సీఎం వైయస్‌ జగన్‌ సంకల్ప బలం గొప్పది

పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్ప బలం గొప్పదని, సీఎం ఆలోచనలతో ప్రపంచమే ఏకీభవించే పరిస్థితి వచ్చిందని పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. అమూల్‌ పాల వెల్లువ కార్యక్రమంతో మహిళల ఆర్థిక స్వావలంబన, మహిళా అభివృద్ధిలో చక్కటి పాత్ర పోషిస్తోందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఏపీ–అమూల్‌ పాల వెల్లువ ప్రాజెక్టును ప్రారంభోత్సవానికి ముందు మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తొలి విడతగా 142 గ్రామాల్లో సుమారు 15 వేల మంది రైతుల ద్వారా పాలు సేకరించనున్నామన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యసాధనలో భాగస్వామ్యం అయినందుకు గర్వపడుతున్నానని అన్నారు. సీఎం సంకల్ప బలం కారణంగానే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నీతి ఆయోగ్‌ విడుదల చేసిన సుస్థిర అభివృద్ధి సూచికలో దేశంలోనే మూడవ స్థానంలో నిలిచిందన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top