హెరిటేజ్‌ దోపిడీ బయటపడుతుందని భయం

ఉపాధి హామీ అవకతవకలపై విజిలెన్స్‌ ఎంక్వైరీ జరుగుతోంది

సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని

అసెంబ్లీ: చంద్రబాబు హయాంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగాయని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. అసెంబ్లీలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనుల అవకతవకలపై విజిలెన్స్‌ విచారణ జరుగుతుందని, విచారణ జరుగుతున్నప్పుడు బిల్లులు ఎలా చెల్లిస్తారని ప్రతిపక్ష సభ్యులను ప్రశ్నించారు. ఎంక్వైరీ రిపోర్టు రాగానే నాణ్యత ప్రమాణాలు పాటించిన పనులు బిల్లులు చెల్లిస్తామన్నారు. 

ఏపీ అమూల్‌ ప్రాజెక్టుపై డిబేట్‌ కోరిన ప్రతిపక్షంలో చర్చలో పాల్గొనకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఏపీ అమూల్‌ ప్రాజెక్టుపై చర్చ వస్తే.. ఇన్నాళ్లూ హెరిటేజ్‌ను అడ్డం పెట్టుకొని చేసిన తప్పులు, రైతులను ఏ విధంగా దోచుకుంటున్నారనేది ప్రజలకు తెలిసిపోందని ప్రతిపక్షం చర్చ జరగనివ్వడం లేదన్నారు. సభలో గందరగోళం సృష్టిస్తూ, సభా సంప్రదాయాలను ఉల్లంఘించిన టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేస్తూ మంత్రి పేర్ని నాని ప్రివిలేజ్‌ మోషన్‌ను ప్రవేశపెట్టారు. 

 

Back to Top