎన్టీఆర్‌ అని అప్పట్లో స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. గతంలో ప్రచురితమైన పత్రికల్లో కనిపిస్తుంది. ఇదీ చంద్రబాబుకు ఎన్టీఆర్‌ మీదున్న గౌరవం. ఈరోజు ఎన్టీఆర్‌ గురించి మాట్లాడే హక్కు వారికి లేదు. 

డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అంటేనే తెలుగు ప్రజలకు ఒక బంధం. వైయస్‌ఆర్‌ అంటేనే తెలుగువారికి ఒక భావోద్వేగం.. వైయస్‌ఆర్‌ అంటేనే తెలుగుప్రజలకు ఆత్మీయత, వైయస్‌ఆర్‌ అంటేనే తెలుగు ప్రజలకు మానసిక భావన.. ఒక మనిషి మరణిస్తే ఆ వార్త తట్టుకోలేక వందలాది మంది చనిపోతారంటే ఆ వ్యక్తి కచ్చితంగా డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి. వైయస్‌ఆర్‌ మరణవార్త విని తట్టుకోలేక గుండె పగిలి అసువులుబాసిన 800లకు పైగా ప్రాణాలు అందుకు సాక్ష్యం.

ఒక మనిషి శాసిస్తే.. గాడి తప్పిన ఒక రాష్ట్రం పట్టాలెక్కుతుందంటే ఆ వ్యక్తి డాక్టర్‌ వైయస్‌ఆర్‌. అప్పుల ఊబి నుంచి ఆర్థిక పరిపుష్టివైపు వడివడిగా అడుగులు వేసిన మన రాష్ట్రం అందుకు ఉదాహరణ. వైయస్‌ఆర్‌ గొప్ప మానవతావాది. వైయస్‌ఆర్‌ సమర్థవంతమైన ప్రజారక్షకుడు. వైయస్‌ఆర్‌ గొప్ప పరిపాలన దక్షకుడు, ప్రజల్లోంచి ఉంచాడు.. ప్రజలతోనే బతికాడు.. ప్రజల కోసమే బతికాడు. ప్రజల కోసం శ్వాసించాడు..ప్రజల కోసం వెళ్తూనే మరణించాడు. వైయస్‌ఆర్, ప్రజలూ రెండూ ఒక్కటే. వైయస్‌ఆర్‌ జ్ఞాపకాలు, ఆయన విజయాలు, ఆయన అందించిన సేవలు, ఆయన చూపిన దాతృత్వం, ఆయన మంచితనం, ఆయన గొప్పదనం భావితరాలకు తెలియజేయాలంటే ఆయన పేరుతో ఏం చేసినా సరిపోదు. అందుకే హెల్త్‌ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టడం సముచితం, ప్రశంసనీయం, ఆహ్వానించాల్సిన విషయం. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 8 మెడికల్‌ కాలేజీలు ఉంటే.. వైయస్‌ఆర్‌ 3 మెడికల్‌ కాలేజీలను తీసుకువచ్చారు. ఇప్పుడు ఆయన తనయుడుగా సీఎం వైయస్‌ జగన్‌ ఈరాష్ట్రంలో 17 మెడికల్‌ కాలేజీలను తీసుకురాబోతున్నారు.  మొత్తం మన రాష్ట్రంలో 28 మెడికల్‌ కాలేజీలు ఉండబోతున్నాయి. ఇంత గొప్పపని చేసిన వైయస్‌ఆర్‌ బాటలో సీఎం వైయస్‌ జగన్‌ 17 మెడికల్‌ కాలేజీలు తీసుకువస్తున్నప్పుడు క్రెడిట్‌ మనం తీసుకోవడంలో తప్పేంటి..? 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top