తూర్పు గోదావరి: మన జగనన్న ప్రభుత్వంలో కుల, మత, జాతి భేదాల్లేవు, అందరికీ సమన్యాయం జరుగుతుందని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. ఇందుకు తానే నిదర్శనమన్నారు. దళితులకు ధైర్యం, గిరిజనులకు గుండెచప్పుడు, మైనార్టీలకు అండ, బలహీనులకు బలం, ఐదు కోట్ల ఆంధ్రుల నమ్మకం, పేద విద్యార్ధుల భవిష్యత్ మన జగనన్న అన్నారు. కొవ్వూరు బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు.
తానేటి వనిత ఏమన్నారంటే..
అందరికీ నమస్కారం, ఈ రోజు మన కొవ్వూరు నియోజకవర్గానికి జగనన్న వచ్చారు, మన జగనన్న ప్రభుత్వంలో మన జగనన్న నాయకత్వంలో కుల, మత, జాతి భేదాల్లేవు, అందరికీ సమన్యాయం. ఇందుకు నేనే నిదర్శనం, దళితులకు ధైర్యం, గిరిజనులకు గుండెచప్పుడు, మైనార్టీలకు అండ, బలహీనులకు బలం, ఐదు కోట్ల ఆంధ్రుల నమ్మకం, పేద విద్యార్ధుల భవిష్యత్ మన జగనన్న. మన జగనన్న వచ్చిన తర్వాత విద్యాశాఖలో వినూత్న మార్పులు తీసుకొచ్చారు. ఇన్నాళ్ళు ప్రభుత్వ బడులు అభివృద్దికి దూరంగా ఎందుకున్నాయంటే పిల్లలకు ఓట్లు ఉండవనే కారణం. ఓట్లు కాదు ముఖ్యం మన చిన్నారులకు చదువులు ముఖ్యమని కార్పొరేట్ చదువులను ప్రభుత్వ విద్యాసంస్ధలకు చేర్చిన ఘనత మన జగనన్నది. పిల్లలంతా జగన్ మామయ్య అని ఓన్ చేసుకుంటున్నారు. అంబేద్కర్ ఆలోచనలు, మహాత్మాగాంధీ కలలు, జ్యోతీరావుపూలే ఆశయాలు, బాబూ జగ్జీవన్ రామ్ ఆశించిన ఫలితాలు మన జగనన్నతోనే సాధ్యం. ఉన్నతస్ధాయికి వెళ్ళాలంటే విద్య ఒకటే మార్గమని నమ్మిన నాయకుడు మన జగనన్న. ఇక్కడున్న స్టూడెంట్స్ హిస్టరీ చదివి ఉంటారు హిస్టరీ విని ఉంటారు కానీ హిస్టరీని క్రియేట్ చేసిన నాయకుడిని ఎప్పుడైనా చూశారా, ఆయన మీ కళ్ళముందున్నారు, మన జగనన్నే. ఈ దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో పదో తరగతి విద్యార్ధులకు స్టేట్ ర్యాంక్స్ చూశారా, కానీ జగనన్న సహకారంతో ప్రభుత్వ బడులలో చదివిన విద్యార్ధులు స్టేట్ ర్యాంక్స్ సాధించారు. దేశచరిత్రలో ఎన్నడూలేని విధంగా విద్యాశాఖలో సంస్కరణలు తీసుకొచ్చారు మన జగనన్న. దేశంలో ఎవరూ చేయని విధమైన సంస్కరణలు జరిగాయని గర్వంగా చెప్పగలం. గతంలో విద్యను వ్యాపారం చేస్తే జగనన్న విద్యను పేదవాడి హక్కుగా మార్చారు, ఇది చూడలేక ప్రతిపక్షాలు ఏడుస్తున్నాయి. విద్యారంగంలో విప్లవం వస్తే ఎలా ఉంటుందో దేశానికి చాటిచెప్పారు. చంద్రబాబుకు పేద విద్యార్ధులు చదువుకోవం ఇష్టం లేదు, పెద్ద కాలేజీలలో పేదలు చదువుకోకూడదని సీలింగ్ పెట్టి ఫీజులు రూ. 35 వేలు మాత్రమే కట్టి అవి అరకొరగా కట్టేవారు, నాటి బకాయిలు కూడా జగనన్న కట్టారు. వేల కోట్లు చదువుల గురించి ఖర్చుచేస్తున్నారు. విద్యార్ధులంతా చదువుకోండి మీకు అండగా ఉంటానన్నారు. మీరంతా కూడా జగనన్న వెంటే ఉండాలి, ఆయుధంతో యుద్దం చేసేవాడు సైనికుడు, ధర్మం కోసం యుద్దం చేసేవాడు రాముడు, మరి పేదల కొసం యుద్దం చేసేవాడు మన జగనన్న. మన జగనన్న పేదల వైపు ఉంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పెత్తందారుల వైపు ఉన్నారు. మనమంతా జగనన్న వెంట ఉండాలి, పది తలల రావణాసురుడిని ఒక తల ఉన్న రాముడు జయించాడు, అలాగే ఈ రోజు పదిమంది కానీ వందమందితో కలిసొచ్చినా చంద్రబాబును ఓడించడం ఖాయం. ఆకాశంలో నక్షత్రాలు అంతరించిపోవచ్చు, సముద్రంలో అలలు ఇంకిపోవచ్చు, అక్షయపాత్రలో ఆహారం అడుగంటిపోవచ్చు కానీ మన జగనన్నపై అభిమానం తగ్గదు, ఎందుకంటే ఇది ఆకాశమంత, దానికి హద్దులు లేవు, ఇదే అభిమానాన్ని ప్రజలంతా జగనన్నపై ఉంచాలి. దళిత మహిళనైన నన్ను హోంమంత్రిగా పనిచేసే అవకాశం ఇచ్చారు, నా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. దళితులకు రాజ్యాధికారం ఇచ్చి దేశచరిత్రలో నిలబెట్టారు. కొవ్వూరు ప్రజలకు చాలా చేశారు, కొన్ని సమస్యలు ఉన్నాయి, మీ దృష్టికి తీసుకొస్తున్నాను. డిగ్రీ కాలేజ్ భవన నిర్మాణానికి అవసరమైన నిధులు కావాలి, కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కు అవసరమైన పంపులు ఇవ్వాలి, నియోజకవర్గానికి మూడు అంబేద్కర్ భవన్స్ ఇవ్వాలి, కొవ్వాడ కెనాల్ కు అవసరమైన కల్వర్ట్ ఇవ్వాలి, ముస్లిం సోదరులకు ఒక షాదీఖానా మంజూరు చేయాలని కోరుతున్నాను. ధన్యవాదాలు.