175 స్థానాల్లో సింగిల్‌గా పోటీ చేసే ద‌మ్ముందా? 

ప‌వ‌న్‌కు మంత్రి ఆర్కే రోజా స‌వాలు

మాకు 45 సీట్లు వస్తే130 సీట్లు నీకే వస్తాయా పీకే?

కనీసం ఎమ్మెల్యేగా గెలవలేవుగాని ప‌వ‌న్‌ జాతకం చెబుతుంటే నవ్వొస్తేంది 

అమ‌రావ‌తి:  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా స‌వాలు విసిరారు. పవన్‌కు 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా? అని ప్ర‌శ్నించారు. జనసేనకు 175 స్థానాల్లో అభ్యర్థులే లేరు కానీ.. అసెంబ్లీ జెండా ఎగురవేస్తారట. ముందు సర్పంచ్‌లుగా గెలవండి.. తర్వాత ఎమ్మెల్యేల గురించి ఆలోచించండి అంటూ హిత‌వు ప‌లికారు. మంత్రి రోజా సోమవారం అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యేగా గెలవలేని పవన్‌ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. సినిమా పిచ్చి ఉన్నవాళ్లే పవన్‌ మీటింగ్‌లకు వస్తున్నార‌ని పేర్కొన్నారు. 

ఇట్టాంటి సర్వేలే నమ్ముకుని గతంలో 'జగన్ మోహన్ రెడ్డి సీఎం కాడు ఇది శాసనం' అన్నావ్. శాసనం అన్న నిన్నే ప్రజలు 
శాసన సభకి కూడా రానీయని విషయం మర్చిపోయావా?
175 చోట్ల జనసేనకు క్యాండేట్లు కూడా లేరు...వైయస్ఆర్‌సీపీని దించి అసెంబ్లీ మీద జనసేన జెండా ఎగరేస్తానంటాడు.
ఫస్ట్ కౌన్సిలర్లుగా గెలవండి, ఎంపీటీసీలు, సర్పంచులు గెలవండి తర్వాత ఎమ్మెల్యేగా గెలవడం సంగతి ఆలోచిద్దురుగాని,,
. గ్రామాల్లో సినిమా పిచ్చితో ఉన్న పిల్లలు నీ మీటింగ్ లకు వచ్చారని రెచ్చిపోయి సీఎం అని కలలు కని నువు బొక్కబోర్లా పడ్డావ్.
నిన్ను తెలుగు ఇండస్ట్రీ హీరో అని చెప్పుకోడానికి సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలంతా సిగ్గుపడుతున్నారు.
సినిమాల నుంచి వచ్చిన ఎన్టీఆర్ పార్టీ పెట్టి సింగిల్ గా పోటీచేసారు.  చిరంజీవిగారు పార్టీ పెట్టి సింగిల్‌ గా పోటీ చేసారు.
అదే రక్తం పంచుకుని పుట్టి నువ్ పార్టీ పెట్టి, పోటీ చేయడం మానేసి 2014లో బీజేపీకి ఓటేయండి టీడీపీకి ఓటేయండి అన్నావ్.. 
రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసింది నువ్వు, నువ్ సపోర్టు చేసిన పార్టీలే.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే పట్టించుకోని నువ్వు నేడు నోరు చించుకుని మాట్లాడుతున్నది ప్యాకేజీ కోసమేగా..
వైయ‌స్ జగన్ కేసీఆర్ తో కలిసి ఏపీకి రావాల్సినవి అన్నీ వదిలేసుకున్నాడని పవన్ అంటున్నాడు. ఓటుకునోటు కేసులో ఇరుక్కుని ఉమ్మడి రాజధానిని వదిలేసి పారిపోయి వచ్చి కరకట్ట మీద కొంపలో దాక్కున్న చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు?

బీజేపీ తప్పు చేసినా, టీడీపీ తప్పు చేసినా ప్రశ్నిస్తాను అన్న నువ్వు విభజన చట్టంలో మన ఆస్తులు రాకుంటే ఎందుకు మాట్లాడలేదు...ఆరోజు షూటింగ్ లో ఉన్నావా సూట్కేసులు తీసుకుంటున్నావా?

