యర్రగొండపాలెంలో వీధిరౌడీలా బాబు వీరంగం

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి  మేరుగు నాగార్జున 

దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా" అని అనలేదని నీ భార్య, కొడుకుపై ఒట్టేసి చెప్పగలవా బాబూ..?
 
నీవు అన్నావని నేను, నా భార్యాపిల్లలపై ఒట్టేసి చెబుతా..
 
నా సవాల్ ను స్వీకరించే దమ్ము చంద్రబాబుకు ఉందా..?

మంత్రి  మేరుగు నాగార్జున సవాల్

 నీ కొడుకు "దళితులు ఏం పీకుతారు" అని అన్నాడా.. లేదా..?

 క్షమాపణలు చెప్పమంటే దళితులపైనే దాడులా..?

 దగ్గరుండి అడ్డగాడిదలా దళిత మంత్రి సురేష్ పై రాళ్లేయిస్తావా..?

 వళ్లు దగ్గర పెట్టుకో చంద్రబాబూ...లేకుంటే మా దళితులే తోలు తీస్తారు

 దళిత మంత్రికి మూలాలు లేవంటావా..? చంద్రబాబు మదమెక్కి మాట్లాడుతున్నాడు..

 దళితులను భయపెట్టాలని చూస్తే నిన్ను, నీ పార్టీని భూస్థాపితం చేస్తాం

మంత్రి  మేరుగు నాగార్జున

తాడేప‌ల్లి: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చంద్రబాబు వీధి రౌడీలా వ్యవహరించారని మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. చంద్రబాబుకు దళితులపై ఎందుకంత కక్ష్య అని ప్రశ్నించారు మంత్రి మేరుగ. ‘ నిన్న చంద్రబాబు వీధి రౌడీలా వ్యవహరించారు. ఎన్ని అఘాయిత్యాలు చేయాలనుకున్నారో చూశాం. దళితులపై ఎలా దాడులు చేయించారో చూశాం. చంద్రబాబు కూసాలు కదులుతున్నాయని దిక్కులేక రోడ్డున పడ్డారు. తండ్రి, కొడుకులు బరితెగించిన రాక్షసులు. దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? అన్నారు. దళితులు ఏం పీకుతారు? అని లోకేష్ అన్నాడు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి  మేరుగు నాగార్జున మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే:*

 
- నిన్న యర్రగొండపాలెంలో చంద్రబాబునాయుడు వీరంగం వేశాడు
- చంద్రబాబు ఎంత వీధి రౌడీనో, ఎలా బరితెగించి రాజకీయాలు చేస్తున్నాడో రాష్ట్ర ప్రజలందరూ చూశారు
- దళితుల మీద ఎంత కర్కశంగా ఆయన దాడులు చేయిస్తున్నాడో చూస్తున్నాం
- చంద్రబాబును చూసి వీధి రౌడీ అనుకోవాలా.. దళితులమీద, పేదల మీద అఘాయిత్యాలకు పాల్పడే దుర్మార్గుడు అనుకోవాలా..?
- రాష్ట్రంలో ప్రజా రంజక పరిపాలన జరుగుతుంటే.. మీ కూసాలు కదిలిపోతుంటే దిక్కులేని స్థితిలో తండ్రీ కొడుకులు రోడ్డున పడ్డారు.. నోటికి అడ్డూఅదుపూ లేకుండా
బరితెగించి మాట్లాడుతున్నారు..
- మా సోదరుడు, రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్‌, మా పార్టీ శ్రేణులపై దాడికి ఉసిగొల్పింది నీవు కాదా చంద్రబాబూ.. అని ప్రశ్నిస్తున్నా
- చంద్రబాబు ఒక బరితెగించిన రాక్షసుడు.. దళిత వ్యతిరేకి..దళితులపై దాడి చేయించడం చంద్రబాబుకు పరిపాటి
- దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నది చంద్రబాబు అవునా.. కాదా..?
- నీ కొడుకు లోకేశ్ .. "దళితులు ఏం పీకుతారు" అని అనలేదా..?
- నీకు ఎలాగూ దేవుడి మీద నమ్మకం లేదు.. నీవు అనలేదని నీ భార్యా కొడుకు మీద ఒట్టేసి చెప్పు చంద్రబాబూ..
- నువ్వు అన్నావని నా భార్యా పిలల్లపై నేను ఒట్టేసి చెప్తా. నా సవాల్ ను స్వీకరించే దమ్ముందా బాబూ నీకు..

దగ్గరుండి మా దళిత మంత్రిపై దాడి చేయిస్తావా..?:
- మా దళిత కులాలను తేలిగ్గా చూడటం, హేళన చేయడం..  మా మీద దాడులు చేయించడం చంద్రబాబుకు బాగా అలవాటు
- మొన్నటికి మొన్న అమలాపురంలో మా దళిత సోదరుడు ఇళ్ళపై దాడి చేయించావు.. మరో బీసీ సోదరుడి ఇంటిపై దాడి చేయించావు
- ఈ రోజు దగ్గరుండి అడ్డగాడిదలా నా సోదరుడు, సహచర దళిత మంత్రి మీద రాళ్లేయిస్తావా..? నీకు ఎంత అహంకారం చంద్రబాబూ..?
- నీ డిఎన్‌ఏలోనే మా దళితుల జీవితాలను ఛిద్రం చేయాలని, మా రక్తం తాగాలని, మమ్మల్ని అడ్డుపెట్టుకుని స్వార్థ రాజకీయాలు చేయాలని ఉందనుకుంటాను.
- దళితులపై అవాకులు, చెవాకులు మాట్లాడితే.. తస్మాత్‌ జాగ్రత్త... వళ్లు దగ్గర పెట్టుకో చంద్రబాబూ...తోలు తీస్తాం.

