చంద్రబాబు ముసలి రౌడీ.. పవన్‌ కళ్యాణ్‌ మాటల రౌడీ

 రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి  పేర్నినాని

తనను ఓడించిన విజయవాడ వాసులపై చంద్రబాబు అక్కసు

ఓట్లు అడిగేందుకు రాలేదంటూ బాబు ఆత్మ వంచన

టీడీపీ హ‌యాంలో కనీసం ఫ్లైఓవర్‌ను కూడా పూర్తి చేయలేక‌పోయారు 

తన పాపపు సొమ్మును హెరిటేజ్‌ లెక్కల్లో చూపించిన చంద్రబాబు
 
రోజుకో ప్రాంతానికి వెళ్లి... మీరంటేనే నాకు ప్రాణం అంటున్నాడు

దుర్గమ్మ కళ్ళు తెరవబట్టే... నీకు ప్రజలు శాస్తి చేశారు

ఆస్తిపన్ను పెంచుతున్నారంటూ మరోసారి తప్పుడు ప్రచారానికి దిగజారాడు

 తాడేపల్లి: మా మంత్రులను రౌడీలంటున్న చంద్రబాబు నిజమైన ముసలి రౌడీ, ఈ దేశంలో రాజకీయ నాయకుడిగా ఎక్కువ పాపాలు చేసిన వ్యక్తి అని మంత్రి పేర్ని నాని మండిప‌డ్డారు. మాది రౌడీరాజ్యం అయితే ఇంత స్వేచ్చగా తిరగగలిగేవాడేనా?  మేం సాధు జీవులం కాబట్టే చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఈ రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ.. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నార‌ని పేర్కొన్నారు.  పవన్‌ తన మాటలతో ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయడం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.  టీడీపీ హయాంలో ఎన్ని హత్యలు, దోపిడీలు, దౌర్జన్యాలు చేశావో ప్రజలకు తెలుసు అన్నారు.  అందుకే 2019 ఎన్నికల్లో ఓటమికి ఈవీఎంలను సాకుగా చూపించావ‌ని పేర్కొన్నారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్యాలెట్‌ ద్వారా ప్రజలు ఇచ్చిన తీర్పులో 80 శాతానికి పైగా వైయస్సార్‌సీపీని బలపర్చార‌ని గుర్తు చేశారు. మరి దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతార‌ని ప్ర‌శ్నించారు? మున్సిపాలిటీల్లో బ్యాలెట్‌తో జరుగుతున్న ఈ ఎన్నికల్లో మరోసారి తెలుగుదేశం పార్టీకి పరాభవం తప్పదని పేర్కొన్నారు. ఆదివారం తాడేప‌ల్లిలోని  వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో  శాఖ మంత్రి  పేర్ని వెంకట్రామయ్య (నాని) మీడియాతో మాట్లాడారు. 

 ఆత్మ వంచన:
మున్సిపల్‌ ఎన్నికల కోసం విజయవాడకు వచ్చిన చంద్రబాబు తనను ఓడించిన ప్రజలపై అక్కసుతో శాపనార్థాలు పెట్టాడు. తాను ఓట్లు అడగడానికి రాలేదంటూ, అధికారం తనకు అవసరం లేదంటూ ఆత్మవంచన చేసుకుంటూ మాట్లాడారు. నిద్రపోతున్న విజయవాడ ప్రజలను మెలుకొలిపేందుకే తాను వచ్చానంటూ చంద్రబాబు చెప్పుకోవడం ఆయన మతిస్థిమితం సక్రమంగా లేదనేందుకు నిదర్శనం. తాను అధికారంలో వున్న అయిదేళ్ళలో బెజవాడలో కేంద్రం మంజూరు చేసిన ఒక్క ఫైఓవర్‌ను కూడా పూర్తి చేయలేని దౌర్భాగ్యాన్ని ఆయన ఎలా సమర్థించుకుంటారు? ట్రాఫిక్‌ సమస్యతో ఇబ్బంది పడుతున్న విజయవాడకు కనీసం బైపాస్‌ నిర్మాణం చేపట్టాలనే ఆలోచనే చేయని వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు విజయవాడ ప్రజలపై కపట ప్రేమ చూపించేందుకు నాటకాలు ఆడుతున్నారు’. 

