భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం

 అసెంబ్లీలో భూయాజమాన్య హక్కుల బిల్లుపై చర్చ

బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి పిల్లి సుభాస్‌ చంద్రబోస్‌

అమరావతి: భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు భూ యాజమాన్య హక్కుల బిల్లు ఉపయోగపడుతుందని మంత్రి పిల్లి సుభాస్‌ చంద్రబోస్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో భూ యాజమాన్య హక్కుల బిల్లును మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై సోమవారం చర్చ జరిగింది. పిల్లి సుభాస్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ..భూ స్థితిని యధాతథంగా లెక్కించడం గతంలో జరుగలేదన్నారు. ఎక్కడో కూర్చొని, ఏదో రాసి మన ముందు పెడతారని తెలిపారు. అది వాస్తవమా? కాదా అన్నది విచారణ చేయడంతోనే ఉన్న సమయం పూర్తవుతుందన్నారు. భూస్థితిని నమోదు చేసే కార్యక్రమాన్ని కచ్చితంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఒకసారి భూ యజమాని హక్కును నమోదు చేసిన తరువాత వెనుక చరిత్రలోకి వెళ్లకుండా ఉండాలన్నారు. లొసుగులను పట్టుకొని సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టు తిరగడం సరైంది కాదన్నారు. కొన్నవారు కోర్టుల చుట్టూ తిరిగి అప్పుల పాలు కావడం జరుగుతుందన్నారు. 
 

Back to Top