అది వారాహి కాదు.. నారాహి

ప‌వ‌న్ క‌ల్యాణ్ వైఖ‌రిపై మంత్రి రోజా ఫైర్‌

తిరుపతి: ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎన్నిక‌ల ప్ర‌చార వాహ‌నంపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ఎలాంటి కామెంట్ చేయ‌లేద‌ని, ఆయ‌న అనుకూల మీడియానే హైలైట్ చేసింద‌ని రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. అయినా.. అది వారాహి కాదు.. నారాహి అని, క‌త్తులు ప‌ట్టుకొని పిచ్చిపిచ్చి ట్వీట్లు చేయ‌డం రాజ‌కీయాల్లో స‌రైన ప‌ద్ధ‌తి కాద‌న్నారు. నిబంధనల ప్రకారం.. ఆర్మీ వాళ్లు మాత్రమే ఆకుపచ్చ రంగు కలర్ వాహనాన్ని వాడాలని నిబంధన ఉందని గుర్తుచేశారు. తిరుప‌తిలో ఆంధ్రప్రదేశ్‌ సమీకృత సుస్థిర పర్యాటక ప్రణాళిక అభివృద్ధి పై ఇన్సట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా (ITPI) ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ విభాగం, ఏపీ టూరిజం అథారిటీ ఆధ్వర్యంలో సౌత్ జోన్ సమావేశానికి మంత్రి రోజా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా జనసేనాని ప్రచార వాహనంపై ఆమె సెటైర్లు వేశారు. 

పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు కీలక పాత్ర
పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు కీలకమైన పాత్ర పోషిస్తాయని మంత్రి ఆర్.కె.రోజా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత టూరిజం పాలసీ (2020-25)ప్రకారం రాష్ట్రంలో టూరిజం పరిశ్రమ వృద్ధి,  పెంపుదలకు ప్రాధాన్యతనిస్తుందని, పాలసీ పెట్టుబడిదారులు, పర్యాటకం ఆవిష్కర్తలకు సమాన అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక అనుభవాలను మెరుగుపరచడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తల ద్వారా వివిధ పర్యాటక ప్రాజెక్టులను తీసుకోవచ్చని వివరించారు.  

రాష్ట్ర టూరిజం పాలసీ 2020-25 యొక్క ముఖ్యమైన లక్షణాలుగా సులభంగా వ్యాపారం చేయడం, ప్రధాన సంస్కరణ భాగాలుగా భూ వినియోగంలో మార్పు కోసం సింగిల్ విండో క్లియరెన్స్, పర్యావరణ రిజిస్ట్రేషన్ ఎనేబుల్స్, కాంట్రాక్ట్ నిర్మాణ అనుమతి, అమలు చేయడం యుటిలిటీ పర్మిట్లు, సేకరణ, పన్నుల చెల్లింపు, ప్రోత్సాహకాలు, పెట్టుబడిగా పేర్కొన్నారు. రాష్ట్ర పర్యాటక రంగంలో అభివృద్ధి కార్యకలాపాలు రాష్ట్రంలో అమలు చేయబడిన వివిధ పథకాలు / ప్రాజెక్టులు మరియు పర్యాటక గమ్యస్థానాలు & అభివృద్ధి కార్యకలాపాల పురోగతిని హైలైట్ చేయడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటామ‌ని స్పష్టం చేశారు.  

టూరిజం పాలసీ 2020-25 నిబంధనల ప్రకారం ప్రభుత్వం మెగా/5-స్టార్ మరియు లగ్జరీ హాస్పిటాలిటీ ప్రాజెక్ట్‌లను ఆమోదించడంలో విభాగం యొక్క ప్రయత్నాలు కీలకంగా ఉన్నాయని తెలిపారు.
సౌత్ జోన్ ITPI కాన్ఫరెన్స్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్య పట్టణ ప్రణాళికలు / టౌన్ ప్లానింగ్ డైరెక్టర్లు,ప్రభుత్వ, ప్రైవేట్ మరియు కార్పొరేట్ రంగానికి చెందిన విద్యావేత్తలు, పరిశోధకులు మరియు నిపుణులు పాల్గొన్నారు.

Back to Top