జగనన్న సైనికుల్లా సంక్షేమాన్ని ప్రయాణికులకు వివరించండి

గతంలో ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్ల గురించి ఎవరైనా ఆలోచించారా..?

డ్రైవర్‌ సోదరుల జీవితాల్లో సీఎం వైయస్‌ జగన్‌ వెలుగులు నింపారు

పాదయాత్రలో ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు

టీడీపీ వస్తే సంక్షేమ పథకాలు, మన పిల్లలు చదువులు ఆగిపోవడం తథ్యం

వైయస్‌ఆర్‌ వాహనమిత్ర కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్‌

విశాఖపట్నం: పాదయాత్రలో ఆటో, మ్యాక్సీ, ట్యాక్సీ క్యాబ్‌డ్రైవర్ల కష్టాలను చూసి చలించిపోయిన సీఎం వైయస్‌ జగన్‌.. అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరం నుంచే వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకాన్ని అమలు చేస్తూ.. డ్రైవర్‌ సోదరుల జీవితాల్లో వెలుగులు నింపారని రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్‌ అన్నారు. వరుసగా నాల్గవ సంవత్సరం 2,61,516 మంది ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ డ్రైవర్లకు వాహన మిత్ర సాయం వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ కానుందని చెప్పారు. వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం ద్వారా ఇప్పటి వరకు రూ.1,026 కోట్లను సీఎం వైయస్‌ జగన్‌ ఖర్చు చేశారని చెప్పారు. 

విశాఖలో వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం వరుసగా నాల్గవ సంవత్సరం ప్రారంభోత్సవంలో మంత్రి విశ్వరూప్‌ పాల్గొని మాట్లాడారు. ‘వైయస్‌ జగన్‌ పాదయాత్రలో ఆటో సోదరులంతా కలిసివచ్చి అడుగులో అడుగు వేశారు. అధికారంలోకి వస్తే ఆటో సోదరుల జీవితాలను మారుస్తానని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం తొలి సంవత్సరమే.. నాలుగు నెలల ముందుగానే వాహన మిత్ర కార్యక్రమాన్ని తీసుకువచ్చి డ్రైవర్ల జీవితాల్లో వెలుగులు నింపారు. 

వాహన మిత్ర ద్వారా డ్రైవర్లను, అమ్మ ఒడి, విద్యా కానుక ద్వారా, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన వంటి పథకాలతో ఆ కుటుంబాలకు తోడుగా నిలుస్తుంది. నిరుపేద పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుంది. బహుశా భారతదేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఇన్ని వినూత్న కార్యక్రమాలు అమలు చేసిన దాఖలాలు లేవు. సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని చూసి అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటాయి. 

ఆటో సోదరుల జీవితాల్లో ఇప్పటి వరకు రూ.1,026 కోట్లు జమ చేశారు. గతంలో ఏ ప్రభుత్వమైనా, ఏ ముఖ్యమంత్రి అయినా ఆటో సోదరుల గురించి ఆలోచించారా..? ప్రతి సామాజిక, కార్మిక వర్గాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ఆదుకుంటున్నారు. అర్హత ఉన్నవారందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. గడపగడపకూ వెళ్తున్నప్పుడు చూస్తున్నాం.. ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షల నుంచి మూడున్నర లక్షల వరకు లబ్ధిచేకూరిందని చెబుతున్నారు. 

సీఎం వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉంటేనే సంక్షేమ పథకాలు అమలవుతాయి. లేకపోతే ఆగిపోతాయని చంద్రబాబు చెప్పకనే చెబుతున్నాడు. టీడీపీ వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోవడం తథ్యం, మన పిల్లలు చదువులు ఆగిపోవడం తథ్యం..అమ్మ ఒడి, చేయూత, ఆసరా రాకుండా చేస్తారు. ఆటో సోదరులు, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లు అంతా ప్రచారకర్తలుగా పనిచేయాలి. లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేరుస్తుంటారు. మీరంతా జగనన్న సైనికుల్లా, సంక్షేమ పథకాల గురించి ప్రయాణికులకు తెలియజేయండి. సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకత గురించి వివరించండి. 2024లో వైయస్‌ఆర్‌ సీపీ గెలుపొందాల్సిన చారిత్రక అవసరాన్ని ఆటోలో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను’ అని మంత్రి విశ్వరూప్‌ అన్నారు. 
 

Back to Top