మాకు మూలాలు లేవంటావా?:
- మా దళిత మంత్రి సురేష్ ను పట్టుకుని..  మూలాలు లేని ఆదిమూలం అంటావా..? అంత మదం ఎక్కి కొట్టుకుంటున్నావా..?
- మా కులానికి మూలాలు లేవా..? నువ్వు ఏ విధంగా రాజకీయాలు చేస్తావో చూస్తాం
- ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున్న మేస్తుందా అన్నట్లు నీ కొడుకు దళితులు ఏం పీకలేరు.. అని అంటున్నారు
- దళితులంటే నీకెందుకు చిన్నచూపు, హేళన. మా మీదనే దాడులు చేయిస్తావా..?
- 14 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి, 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న నువ్వు మా కులాలపై దాడులు చేయిస్తున్నావు
- మా కులాలను భయపెట్టాలని చూస్తే నిన్ను భూస్థాపితం చేస్తాం
- 2019లో చంద్రబాబు 23 స్థానాలకు దిగజారిపోయి, రాజకీయంగా  పతనమయ్యాడు.. ఈ సారి భూస్థాపితం అవుతాడు
- మా సహనాన్ని పరీక్షించవద్దు.. ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు అన్నింటా అండగా ఉంది. అన్నింటికీ మించి జగనన్న గుండెల్లో దళితులకు ప్రత్యేక స్థానం ఉంది. 

అమరావతిలో మీ వాళ్లే బతకాలా..?:
- అంబేద్కర్‌ ఆలోచన విధానంతో, జగ్జీవనరావు కాన్సెప్ట్‌తో మేం బతుకుతున్నాం
- పొదల్లో, ముళ్లకంచెల్లో అంబేద్కర్‌ విగ్రహాన్ని పెట్టేందుకు ప్రయత్నించిన వ్యక్తివి నువ్వు
- నీ హయాంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఎందుకు పెట్టలేకపోయావో సమాధానం చెప్పు
- ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ గారు ఆ మహానుభావుడు 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున పెడుతున్నారు
- నీవేమో అమరావతి రాజధాని ప్రాంతంలో దళితులు ఉండొద్దు, ఉంటే సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అంటే.. మా నాయకుడు వారికి ఇళ్ళ పట్టాలు ఇచ్చాడు. 
- అమరావతిలో  మీవాళ్లు బతకొచ్చు కానీ.. మేం బతకకూడదా..?
- దళితుల్ని వెలివేసి.. శవాల మీద పేలాలు ఏరుకునేలా రాజకీయాలు చేయాలి అనుకుంటున్నాడు చంద్రబాబు

టైమ్స్ నౌ సర్వేతో చంద్రబాబుకు వణుకు:
- జగన్‌ గారు రాష్ట్ర రూపురేఖల్నే సమూలంగా మారుస్తూ, సంస్కరణల బాట పట్టిస్తూ, రూట్ లెవల్ నుంచి సుపరిపాలన అందచేస్తూ అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తున్నాడు.
- దాంతో జనం జగన్ గారికి నీరాజనాలు పలుకుతున్నారు. అందుకే టైమ్స్‌ నౌ సర్వేలో 25కు 25 పార్లమెంటు స్థానాలు వస్తున్నాయని చెప్పేసరికి చంద్రబాబుకు వణుకుపుట్టింది
- అందుకే భయపడిపోయి, పిచ్చెక్కినట్లు చంద్రబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
- దళితులు ఉండకూడదు అన్న నిన్ను రాజకీయాల నుంచి వెలివేయాలి మా దళిత సమాజం అంతా భావిస్తుంది.
- మా దేవుడ్ని అవమానపరిచావ్‌.. మా కులాలను అవమానపరిచావ్‌.. అందుకే నీకు రాజకీయ చరమగీతం పాడటానికి మా దళితులంతా  సిద్ధంగా ఉన్నారు.

బహిరంగ క్షమాపణలు చెప్పాలిః
- దళిత జాతిని, అంబేద్కర్‌ను అవమాన పరిచిన చంద్రబాబు, నీతిలేకుండా మాట్లాడుతున్న లోకేశ్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలి
- అప్పుడే మీరు రాష్ట్రంలో తిరగగలుగుతారు... లేకుంటే ఎక్కడికక్కడ మా దళితులు మిమ్మల్ని నిలదీస్తారు. 
- తస్మాత్‌ జాగ్రత్త చంద్రబాబూ.. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి ముందు నీ ఉడత ఊపులు చెల్లవు
- రాళ్లేయిస్తే అయిపోలేదు.. ఊళ్లలోకి వస్తే దీనిపై ప్రాయశ్చిత్తం అనుభవిస్తావు
- సమాజంలో వెనుకబడి ఉన్నాం కాబట్టి.. మేమేమీ చేయలేమని చంద్రబాబునాయుడు మదం ఎక్కి మాట్లాడుతూ, మాపై దాడులు చేయిస్తున్నాడు
- వాళ్ల లాగా రాళ్ళ దాడులు చేసి, రక్తం కళ్ళ చూసే వాళ్లం మేము కాదు.. మేం నమ్మిన సిద్ధాంతం కోసం వెళ్లేవాళ్లం
- అంబేద్కర్‌ ఇచ్చిన ఓటు హక్కు ద్వారా చంద్రబాబు రథచక్రాలు ఊడగొడతాం.

 

Back to Top