తిరుపతి: ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైయస్‌ఆర్ సీపీ అభ్యర్థి గురుమూర్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఓటర్లను కోరారు. సామాన్యుడిని పార్లమెంట్‌కు పంపించే అవకాశాన్ని సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కల్పించారన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మంత్రి పేర్ని నాని, ఉప ఎన్నిక అభ్యర్థి గురుమూర్తి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ఒక సామాన్యుడు ప్రజాప్రతినిధిగా పార్లమెంట్‌లోకి అడుగుపెడితే ఈ ప్రాంతానికి మేలు చేయగలడు అనే ఉద్దేశంతో గురుమూర్తిని ఉప ఎన్నిక బరిలో నిలబెట్టారని, మనలో ఒకడిగా, సామాన్యుడిగా పేద కుటుంబం నుంచి వచ్చిన గురుమూర్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. 2019 ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే మెండైన విజయాన్ని ఇవ్వమని అభ్యర్థిస్తున్నామన్నారు. ఈ రాష్ట్రంలోని ప్రతి వర్గానికి మేలు చేస్తున్న సీఎం వైయస్ జగన్ ఆలోచనకు మద్దతు ఇవ్వాలని కోరారు. కేవలం పేద వర్గాలే కాకుండా మధ్య తరగతి, శ్రామిక వర్గాలు ప్రతి ఒక్కరి బాగోగుల పట్ల బాధ్యత తీసుకున్న సీఎం వైయస్ జగన్ ప్రభుత్వానికి ఈ ఎన్నిక రెఫరెండంగా స్వీకరించామన్నారు. తిరుపతి ప్రజల నమ్మకాన్ని మరోసారి వైయస్ జగన్ నాయకత్వానికి ఇస్తూ డాక్టర్ గురుమూర్తిని అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.