సరిపడా ఇసుక సరఫరా

వరదలు తగ్గుముఖం.. ప్రస్తుతం 1.20 లక్షల టన్నుల ఇసుక వెలికితీత

రెండు లక్షల టన్నులకు పెంచాలని సీఎం ఆదేశం

స్టాక్‌పాయింట్లు సంఖ్య 200లకు పెంచనున్నాం

విక్రయాల పరిశీలనపై డీజీని నియమించేందుకు నిర్ణయం

అక్రమాలకు పాల్పడితే రూ.2 లక్షల జరిమానా, రెండేళ్ల జైలుశిక్ష

14 నుంచి 21వ తేదీ వరకు ఇసుక వారోత్సవాలు

ప్రభుత్వంపై బురదజల్లేందుకు బాబు, దత్తపుత్రుడి ప్రయత్నం

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సచివాలయం: వరదలు తగ్గుముఖం పట్టాయి. ఇసుక కొరత తీరింది. కావాల్సినంత ఇసుక సరఫరా చేస్తున్నాం. రాష్ట్రంలో రోజుకు 80 లక్షల టన్నుల ఇసుక అవసరం ఉంటే ప్రస్తుతం 1.20 లక్షల టన్నుల ఇసుక వెలికితీసి స్టాక్‌పాయింట్ల వద్ద నిల్వ ఉంచుతున్నామని పంచాయతీ రాజ్, రూరల్‌ డెవలప్‌మెంట్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 137 ఉన్న స్టాక్‌ పాయింట్లను 200లకు పెంచబోతున్నామని చెప్పారు. నవంబర్‌ 14వ తేదీ నుంచి 21 వరకు ఇసుక వారోత్సవాలను నిర్వహించనున్నామని, స్పందన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు, నవరత్నాలు, మేనిఫెస్టోలోని అంశాలు అమలు చేస్తూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలంతా మెచ్చే పాలన చేస్తున్నారన్నారు. ప్రభుత్వం మీద బురదజల్లేందుకు చంద్రబాబు, ఆయన పుత్రుడు, దత్తపుత్రుడు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. 

సచివాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘గత ఐదేళ్లు చంద్రబాబు ఇసుక మొత్తం దోచేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పోటీ పడి దోచుకున్నారు. ఇసుక మాఫియాకు అడ్డు వచ్చిన అధికారులను ఏ విధంగా చిత్రహింసలు పెట్టారో చూశాం. ఇసుక మాఫియాను అరికట్టాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నూతన ఇసుక విధానం తీసుకువచ్చారు. ఇసుక దోపిడీ చేశారు. తిరిగి గాడిలో పెట్టాలంటే ఇబ్బందులు తప్పవు. అయినా వాటిని అధిగమిస్తామని సీఎం మీడియాకు కూడా వివరించారు. ఆ దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. వర్షాకాలంలో ఇసుక తీయలేం. చంద్రబాబున్న ఐదు సంవత్సరాలు కరువు. వర్షాలు పడలేదు.. ఇసుక దోచుకున్నారు. 

దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో వర్షాలు విపరీతంగా కురిశాయి. ఆయన కుమారుడు వైయస్‌ జగన్‌ పాలనలోనూ వర్షాలు పడి నదులు, ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు 8 సార్లు ఎత్తారు. పెన్నా నదికి కూడా వరద వచ్చింది. కృష్ణా, గోదావరి నదులు పొంగిపొర్లాయి. వరదలతోనే ఇసుక సేకరణకు కొంత ఇబ్బంది ఏర్పడింది. వరదలు తగ్గాయి.. ఇసుక సమస్య తీరింది. 

రాష్ట్రం మొత్తం 80 వేల టన్నుల ఇసుక సరిపోతుంది. ఇప్పుడు 1.20 లక్షల టన్నుల ఇసుక తీశాం. 137 స్టాక్‌ పాయింట్లను 185గా పెంచబోతున్నాం. 14 నుంచి 21వ తేదీ వరకు ఇసుక వారోత్సవాలు చేపట్టాలని సీఎం వైయస్‌ జగన్‌ సూచించారు. కలెక్టర్లు ముఖ్యప్రాంతాల్లోని ఇసుక స్టాక్‌ పాయింట్లను గుర్తించాలి. మంత్రులు వాటిని ప్రారంభించాలి. ఖాళీగా ఉన్న మార్కెటింగ్‌ కమిటీల్లో కూడా స్టాక్‌ యార్డులు పెట్టేందుకు చర్యలు. ఏపీఎండీసీ ఆధ్వర్యంలో కొత్త రీచ్‌లను గుర్తించి వాటిని వినియోగంలోకి తీసుకురావాలి. సెలవులు లేకుండా రెండు షిప్టులు పనిచేయాలని సీఎం సూచించారు. పెండింగ్‌ దరఖాస్తులు వెంటనే పరిష్కరిస్తున్నాం. ఇసుక డిపోల వద్ద పండగ వాతావరణం ఉండేలా పనిచేయాలని సీఎం ఆదేశించారు. 

ఇసుక సేకరణ రెండు లక్షల టన్నులకు పెంచాలని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. ప్రభుత్వ కృషిని ప్రజలు అంతా గమనిస్తున్నా.. చంద్రబాబు ఇసుక రాజకీయం చేస్తున్నాడు. పుత్రుడు, దత్తపుత్రుడు అయిపోయాడని, స్వయంగా చంద్రబాబే ధర్నా చేస్తానని ముందుకువస్తున్నాడు. మా సర్వేల ప్రకారం రాష్ట్రంలోని మొత్తం ఇసుక 1.30 కోట్ల క్యూబిక్‌ మీటర్లు.. ఈ రోజు అది 10 కోట్ల క్యూబిక్‌ మీటర్లకు పెరిగింది. సెప్టెంబర్‌ 6వ తేదీ 83 రీచ్‌లలో తవ్వకాలు మొదలుపెట్టాం. నిన్నటి వరకు 99 రీచ్‌లలో తవ్వకాలు చేపట్టాం. 137 స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు చేశాం. 200 వరకు పెంచాలని సీఎం సూచించారు. నాలుగు రోజులుగా 90 వేల మెట్రిక్‌ టన్నుల నుంచి 1.21 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక తీస్తున్నాం. రాష్ట్రంలో ఇసుక అందుబాటులోకి వచ్చింది. 

ఇసుకపై చంద్రబాబు రెండో దుష్ప్రచారం మొదలుపెడతాడని మాకు అనుమానం వచ్చింది. అందుకే ఇసుక అమ్మకాల పరిశీలనకు సంబంధించి డీజీని నియమించడం జరిగింది. స్టాక్‌ పాయింట్ల నుంచి వెళ్లే ప్రతి ఒక్కటీ రికార్డు ప్రకారం ఉంటుంది. ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌ రోడ్డుల్లో కూడా 150 నుంచి 200 చెక్‌పోస్టులు, నైట్‌లో కూడా పనిచేసే వీడియో కెమెరాలు ఏర్పాటు చేయనున్నాం. చెక్‌పోస్టుల వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లను నియమించనున్నాం. ప్రతి నియోజకవర్గానికి ఒక రేటు పెట్టండి.. ఆ రేటుకు మించి ఎవరైనా ఇసుక అమ్మినా.. అక్రమాలకు పాల్పడినా.. జైలు శిక్షతో పాటు రూ. 2 లక్షల జరిమానా విధించేలా కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నా’మని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరించారు. 
 

Read Also: వైయస్‌ జగన్‌ మహిళా పక్షపాతి

Back to Top