మంగ‌ళ‌గిరిలో అట‌వీ శాఖ కార్యాల‌యాన్ని ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి

గుంటూరు: మంగళగిరిలో రాష్ట్ర అటవీ శాఖ కార్యాలయాన్ని ఇంధన, అటవీ, పర్యావరణ, భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. అనంత‌రం నూత‌న కార్యాల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉంద‌న్నారు. సంక్షేమ ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల‌కు మేలు జరుగుతోంద‌ని చెప్పారు. రాష్ట్రంలో ఇంత గొప్ప పరిపాలన ఎప్పుడూ చూడలేదన్నారు. చంద్రబాబు, పవన్‌లు చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకోవడం లేదని, ఎవరెంత త‌ప్పుడు ప్ర‌చారం చేసినా ప్రజల అండతో వైయ‌స్ జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్య‌క్తం చేశారు. 

Back to Top