అమరావతి: మృదుస్వభావి,నిగర్వి అయిన కోన రఘుపతి డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల సంతోషంగా ఉందని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపారు.డిప్యూటî స్పీకర్‌గా కోన రఘుపతిని ఎంపిక చేయడం పట్ల వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కోన రఘుపతి కుటుంబ నేపథ్యాన్ని ఆమె వివరించారు. నిజాయితీ గల్గిన గొప్ప రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అని కొనియాడారు.ఆయన తండ్రైన స్వాతంత్ర సమరయోధులు,బహుముఖ ప్రజ్ఞాశాలి కోన ప్రభాకర్‌రావు ఎన్నో కీలక పదవులు నిర్వహించారన్నారు.ఏపీ స్పీకర్‌గా,ఆర్థిక మంత్రిగా,మూడు రాష్ట్రాలకు గవర్నర్‌గా ఆ పదవులకే వన్నె తెచ్చాన్నారు.కోన రఘుపతి పారిశ్రామిక రంగాన్ని ఎంచుకుని ఎందరికో ఉపాధిని కల్పిస్తున్నారన్నారు.ఫెడరేషన్ ఆఫ్ ఏపీ స్మాల్ స్కేల్ ఇండ్రస్టీ అసోసియేషన్ మాజీ జనరల్ సెక్రటరీగా ఉప్పల్ ఇండస్ట్రీరియల్ డవలప్‌మెంట్ ఇన్‌ప్రాటక్చర్‌ను అభివృద్ధి చేయడంలో విశేష కృషి చేశారన్నారు.ఎదైనా సమస్య వచ్చినప్పుడు అధ్యయనం చేయించి తాతాల్కిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం చేయడంతో ఆయనది విలక్షణ శైలిగా పేర్కొన్నారు.ఎవరిని నొప్పించకుండా ఒప్పించగల్గించడం ఆయన ప్రత్యేకత అని పేర్కొన్నారు.దేశ సమగ్రతను పెంచేవిధంగా 2008లో తిరగాన్ కార్యక్రమాన్ని చేపట్టి యువతలో దేశభక్తిని పెంపొందించడం గొప్ప విషయం అన్నారు.