చంద్రబాబుని అందరు బోగస్ బాబుగా పిలుస్తున్నారు

మంత్రి ఆర్కే రోజా

తిరుపతి: చంద్రబాబుని అందరు బోగస్ బాబుగా పిలుస్తున్నారని మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం విఐపీ దర్శన సమయంలో మంత్రి రోజా దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. అనంతరం ఆలయం అర్చకులు ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలు అందచేసారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి రోజా చంద్రబాబుపై ఘాటుగా విమర్శలు చేశారు.

 
బోగస్ సర్వేలు చేయించే చంద్రబాబుని అందరు బోగస్ బాబుగా పిలుస్తున్నారని అన్నారు. పది రోజులకి ముందు సీఎం అయినా మహారాష్ట్ర సీఎంకు టాప్ 5 ర్యాంకు, మూడు సంవత్సరాలుగా అన్ని పథకాలను అమలు చేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్‌కి అట్టడుగు ర్యాంకు ఇవ్వడంపై రోజా మండిపడ్డారు. చంద్రబాబు, నారా లోకేష్‌కి చిన్న మెదడు చిట్లిపోయిందని, త్వరలోనే మానసిక వైకల్య కేంద్రంలో చంద్రబాబు చేర్పించాలని మంత్రి రోజా నిప్పులు చెరిగారు.

తాజా వీడియోలు

Back to Top