ప్రజాస్వామ్యానికి అద్దంపట్టేలా పంచాయతీ ఎన్నికల ఫలితాలు

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

పంచాయతీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీకి 80.37 శాతం స్థానాలు 

కుట్రలతో ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు ప్రయత్నించారు

సీఎం వైయస్‌ జగన్‌ పాలన పట్ల ప్రజలు ఆకర్షితులయ్యారు

నిత్య విద్యార్థిగా వైయస్‌ జగన్‌ సంక్షేమానికి పాడుతున్నారు

సజావుగా ఎన్నికలు జరిగితే 90 శాతానికి పైగా వైయస్‌ఆర్‌సీపీ గెలిచేది

రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో ఇంతకంటే మెరుగైన ఫలితాలు వస్తాయి

తాడేపల్లి:  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు కాబట్టే పంచాయతీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ అభిమానులు గెలిచారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఇది వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విజయంగానే మేమంతా భావిస్తున్నామని స్పష్టం చేశారు.  సీఎం వైయస్‌ జగన్‌పై ప్రజల్లో నమ్మకం మరింత నమ్మకం పెరిగిందని పేర్కొన్నారు. ప్రజాస్వమ్యానికి అద్దంపట్టేలా పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలు సజావుగా జరిగి ఉంటే వైయస్‌ఆర్‌సీపీకి 90 శాతం పంచాయతీలు దక్కేవని చెప్పారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు చేసి పంచాయతీ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నించారని, అవేవి కూడా రాష్ట్రంలో సాగలేదన్నారు. సోమవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పని తీరుకు పంచాయతీ ఎన్నికలు అద్దం పట్టాయి. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు ప‌టా పంచాలు అయ్యాయి. చంద్రబాబు ఈ ఎన్నికల్లో చతికిలపడ్డారు. చంద్రబాబు ఒటమి చాలా చక్కగా కనిపిస్తున్నా..టీడీపీ పునాదులు కదిలినా కూడా ఆ పార్టీ 50 శాతం గెలిచిందని  ఎల్లో మీడియాలో రాయించుకున్నారు. రాష్ట్రంలో 13,095 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. వాటిలో వైయస్‌ఆర్‌సీపీకి 10524 పంచాయతీలు దక్కాయి. 80.37 శాతం వైయస్‌ఆర్‌సీపీ అభిమానులు సర్పంచ్‌లుగా గెలిచారు. టీడీపీకి 2063 పంచాయతీల్లో గెలిస్తే..15.75 శాతం స్థానాలు దక్కించుకుంది. ఇతరులు 488 మంది గెలిచారు. 3.8 శాతం గెలిచారు. 

సజావుగా జరిగి ఉంటే..
పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగి ఉంటే వైయస్‌ఆర్‌సీపీ 90 శాతం స్థానాలు గెలిచేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మాకు దాదాపు 90 శాతం వస్తాయని ముందే చెప్పాం. అయితే ఈ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ ఎన్ని అవాంతరాలు ఎదుర్కొన్నామో అందరికీ తెలుసు.  ఈ విజయానికి మా ముఖ్యమంత్రి ఎన్నికల హామీలు నెరవేర్చడం, వైయస్‌ జగన్‌ చెప్పిన మాటకు కట్టుబడి ఉంటారని ప్రజలు విశ్వసించి, ఇలాంటి విజయాన్ని ఇచ్చారు. ప్రజల్లో వైయస్‌ జగన్‌పై మరింత నమ్మకం పెరిగింది. 

 రాబోయే ఎన్నికల్లో కూడా ఇంతకంటే మంచి ఫలితాలు సాధిస్తాం. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి అద్దం పట్టేలా జరిగాయి. తప్పనిసరిగా జాతీయ స్థాయిలో వైయస్‌ జగన్‌ పని తీరును ఉత్తమ ముఖ్యమంత్రిగా ప్రతిభింబించేలా ఈ ఎన్నికలు ఉపయోగపడ్డాయి. వైయస్‌ఆర్‌సీపీ బలం పెరిగింది. రాష్ట్రంలో వైయస్‌ఆర్‌సీపీకి ప్రజలు ఏకపక్షంగా పట్టం కట్టారు. సీఎం వైయస్‌ జగన్‌ ప్రతిరోజు కూడా ఒక విద్యార్థి మాదిరిగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమతూకంగా అమలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు రోజుకు 18 గంటలు పని చేసేవాడిని అని చెప్పేవారు. మా ముఖ్యమంత్రి వైయస జగన్‌ నియమ నిబద్ధలతో శాఖలతో సమీక్షలు చేస్తూ..వాటిని ఏవిధంగా అధిగమించాలని పని చేశారు. వెనుకబడిన ప్రాంతాలను ఎలా అభివృద్ధి చేయాలి. సాగునీరు, తాగునీరు ఎలా ఇవ్వాలని ఆలోచన చేస్తూ..ఆ దిశగా పనులు చేయిస్తున్నారు. గోదావరి జిల్లాల్లో వాటర్‌ గ్రిడ్‌ ద్వారా మంచినీళ్లు అందిస్తాం. సీఎం వైయస్‌ జగన్‌ పాలన పట్ల ప్రజలు ఆకర్శితులయ్యారని మంత్రి పెద్దిరెడ్డ రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.

 

Back to Top