సింహం ఒక్క అడుగు వెనక్కి వేస్తే ఓడినట్లు కాదు

 మంత్రి ఆర్కే రోజా 
 

 చిత్తూరు: సింహం ఒక్క అడుగు వెనక్కి వేస్తే ఓడినట్లు కాదని మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, రూ.కోట్లు పెట్టి నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని మండిపడ్డారు. ‘‘ఒక ఎమ్మెల్సీ గెలిచి చంద్రబాబు హంగామా చేస్తున్నారు. పులివెందుల చెక్‌పోస్ట్‌ను కూడా తాకలేరు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు 175 గెలుస్తాం. చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు’’ అంటూ మంత్రి రోజా దుయ్యబట్టారు. 
 

చంద్రబాబు క్యారెక్టర్‌ లేని వ్యక్తి: ఎంపీ మిథున్‌రెడ్డి
విజయవాడ: ఆధారాలతోనే నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశామని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. వైయ‌స్ జగన్‌ను విభేదించిన వారికి ఓటమి తప్పదన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘గతంలో 23 మంది ఎమ్మెల్యేలకు పట్టిన గతే వీళ్లకూ పడుతుంది. క్రాస్‌ ఓటింగ్‌ చేసిన వాళ్లకు సీట్లు లేవని సీఎం ముందే చెప్పారు. చంద్రబాబు క్యారెక్టర్‌ లేని వ్యక్తి. అనైతికంగా ఎమ్మెల్యేలను కొని ఎన్టీఆర్‌ని ఎలా దించేశారో అందరికీ తెలుసు’ అంటూ మిథున్‌రెడ్డి మండిపడ్డారు.

Back to Top