ఆ అర్హత చంద్రబాబుకు లేదు:
ప్రజారంజకంగా పాలిస్తున్న శ్రీ వైయస్‌ జగన్‌ ప్రభుత్వానికి ఎబిసిడి అంటూ చంద్రబాబు పేర్లు పెడుతున్నారు. చంద్రబాబు దోపిడీకి కేరాఫ్‌. ఎవరో రాసి ఇచ్చిన దానిని ప్రాస కోసం మాట్లాడటం తప్ప నిజంగా దోపిడీ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. తన తండ్రి ఖర్జూరనాయుడి రెండెకరాల పొలంతో వేల కోట్ల రూపాయల ఆస్తులను ఎలా ఆర్జించాడో చంద్రబాబు ప్రజలకు వివరించాలి. భారతదేశంలో పాలు, పెరుగు, పిడకలు అమ్ముకుని మీలాగా ఎవరూ ఇన్ని వేల కోట్లు సంపాదించ లేదు. ప్రభుత్వంలో ఉంటూ.. పాపాలు చేస్తూ.. ప్రజల సొమ్మును దోచుకుంటూ.. హెరిటేజ్‌ పేరుతో తప్పుడు లెక్కలు రాయడం వల్లే ఇన్ని వేల కోట్ల ఆస్తి సంపాదించడం వాస్తవం కాదా? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ.. తనను ఎవరూ గమనించడం లేదని భావిస్తుంది. అలాగే చంద్రబాబు తాను హెరిటేజ్‌ను అడ్డం పెట్టుకుని, తన పాపపు సొమ్మును ఎలా పెంచుకుంటూ పోయాడో ఈ రాష్ట్ర ప్రజలు గమనించలేదని అనుకుంటున్నారు. హెరిటేజ్‌ మీ పాపాల పుట్ట. అక్కడ తాండవించేది పాలు, పెరుగు కంపు కాదు.. అవినీతి కంపు’.

ఏ ముఖం పెట్టుకుని వచ్చారు?:
అమరావతిని బాగు చేద్దామని అనుకున్నాను, అమరావతి పోరుకు ఇంటికి ఒకరు రావాలని చంద్రబాబు పిలుపునిస్తున్నారు. అసలు అమరావతి పేరుతో మీరు, మీ వందిమాగధులు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి, ప్రజల ఆస్తులను, వారి ఆకాంక్షలను దోచుకున్నారు.  వేలాది ఎకరాలు అమాయకులైన రైతులను బెదరించి, అదిరించి, మాయమాటలు చెప్పి, ఆశ చూపి, లాక్కున్న భూములను మీ బినామీలకు అప్పగించారు. తాత్కాలిక రాజధాని పేరుతో తెలుగు ప్రజలను మోసం చేశారు. గుంటూరు, విజయవాడలను నాశనం చేశారు. ఏ ముఖం పెట్టుకుని మీరు విజయవాడలో ఓట్లు అడుగుతున్నారు చంద్రబాబూ?’.

ఎక్కడి మాటలు అక్కడే:
ఎక్కడి మాట అక్కడ అప్పగించడం చంద్రబాబుకు అలవాటు. మొన్న కుప్పంకు వెళ్లి ఈ ప్రాంతం అంటేనే నాకు ప్రాణం అన్నారు. నిన్న విశాఖలో మాట్లాడుతూ నిద్రలో కూడా విశాఖ అంటే నాకు ప్రేమ అని చెప్పారు. ఈరోజు విజయవాడ అంటే తనకు ఎనలేని మమకారం అంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు శ్రీమతి ఇటీవల మాట్లాడుతూ నిద్రపోయినా, లేచినా చంద్రబాబు అమరావతి అనే కలవరిస్తారని పేర్కొన్నారు. ఇందులో ఏది నిజం చంద్రబాబూ? దేని మీద నీకు నిజమైన ప్రేమ ఉంది?  అధికారంలో ఉన్నప్పుడు దోచుకోవడం, హెరిటేజ్‌ పేరుతో దాచుకోవడం మీద మాత్రమే మీకు ప్రేమ. మీమీద, మీ కొడుకు మీద మాత్రమే మీకు ప్రేమ’. 

మానసిక రుగ్మతు. వైరాగ్యం:
ఒక్క చాన్స్‌ అని శ్రీ వైయస్‌ జగన్‌ ప్రజలను మోసం చేశారని తప్పుడు విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు. శ్రీ వైయస్‌ జగన్‌ గారి పాలన బాగుండబట్టే పంచాయతీ ఎన్నికల్లో ఎనభై శాతానికి పైగా ప్రజలు విజయాన్ని అందించారు. మీ మోసపూరిత వైఖరిని గ్రహించ బట్టే ప్రజలు, ఆఖరికి మీ నాయకులు, కార్యకర్తలు కూడా మీకు దూరమవుతున్నారు. మీ పాలన దివాలాకోరుతనంతో ఉండబట్టే గత ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. అయినా కూడా గ్రహింపు లేకుండా చంద్రబాబు మానసిక రుగ్మతు, వైరాగ్యంతో మాట్లాడుతున్నారు’.

