అధికార దుర్వినియోగానికి మూల్యం చెల్లించక తప్పదు

మంత్రిని ఇంట్లో నిర్బంధించడం కుదురుతుందా..?

నిమ్మగడ్డ ప్రివిలేజ్‌ కమిటీ ముందు దోషిగా నిలబడతారు

ప్రభుత్వ డబ్బులతో ప్రతిపక్షానికి సేవలు చేస్తున్నాడు

బాబును మళ్లీ సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని నిమ్మగడ్డ దురాలోచన

ఎస్‌ఈసీపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజం

తిరుపతి: నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ప్రభుత్వ డబ్బు తీసుకుంటూ.. ప్రతిపక్షానికి సేవలు చేస్తున్నాడని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. కోటరీని ఉపయోగించుకొని చంద్రబాబును మళ్లీ సీఎం కూర్చీలో కూర్చోబెట్టాలనే దురాలోచనతో ఎస్‌ఈసీ పనిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రిని ఇంట్లో నిర్బంధించడం కుదురుతుందా..? అనే ఆలోచన కూడా లేకుండా ఆర్టర్‌ ఇవ్వడం అంటే.. ప్రభుత్వం, మంత్రులపై నిమ్మగడ్డ ఎంత కక్షగట్టారో అర్థం అవుతుందన్నారు. నిమ్మగడ్డ రమేష్‌ పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడన్ని ధ్వజమెత్తారు. 

తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కచ్చితంగా ప్రివిలేజ్‌ కమిటీ ముందుగా దోషిగా నిలబడతారని, తప్పనిసరిగా అసెంబ్లీకి రావాల్సి ఉంటుందన్నారు. నిమ్మగడ్డకు మూడేళ్ల జైలు శిక్ష కూడా పడుతుందన్నారు. స్టేట్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేస్తున్నాడని, దీనికి తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఎస్‌ఈసీ వ్యక్తిగత ఆదేశాల మేరకు పనిచేసే అధికారులకు కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు.  

నిమ్మగడ్డ ఆఫీస్‌ ఖర్చులకు రూ.43 లక్షలు ప్రభుత్వమే ఇచ్చిందని, ప్రభుత్వంపై పోరాడేందుకు లాయర్‌ ఖర్చులు రూ. కోటి ఇవ్వాలని హైకోర్టులో కంటెమ్ట్‌ పిటీషన్‌ సీఎస్‌పై ఫైల్‌ చేశాడని ధ్వజమెత్తారు. ఒక పక్క ప్రభుత్వ డబ్బులు తీసుకుంటూ.. మరోవైపు చంద్రబాబుకు తొత్తుగా వ్యవరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియాగా నిమ్మగడ్డ తనను తాను ఊహించుకొని ఆంక్షలు, ఆర్డర్స్‌ జారీ చేస్తున్నాడని, ఇది పూర్తిగా అధికార దుర్వినియోగమన్నారు. పిచ్చి ఆదేశాలిస్తే.. ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా అనేది గుర్తుంచుకోవాలని నిమ్మగడ్డకు సూచించారు. 
 

Back to Top