నాణ్య‌మైన‌ విద్యుత్ అందించ‌డ‌మే ల‌క్ష్యం

ఎన్టీటీపీఎస్ స్టేజ్‌-5, కృష్ణ‌ప‌ట్నం స్టేజ్‌-2 నిర్మాణం వేగ‌వంతం చేయండి

అధికారుల‌కు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశం

స‌చివాల‌యం: ప్ర‌జ‌ల‌కు నాణ్య‌మైన‌ విద్యుత్‌ను అందించ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని రాష్ట్ర ఇంధ‌న శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అన్నారు. సచివాలయంలో ఏపీ జెన్క్ అధికారులతో కొత్త విద్యుత్ ప్రాజెక్ట్‌ల‌పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వ‌హించారు. మూడు నెలల్లో ఎన్టీటీపీఎస్ స్టేజ్-5 పూర్తి చేయాలని, కృష్ణపట్నం స్టేజ్ -2  ప్లాంట్ నిర్మాణం వేగవంతం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ రెండు ప్లాంట్‌లు వినియోగంలోకి వస్తే 1600 మెగావాట్ల అదనపు విద్యుత్ అందుబాటులోకి వ‌స్తుంద‌ని చెప్పారు. కొత్త హైడల్ ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాల‌ని సూచించారు. దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత తీవ్రంగా ఉంద‌ని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో విద్యుత్ కోతలు తక్కువగా ఉన్నాయ‌ని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top