దీన స్థితిలో చంద్రబాబు:
అమరావతి కోసం ఇంటికి ఒకరు చొప్పున వస్తే.. నువ్వు చేసిన మోసాలు తెలుసుకుని నిన్ను బాదుతారు. అమరావతిలో అసలు మీరేం చేశారని స్థానికులు ప్రశ్నిస్తే, జగన్‌ గారిని ప్రశ్నించాలని ఎలా అంటారు? అమరావతి వీధుల్లోకి వస్తే చంద్రబాబుపై జనం తిరగబడే పరిస్థితి వస్తుంది. విజయవాడలో నీ నాయకులను నువ్వు పక్కన పెట్టుకుని వస్తే.. మీ కార్యక్రమాలకు మేం రామూ అని మీ కార్యకర్తలే అంటున్నారు. ఇదీ నీ దుస్థితి. దుర్గ గుడి కొండ మీద కొబ్బరి చిప్పలు, సైకిల్‌ బెల్లు డిప్పలు అమ్ముకున్న వారిని పక్కన పెట్టుకుని పర్యటన చేయాల్సిన దీనస్థితిలో చంద్రబాబు ఉన్నారు’.

నాశనం చేశావు కాబట్టే..:
దుర్గు గుడిలో అమ్మ వారి వద్ద క్షుద్రపూజలు చేస్తే, అమ్మవారు నిన్ను క్షమిస్తుందా చంద్రబాబూ?  నీలాంటి వారిని వదిలేస్తుందా..? అమ్మవారు మహిమ గల తల్లి కాబట్టే, అమరావతి పేరుతో ఈ ప్రాంత ప్రజలను దోచుకుని, సర్వనాశనం చేశావు కాబట్టే నీకు ఈ శాస్తి చేసింది. ఇకనైనా చంద్రబాబు కళ్లు తెరవాలి.  స్వచ్చమైన రాజకీయాలు చేయాలి. అమరావతిలో మీరేం చేశారు? దేశమంతా తిరిగి చెంబెడు మట్టి, గ్లాసెడు నీరు పోగేశారు. అంతా షో చేశారు. తాత్కాలిక భవనాలు నిర్మిస్తే.. వర్షం వస్తే కారిపోయే పరిస్థితి. రూ.3 వేల కోట్ల ప్రజాధనంతో కట్టిన భవనాలు ఎంత దారుణంగా ఉన్నాయో, మీ అవినీతికి నిదర్శనంగా నిలుస్తున్నాయో ప్రజలు గమనిస్తున్నారు. ఇవే భవనాలను, ఈ నిధులను విజయవాడ, గుంటూరులో ఖర్చు చేసి ఉంటే ఎంత బాగుండేది’.

పారిపోయి వచ్చావు..:
తెలంగాణలో దొంగలా ఓటుకు నోటు కేసులో దొరికిపోయి, అరెస్ట్‌ చేస్తారనే భయంతో అర్థరాత్రి పారిపోయి విజయవాడ వచ్చిన చంద్రబాబు అమరావతినే కాదు ఈ రాష్ట్రాన్ని, బెజవాడను కూడా సర్వ నాశనం చేశారు. విజయవాడలో పరిశ్రమలను తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి మోసం చేశారు. మహానగరం పేరుతో గ్రాఫిక్స్‌ చూపించి అందరినీ దగా చేశారు. అమరావతి ప్రాంతంలో 54 వేల నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆశ్రయం కల్పించేందుకు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రయత్నిస్తే, దుర్మార్గంగా స్టేలు తీసుకువచ్చి అడ్డుకున్నారు. అమరావతిలో చంద్రబాబు చేసిన మోసాన్ని గ్రహించబట్టే మంగళగిరి, తాడికొండ ప్రజలు వైయస్సార్‌సీపీకి ఓటు వేశారు’. 

దిగజారుడు రాజకీయం:
నిత్యం అబద్దాలతో బతకడం అలావాటైన చంద్రబాబు మున్సిపల్‌ ఎన్నికల్లో ఓట్ల కోసం ఆస్తి పన్నులు పెంచుతున్నారంటూ ఈ ప్రభుత్వంపై  తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మచ్చ లేని వైయస్‌ జగన్‌ గారి పాలనపై విమర్శలను చూపించలేక ఆస్తి పన్ను పెంపు అంటూ దిగజారుడు రాజకీయం చేస్తున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీల్లో ఉన్న పన్నులో 15 శాతానికి మించకుండా పెంచే పన్ను ఉండాలని చాలా స్పష్టంగా ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈ రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా పన్నులు పెంచింది, నీటి పన్నులను విధించింది చంద్రబాబు ప్రభుత్వం. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో మద్యం దుకాణాలు ఉండకూడదనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పని చేస్తోంది. చంద్రబాబు హయాంలో మంచినీరు దొరకడం కష్టమయ్యే చోట కూడా మద్యం దొరికేది’. 