పవన్ కి సూటిగా ఛాలెంజ్
నువ్ చేసిన సర్వే మీద నీకు నమ్మకం ఉంటే..అసెంబ్లీపైన జనసేన జెండా ఎగరేస్తానని మాటలు చెప్పడం కాదు..
175 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి సింగిల్ గా పోటీ చెయ్? బస్సుయాత్ర చేస్తానని నువ్వు, పాదయాత్ర చేస్తానని లోకేష్ డేట్లు  అనౌన్స్ చేసి లోకేష్ వాయిదా వేయగానే నువ్వూ వాయిదా వేయడంతోనే అర్థం అవుతోంది మీ ఇద్దరివీ దొంగరాజకీయాలు అని. 

పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది జనం కోసం కాదు చంద్రబాబు కోసం అని స్పష్టంగా అర్థం అవుతోంది.లోకేష్ లాంటి బుర్రలేనోడు, తెలివితక్కువోడు నాకెందుకు కొడుకుగా పుట్టాడని చంద్రబాబు జగన్ గారిని చూసిన ప్రతిక్షణం ఏడుస్తుంటాడు.
ఏరోజైతే లోకేష్ టీడీపీలో అడుగుపెట్టాడో ఆ రోజు నుంచే ఆ పార్టీ పతనం అయిపోయింది. ఎద్దు ఎద్దుల బండి ఎక్కిరావడం చూసి ప్రజలు నవ్వతున్నారు.

వ్యవసాయం దండగ అని తన పుస్తకంలో రాసుకుని, రైతల మీద కేసులు పెట్టి, వాళ్ల ఆత్మహత్యలకు కారణమైన చంద్రబాబు ఆయన కొడుకు కలిసి జగన్ గారిని రైతు ద్రోహి అంటున్నారు.  తన తండ్రి రైతులకు ఎన్నో చేసి రైతుబాంధవుడిగా నిలిచినట్టే వైయస్ జగన్ అంతకంటే ఎక్కువగా రైతులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. లక్షా ఇరవై ఏడు వేల కోట్లు కేవలం వ్యవసాయ రంగానికే ఖర్చు పెట్టారు సీఎం వైయస్ జగన్. ఇందులో 83వేల కోట్లు సంక్షేమ పథకాల ద్వారా అందిస్తే 44వేల కోట్లు ధాన్యం సుకరణకు అందించారు. 

14 ఏళ్లు సీఎంగా ఉన్న బాబు రైతుల గురించి ఏమాత్రం ఆలోచన చేయలేదు. నేడు ప్రజలను మోసం చేస్తూ, వైసీపీ నేతలపై బురద చల్లుతున్నాడు.  నేడు ధనిక రాష్ట్రాలు కూడా చేయలేని పథకాలు మన ప్రభుత్వం అందిస్తోంది. 
రైతుభరోసాకి 23వేల కోట్లు, రైతులకి ఉచిత విద్యుత్ కోసం 35వేల కోట్లు, ఉచిత పంటల బీమాకు 6,600 కోట్లు, ధరల స్థిరీకరణకు 3వేల కోట్లు, ప్రకృతి వైపరీత్యాల నిధి కోసం 2వేల కోట్లు, సున్నావడ్డీ రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ, రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి, విత్తనాలు, ఎరువులు, పనిముట్లు వాళ్ల ఇంటి వద్దకే అందిస్తున్నాం. వారి పండించన పంటను అమ్ముకునే విధంగా సాయం అందిస్తూ ఎంతో మేలు చేస్తోంది వైయ‌స్ జగన్ ప్రభుత్వం. 

ఇంత గొప్పగా చేసారు కనుకే వ్యవసాయ అనుబంధ రంగ వృద్ధి రేటు పెరిగింది.  ఈ మూడేళ్లలో ఏటా సగటున  16లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులు పెరిగాయి. చంద్రబాబు ప్రభుత్వం రైతులనుదగా చేసింది. 87,612 కోట్లు రైతులకు రుణమాఫీ చేస్తానని హ్యాండిచ్చాడు. 9 గంటలు ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చి, ఉచిత విద్యుత్ బకాయిలు 8,700 కోట్లు ఎగనామం పెట్టాడు. 1100 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టాడు. 960 కోట్ల ధాన్యం బకాయిలు ఎగ్గొట్టాడు. 563 కోట్ల విత్తనాల సబ్సిడీ బకాయిలు పెట్టిపోయాడు. బాబు హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఇవ్వాల్సిన 23 కోట్ల నష్టపరిహారం కూడా ఎగ్గొట్టి పోయాడు. బాబు అంత నికృష్టుడు, దరిద్రుడు, మనసులేనివాడు, మోసగాడు ఎవరైనా ఉన్నారా? అని  మంత్రి ఆర్కే రోజా ప్ర‌శ్నించారు.

తాజా వీడియోలు

Back to Top