సీఎం వైయస్‌ జగన్‌ గ్రామ స్వరాజ్య సృష్టికర్త

సచివాలయ ఉద్యోగాల విప్లవం పేదరికంపై గెలుపు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డాక్టర్‌ సీదిరి అప్పలరాజు

 

అసెంబ్లీ: మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్య సిద్ధాంత కర్త అయితే.. ఈ దేశంలో గ్రామ స్వరాజ్య సృష్టికర్త సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఆంధ్రరాష్ట్ర చరిత్ర తిరగరాయబడుతుందన్నారు. రెండు నెలల్లో ఉద్యోగాల విప్లవం తీసుకువచ్చారని, ఇదే పేదరికంపై గెలుపు అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో గ్రామాలు కేవలం పథకాల లబ్ధిదారుల కోసం మాత్రమే మిగిలిపోయిన పరిస్థితి ఏర్పడిందని, వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత పరిపాలన గ్రామాలకు చేరిందన్నారు.

ఇదే అసెంబ్లీలో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నప్పుడు, ప్రజల గొంతు వినిపించే వీలులేనప్పుడు, 23 మంది ఎమ్మెల్యేలను అడ్డంగా కొనుగోలు చేసినప్పుడు, గ్రామాల్లో జన్మభూమి కమిటీల అరాచకాలు పెచ్చుమీరిపోయినప్పుడు వైయస్‌ జగన్‌  పాదయాత్రకు శ్రీకారం చుట్టారన్నారు. చరిత్రలోనే అతిపెద్ద కార్యక్రమంగా వైయస్‌ జగన్‌ చేసిన ప్రజా సంకల్పయాత్ర పాదయాత్ర రచించబడిందన్నారు. కోట్లాది మంది ప్రజలను కలిసి వారి కష్టాలు తెలుసుకున్నారని, ఆయన మదిలో నుంచి పుట్టిన ఆలోచన గ్రామ సచివాలయ వ్యవస్థ అని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే 1.40 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగులు, 2.60 లక్షల మందికి వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఉద్యోగాలు విప్లవం తీసుకువచ్చారన్నారు. ఇదే పేదరికంపై గెలుపు అన్నారు.

గత ప్రభుత్వం ముఖ్యమంత్రి యువ మోసం ద్వారా నిరుద్యోగ భృతి రూ. 2 వేలు ఇస్తానని చెప్పి ఎన్నికలకు నాలుగు నెలల ముందు రూ.2వేల భృతిని రూ. వెయ్యి చేశాడని, ఇంటికో ఉద్యోగం అంటే కోటి 40 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిన స్థానంలో కనీసం 4 లక్షల మందికి కూడా చంద్రబాబు భృతి ఇవ్వలేక దగా చేశాడన్నారు. ఆ మోసం పథకం నుంచి బయటపడి నాలుగు లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దన్నారు. నవరత్నాలు ఏ వర్గానికి, ఏ కులానికి ఉద్దేశించినవి కాదని, ఒక కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకొని ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఒక మెట్టు పైకి తీసుకువచ్చేందుకు ప్రవేశపెట్టినవి అని వివరించారు.

గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు 500 సేవలు అందుతున్నాయి. అందులో 47 సేవలు కేవలం 15 నిమిషాల్లో తీర్చేయగలిగేవి. అదే విధంగా 148 రకాల సేవలను మూడు రోజుల్లో పరిష్కరించేవి.. మిగిలినవి 5 రోజుల్లో పరిష్కరించేవి ఉన్నాయన్నారు. పంచాయతీ ఆస్తులు సంరక్షించడం, ఆహారం కల్తీ, తూకాల్లో మోసం, బాల కార్మిక వ్యవస్థ, గృహ హింస, బాల్య వివాహం వంటివి నియంత్రించడం, మద్యపాన నిషేధం, స్పందన వినతులు పరిష్కరించడం, పంచాయతీ పన్నులు వసూలు చేసి పునరావాస కేంద్రాలు నిర్వహించడం, జనన మరణాలు వెంటనే నమోదు, ధ్రువపత్రాల జారీ, ఎరువులు, విత్తనాలు సరఫరా, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించడం, నూతనంగా తీసుకొచ్చే మహిళా భద్రత చట్టాన్ని గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా అమలు చేయనున్నామన్నారు.

Read Also: గ్రామ‌/వార్డు స‌చివాల‌యాల ద్వారా ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను డోర్ డెలివ‌రీ చేస్తున్నాం

Back to Top