శ్రీవారి ఆశీస్సులతో సీఎం సంకల్పం సిద్ధించాలి

బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

తిరుపతి: పవిత్ర వైకుంఠ ఏకాదశి నాడు జరిగే ప్రతిష్టాత్మకమైన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సంకల్పం సిద్ధించాలని శ్రీవారిని కోరుకున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న మంత్రిని ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. అనంతరం ఆలయం సమీపంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు దాదాపు 32 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణి కార్యక్రమానికి వైకుంఠ ఏకాదశి రోజున ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారన్నారు. శ్రీవారి దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరగాలన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top