చంద్రబాబు జీవితమంతా కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు

స్పీకర్‌పైనే టీడీపీ సభ్యులు దౌర్జన్యం చేయడం దుర్మార్గం

దౌర్జన్యానికి తెగబడిన టీడీపీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

శాసనసభలో టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి రోజా ఆగ్రహం

అసెంబ్లీ: చంద్రబాబు జీవిత చరిత్ర మొత్తం కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోటు రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలు అని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. చంద్రబాబు శాసనసభకు రావడం లేదు కాబట్టి, చట్టసభ ప్రశాంతంగా జరగడం ఆయనకు ఇష్టంలేదు కాబట్టి, సభను ఎలాగైనా రచ్చసభగా మార్చాలని రోజుకో పనికిమాలిన వాయిదాలు తీసుకురావడం తప్ప.. ప్రజలకు, ప్రజా సమస్యలకు సంబంధించిన ఒక్క అంశంపైనైనా టీడీపీ సభ్యులు మాట్లాడారా..? అని ప్రశ్నించారు. జీవో.1పై టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇవ్వడం సిగ్గుచేటు అన్నారు. సభలో టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరుపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పబ్లిసిటీ పిచ్చి కోసం కందుకూరులో ప్రజలను ఇరుకుసందుల్లో దూర్చి 8 మందిని దారుణంగా పొట్టనబెట్టుకున్నారు. బుద్ధిలేని, మనసులేని చంద్రబాబుకు మాత్రం ఏ కోశాన బాధ లేదు. వెంటనే గుంటూరులో సభ పెట్టి ముగ్గురిని చంపేశాడు. పబ్లిసిటీ పిచ్చితో 11 మందిని చంపేశాడు. ప్రజల ప్రాణాలకు అపాయం జరిగేచోట మీటింగ్‌లు వద్దు, ఖాళీ మైదానాల్లో మీటింగ్‌లు పెట్టుకోండి అని చెబితే అది పెద్ద తప్పులా దానిపై వాయిదా తీర్మానం తీసుకురావడం ఎంతవరకు సమంజసం.

ఇంతమంది చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవారు ఉండగా.. బాల వీరాంజనేయస్వామిని మాత్రమే ముందుపెట్టి ప్రతీరోజూ ఏ విధంగా సభను పక్కదారి పట్టించేలా చూస్తున్నారో గమనించాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని స్పీకర్‌గా పెట్టుకొని శాసనసభను కౌరవ సభలా ఎలా నడిపించారో రాష్ట్ర ప్రజలంతా చూశారు. సీఎం వైయస్‌ జగన్‌ అధ్యక్షతన గౌరవ సభగా నడుస్తున్న శాసనసభను ప్రతిరోజూ రచ్చచేసి డైవర్ట్‌ చేసే ప్రయత్నం టీడీపీ చేస్తోంది. స్పీకర్‌పైనే టీడీపీ సభ్యులు దౌర్జన్యం చేయడం దుర్మార్గం. 

ప్రజలకు సంబంధించిన విషయాలపై టీడీపీ సభ్యులు మాట్లాడకపోగా.. ప్రతిరోజూ స్పీకర్‌ చైర్‌ చుట్టూ చేరి పేపర్లు చించి స్పీకర్‌పై వేయడం, అగౌరవపర్చడం చూస్తుంటే బాధేస్తోంది. స్పీకర్‌ చైర్‌ను గౌరవించకుండా టీడీపీ సభ్యులు పేపర్లు చించి ఎలా విసిరారో.. రాబోయే 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు టీడీపీ చీటిలు చించి ఈ రాష్ట్రం నుంచి బయటేస్తారు. చంద్రబాబుకు బీసీలంటే చులకన.. గతంలో కూడా బీసీలు జడ్జిలుగా పనికిరారని లేఖలు రాశాడు. బీసీల తోకలు కత్తిరిస్తానని హెచ్చరించిన దుర్మార్గుడు కూడా బాబే. స్పీకర్‌గా మీరు ఎన్నికైన రోజు ఆ చైర్‌లో కూర్చోబెట్టేందుకు రాకుండా మిమ్మల్ని అవమానించాడు. స్పీకర్‌గా బీసీ నేత ఆ చైర్‌లో ఉంటే సహించలేక ప్రతిరోజూ తన ఎమ్మెల్యేలతో అవమానపరుస్తున్నాడు. పోడియం వద్దకు వచ్చి దౌర్జన్యం చేయాలంటే భయంపుట్టే విధంగా చర్యలు ఉండాలని, వారిని శాశ్వతంగా చట్టసభకి రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. 
 

Back to Top