ప్రజలు ఎలా నమ్ముతారు?:
అధికారం పోయిన ప్రతిసారీ తాను మారుతున్నాను అని చంద్రబాబు చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో కన్నూమిన్నూ కానక, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు. నాయీ బ్రాహ్మణులను, మత్స్యకారులను మీ తోలు తీస్తాను అంటూ బెదరింపులకు పాల్పడ్డారు. ఇప్పుడు తాను మారాను అంటే ప్రజలు ఎలా నమ్ముతారు?. చంద్రబాబు తనకు అధికారం కొత్త కాదన్నప్పుడు ఎందుకు ప్రజల వద్దకు వస్తున్నారు? హైదరాబాద్‌లోని తన రాజప్రసాదానికి వెళ్ళిపోవచ్చు కదా. ఆంధ్ర రాష్ట్రం అంతా జూబ్లీహిల్స్‌ లోని తన బంగ్లా ముందుకు వచ్చి అయ్యా మీరు రావాలని వేడుకుంటున్నారా? కరోనా వ్యాపించిన సమయంలో ఆయన హైదరాబాద్‌లోనే పడుకున్నారు’.

ఏపీలో సమర్థంగా ఎదుర్కొన్నాం:
కరోనాను సమర్థంగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఎదుర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లో కరోనా సెకండో వేవ్‌ వస్తుంటే, ఎపిలో ఆ ఛాయలు లేవు. సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ నాయకత్వంలో పని చేస్తున్న అధికార యంత్రాంగం వల్లే అది సాధ్యమయ్యింది. ఈ రాష్ట్రాన్ని దోచుకోవడం ఎలాగో తెలిసిన చంద్రబాబు తన హయాంలో విజయవాడ నడి బొడ్డున పేకాట నడిపించాడు. బీమవరంలో పేకాట క్లబ్లులో వెలిసాయి. తండ్రీ, కొడుకులు కలిసి రాష్ట్రంలో పేకాటను వ్యాపారం చేశారు. జగన్‌ గారు సీఎం అయిన తరువాతే ఆ క్లబ్‌లకు సీల్‌ పడింది. నేడు మహిళలు తమ కుటుంబాలను నిలబెట్టారంటూ ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు’. 

పవన్‌ కళ్యాణ్‌ ఎక్కడ?:
కొంతకాలం చంద్రబాబుతో పవన్‌ కళ్యాణ్‌‌ అంటకాగాడు. చంద్రబాబు వెళ్ళమంటే.. రాజధాని అమరావతి ప్రాంతానికి వచ్చి పేదల చేతుల్లోని క్యారేజీ లాక్కని పెరుగన్నం తినేసి, మూతి తుడుచుకుని, విమానం ఎక్కేలోపు ఏం మాట్లాడారో చూశాం. ఈ రోజు బిజెపితో జతకట్టి అమిత్‌ షా, మోదీ చుట్టూ తిరుగుతున్నాడు. నిజంగా పవన్‌కు ప్రజల పట్ల ప్రేమ ఉంటే కేంద్రంతో మాట్లాడి విశాఖ ఉక్కును ఎందుకు కాపాడలేక పోతున్నాడు? ఆనాడు అవసరమైతే కేంద్రాన్ని బెజవాడ బజార్లలోకి తీసుకువస్తానన్న పవన్‌ కళ్యాణ్‌ ఈరోజు ఎందుకు అలా చేయలేకపోతున్నాడు? పవన్‌ కళ్యాణ్‌ది సినిమా జీవితం. ఆయన మాట్లాడే సొల్లు కబుర్లు ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ఎన్నికలు కూడా ఆయనకు సంపాదనే. జనరల్‌ ఎన్నికల్లో ఆయనకు సినిమాల్లో మొదటిరోజు కాసులు రాలినట్లు డబ్బు రాలుతూ ఉంటాయి. బీఫారాలు కూడా వేరే వారి చేతుల్లోనే పెడతారు.  అమిత్‌ షా, మోదీతో మాట్లాడి విశాఖ ఉక్కును కాపాడేందుకు ప్రతాపం చూపించాలని డిమాండ్‌ చేస్తున్నామ‌ని మంత్రి పేర్ని నాని తేల్చి చెప్పారు.

Back to Top