సిగ్గు పడాల్సింది పోయి..తప్పు చేసిన వారిని వెనకేసుకొస్తావా?

చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి అప్పలరాజు
 

శ్రీ‌కాకుళం: రాష్ట్రంలో ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసానికి పాల్పడింది తమ పార్టీ వారేనని తెలిసి సిగ్గు పడాల్సింది పోయి, తప్పు చేసిన వారిని వెనకేసుకొస్తావా అంటూ చంద్రబాబుపై మత్స్యశాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు. సంతబొమ్మాళి మండలంలో నంది విగ్రహాన్ని తొలిగిస్తూ అడ్డంగా బుక్కైన తెలుగు తమ్ముళ్లను వెనకేసుకురావడంపై మంత్రి స్పందిస్తూ.. విగ్రహన్ని తమవాళ్లే తీసారని చంద్రబాబు దమాయించడం సిగ్గుచేటని అన్నారు. విగ్రహాన్ని తొలగిస్తే తప్పేంటని ప్రశ్నించిన ప్రతిపక్ష నేత తీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేవతా విగ్రహాలను రాళ్ళనుకుంటున్నారా అంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. తాము విగ్రహాలను దేవుని ప్రతిరూపాలుగా భావించి, పూజిస్తామని ఆయన తెలిపారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే చంద్రబాబు అసలు హిందువేనా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇది పద్దతి కాదని ఆయనకు చెప్పేవారెవరూ లేరా అని ప్రశ్నించారు. 

రాష్ట్రానికి ఇంకా తానే ముఖ్యమంత్రినన్న భ్రమలో చంద్రబాబు ఉన్నారని, ఆయన్ను అర్జెంట్‌గా మానసిక వైద్యుడికి చూపించాలని మంత్రి సూచించారు. మానసిక రోగంతో బాధపడుతున్న వారు రాజకీయాలకు అనర్హులని, ఇలాంటి వారు రాజకీయాల్లో కొనసాగితే రాష్ట్రానికి ఎంతో ప్రమాదమని ఆయన వ్యాఖ్యానించారు. కులమాతాల మధ్య చిచ్చు పెడుతున్నది తనే అని బహిర్గతమైనా, ధర్మపరిరక్షణ పేరుతో యాత్ర నిర్వహించడం సిగ్గుచేటని మంత్రి అప్ప‌ల‌రాజు మండిపడ్డారు.

తాజా వీడియోలు

Back to Top