యుద్ధప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు చేపడుతాం

3,100 కిలోమీటర్ల మేర రోడ్లని అభివృద్ధి చేయబోతున్నాం

ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి శంకర్‌ నారాయణ

విజయవాడ: యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు చేపట్టనున్నట్లు ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి శంకర్‌ నారాయణ తెలిపారు. రాష్ట్రంలోని 3,100 కిలోమీటర్ల మేర రోడ్లని అభివృద్ధి చేయబోతున్నామన్నారు. మంత్రి శంకర్‌ నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. రోడ్ల అభివృద్ధి కోసం రూ.1158 కోట్లు సమీకరిస్తున్నామని చెప్పారు. పెట్రోలియం ద్వారా వచ్చే రూ.2,168 కోట్ల సెస్‌ని రోడ్ల అభివృద్ధికి వెచ్చిస్తామన్నారు. గత ప్రభుత్వం పెట్టిన రూ.450 కోట్ల బకాయిలను వైయస్‌ జగన్‌ సర్కార్‌ చెల్లించిందని చెప్పారు. స్పందనపై కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా రోడ్ల మరమ్మతుల విషయంపై సీఎం సమీక్షించారని, జనవరి 10వ తేదీ నుంచి 45 రోజుల పాటు యుద్ధప్రాతిపదికన రహదారుల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారని గుర్తుచేశారు. 

Back to Top