ఓటింగ్‌ జరగకపోతే చెల్లదు

శాసనమండలి చైర్మన్‌ మళ్లీ సభ నిర్వహించాలి

డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌

 

సచివాలయం: శాసనమండలి చైర్మన్‌కు పదవిలో కొనసాగే అర్హత లేదని, తక్షణమే మండలి చైర్మన్‌ రాజీనామా చేయాలని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ డిమాండ్‌ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విచక్షణాధికారం పేరుతో సభలో చైర్మన్‌ అసహ్యంగా ప్రవర్తించారన్నారు. వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్‌ కమిటీకి ఇంకా వెళ్లలేదని, చైర్మన్‌ మళ్లీ సభ నిర్వహించాలన్నారు. సెలెక్ట్‌ కమిటీకి పంపాలన్న నిర్ణయంపై ఓటింగ్‌ జరగకపోతే అది చెల్లదన్నారు. టీడీపీ సభ్యులకు ప్రజాస్వామ్య విలువలు తెలియవని, చట్టసభలను దారుణంగా అవమానించారని ధ్వజమెత్తారు.

Back to Top