నాలుగు లక్షల ఉద్యోగాలు దేశ చరిత్రలో మొదటిసారి

  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
 

సచివాలయం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారి మానసపుత్రిక. గ్రామ సచివాలయాలు రావడానికి ముఖ్య కారణం జన్మభూమి కమిటీల పేరుతో జరిగిన అక్రమాలు, ఆశ్రిత పక్షపాత కేటాయింపులు, పార్టీకి సంబంధించిన వారికే పథకాలు అందించడం.
పేదలందరికీ పార్టీ రహితంగా సంక్షేమ పథకాలు అందాలని, పేదరికమే కొలబద్దగా ఉండాలి తప్ప కుల, మత ప్రాతిపదిక ఉండకూడదని, పథకాల అమలు పారదర్శకంగా జరగాలని సచివాలయాలను ఏర్పాటు చేసారు.
ప్రతి రెండువేల మంది జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చేయడం జరిగింది. గిరిజన, కొండ ప్రాంతాల్లోనూ జనాభా ప్రాతిపదికన కాకుండా 2000మందికంటే తక్కువ జనాభా ఉన్న ఊరిలో సచివాలయాలు ఏర్పాటు చేసాం. 11158 గ్రామ సచివాలయాలు, 3786 వార్డు సచివాలయాలు ఏర్పాటయ్యాయి. మొత్తం 14,944 సచివాలయాలు రాష్ట్రం మొత్తం మీద ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ సచివాలయాల్లో అన్ని శాఖలకూ సంబంధించి 12 నుంచి 14 దాకా విలేజ్ సెక్రటరీలు ఉంటారు. వీరు కోఆర్డ్ నేట్ చేసి ప్రజలకు అందాల్సిన పథకాలను అందేలా చేస్తారు. పంచాయితీ సెక్రెటరీ, విఆర్‌వో, సర్వే అసిస్టెంటు, ఎఎన్‌ఎమ్‌, వెటర్నరీ అసిస్టెంట్, మహిళా పోలీసు, ఇజనీరింగ్ అసిస్టెంట్, జూనియర్ లైన్ మేన్, విలేజ్ అగ్రి అసిస్టెంట్, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, పంచాయితీ సెక్రటరీ గ్రేడ్ 4, వెల్ఫేర్ మరియు ఎడ్యుకేషన్ అసిస్టెంట్, ఫిషరీస్ అసిస్టెంట్, కల్చరల్ అసిస్టెంట్ ఇలా 14 శాఖలకు చెందిన సెక్రటరీలు సచివాలయంలో అందుబాటులో ఉంటారు.
11158 గ్రామ సచివాలయాల్లో  95088 మంది
3786 వార్డు సచివాలయాల్లో 31648 మంది పోస్టింగులు అందుకున్నారు. మొత్తంగా ఈ సచివాలయాలకు 1,26,728 పోస్టులు మంజూరు చేయడం జరిగింది.
నోటిఫై చేసిన 1,26,728 పోస్టులకు 1,21,318 మందికి నియమాక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. 1,13,46 మంది అభ్యర్థులు విధుల్లోకి చేరగా కొంత మంది రెండు, మూడు కేటగిరీల్లో సెలక్ట్ కావడం వల్ల రీలొకేట్ చేయడం జరిగింది. వేకెన్సీలు 16,581 ఉన్నాయి.
ఎంపికైన వారికి శాఖాపరమైన శిక్షణ కోసం రూ.60.12 కోట్లు విడుదల చేసారు.

జాబ్ చార్ట్ ప్రకారం సేవలు సమర్థవంతంగా అందించడానికి, అవసరమైన జ్ఞానం, నైపుణ్యంతో కార్యనిర్వహణకు సంసిద్ధం చేయడానికి పంచాయితీరాజ్ శిక్షణా కేంద్రాలు బాపట్ల, సామర్లకోట, శ్రీకాళహస్తి మొదలైన చోట్ల సంబంధిత డిపార్టుమెంట్లలో శిక్షణ ఇచ్చారు.
4670 సచివాలయాలకు కొత్త భవనాలు నిర్మించాలి
ఇన్ఫ్రా స్ట్రక్చర్ కోసం, ఫర్నిచర్ మరియు స్టేషనరీ కోసం రూ.200 కోట్లు విడుదల చేయడం జరిగింది.
టెండర్లు పిలిచి డిసెంబర్ 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం.
డెస్క్ టాప్ లు, యూపీఎస్, మల్టీ ఫంక్షన్ ప్రింటర్లు, లామినేషన్ మిషన్లు, జీ సిమ్ కార్డులు, స్మార్ట్ ఫోన్లు, ఐరిష్ మరియు ఫింగర్ ప్రింట్ స్కానర్ల సేకరణ ఏపీటిఎస్ చేస్తోంది. దీనికి టెండర్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయ్యింది.
సెక్రటరీల పని తీరును కూడా ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఆటంకం అంతరాయం లేని సేవలు, సమస్యలు త్వరితంగా పరిష్కరించడం జరుగుతుంది. ప్రతి రోజూ స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల ఫిర్యాదులు స్వీకరిస్తారు. వాలంటీర్లు, సచివాలయంలోని కార్యనిర్వాహక అధికారుల సాయంతో 72 గంటల్లోపు ప్రాధాన్యతతో పరిష్కరిస్తారు.
సెక్రెటరీలు 1,26,728
వాలంటీర్లు 2,65,989
లైన్ మెన్ - 7,989
మొత్తంగా 400706 ఉద్యోగాలు

ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించడం దేశంలోనే ఇదే మొదటిసారి.
ఇది చారిత్రాత్మకం.
బాబొస్తే జాబొస్తుందని చెప్పిన గత ప్రభుత్వపు ముఖ్యమంత్రిలా కాదు. వైయస్ జగన్ వచ్చిన మూడునెలలలోనే లక్షలాది ఉద్యోగాలను అందించి రికార్డు సృష్టించారు.
ముఖ్యమంత్రిగారి స్వీయ పర్యవేక్షణలో, పారదర్శకంగా, చిన్న సమస్య కూడా తలెత్తకుండా పరీక్షలు నిర్వహించాం.
SCERT (స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్) ద్వారా జనరల్ నాలెడ్జ్, మహిళా పోలీస్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్, విలేజ్ సెక్రట్రీ, వార్డ్ ఎడ్మినేస్ట్రేటివ్ సెక్రెటరీ పేపర్లను తయారుచేయించాం.
ఇంజనీరింగ్ అసిస్టెంటు, డీజిల్ అసిస్టెంట్ JNTU అనంతపురం
వార్డ్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పేపర్లు ఆ డిపార్టుమెంట్ వారే సిద్ధం చేసారు.
అగ్రికల్చర్, హార్టీకల్చర్, ANM మొదలైనవి ఆయా విభాగాలే నిర్వహించాయి.
సర్వేయర్, వీఆర్వో పరీక్షాపత్రాలు రెవెన్యూ డిపార్టుమెంట్ చేసింది.
ఈ విభాగాలన్నీ మూడు సెట్ల పేపర్లను సీల్డ్ కవర్లలో ఇచ్చి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కు ఇచ్చాయి. వారు ప్రింటింగ్ మిషన్ వద్ద పేపర్లను ప్రింట్ చేయించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో, కట్టుదిట్టమైన పోలీసు భద్రతతో పేపర్లను భద్రంగా ఉంచడం జరిగింది. పరీక్షల అనంతరం ఓఎమ్‌ఆర్ షీట్లన్నిటినీ సెక్యూరిటీతో పాటుగా నాగార్జునా యూనివర్సిటీకి తరలించడం జరిగింది. అక్కడ డేటా టెక్ మెథాడిక్ సొల్యూషన్స్ ద్వారా వీటిని ఎవాల్యూట్ చేయించారు. ఇందులో 10% ఓఎమ్‌ఆర్ షీట్లను రాండమ్ గా డిజిగ్నేటెడ్ ఆఫీసర్స్ దగ్గర వెరిఫై చేయించడం జరిగింది. ఇంత భద్రతతో, పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాము. ఇదంతా జరిగినప్పుడు సాఫీగా సచివాలయ పరీక్షలు అంటూ ఆంధ్రజ్యోతి రాసింది. ప్రశాంతంగా పరీక్షలు అని కూడా ఆంధ్రజ్యోతి పత్రిక వార్తలు ప్రచురించింది. లక్షల ఉద్యోగాలు చరిత్రలో తొలిసారి అంటూ ఈనాడు కూడా కథనాలు రాసింది. కానీ పరీక్షా ఫలితాల రోజు సాయంత్రం పేపరు లీకైందంటూ ఆంధ్రజ్యోతి పెద్ద ఎత్తున యాగీ చేసింది. నిజంగా పేపర్ లీక్ అయితే పరీక్షలు జరిగే సమయంలో లేదా మరుసటిరోజు తెలుస్తుంది. కానీ ఫలితాలు వచ్చిన రోజు పేపర్ లీక్‌ అంటూ చేసిన ప్రచారం ఖచ్చితంగా విషప్రచారమే. 

Read Also: సీఎం వైయస్‌ జగన్‌ గ్రామ స్వరాజ్య సృష్టికర్త

 

తాజా ఫోటోలు

Back to Top