దిశ చట్టం ద్వారా అభయాంధ్రప్రదేశ్ గా ఏపీ

హోం మినిస్టర్ - మేకతోటి సుచరిత
 

మహిళల భద్రత పట్ల ఓ చారిత్రాత్మక బిల్లు ప్రవేశ పెట్టే అవకాశం అదృష్టం కల్పించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. మన సీఎం వైయస్ జగన్ మహిళా పక్షపాతి. దేశంలో ఎక్కడా లేనివిధంగా దళిత మహిళలను హోం మంత్రిగా, గిరిజన మహిళలను ఉపముఖ్యమంత్రిగా చేయడం, ఎంతోమంది మహిళలకు శాసన సభ్యులుగా అవకాశం కల్పించడం, నామినేటెడ్ పోస్టులు, పనుల్లో 50% రిజర్వుషన్ కల్పించడం ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ కి మాత్రమే దక్కుతుంది. దేశవ్యాప్తంగా ప్రజలందరినీ కుదిపివేసే సంఘటనలు జరుగుతున్నాయి. ఢిల్లీలో నిర్భయ, జమ్ములో ఫత్వాలో బాలిక, హైదరాబాద్ లో దిశ వంటి ఘటనలు చూసి దేశవ్యాప్తంగా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ చలించిపోయారు. ఆడపిల్లల తల్లితండ్రులు ఆ అమ్మాయి స్థానంలో తమ పిల్లలను ఊహించుకుని భయపడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అర్థరాత్రి ఆడది ఒంటరిగా తిరిగినప్పుడే స్వాతంత్ర్యం అని గాంధీ గారు అన్నారు. కానీ పట్టపగలే మహిళ ధైర్యంగా తిరగలేని పరిస్థితులు దేశంలో నెలకొని ఉన్నాయి.
దిశ ఘటనతో ఎంతగానో చలించిపోయిన సీఎం వైయస్ జగన్ మన రాష్ట్రంలో మహిళా రక్షణకు ప్రత్యేక చట్టాలు తేవాల్సిన ఆవశ్యకత ఉందని చిత్తశుద్ధితో ఈ చట్టాన్ని తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో జగనన్న ఒక రక్ష. ఎవరైనా మహిళలపై చెయ్యేస్తే పడుతుంది కఠిన శిక్ష.
మహిళలపై ఏదైనా నేరం జరిగితే నాలుగు నెలలైనా వారిపై విచారణ జరగడం లేదు. శిక్షలు పడటం లేదు. దీనివల్ల నేరం చేసిన వాళ్లు నిర్భయంగా సమాజంలో తిరగడం చూస్తున్నాం. ఎవరైతే నేరం చేసారో 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి, 21 రోజుల్లో శిక్ష పడేలా ప్రత్యేక చట్టాన్ని తేవాలని, వీటికోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా 'దిశా బిల్లు'ను ప్రవేశపెడుతున్నాం. ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ రక్షణ కల్పించి, వారికి ఓ తోబుట్టువుగా నిలబడాలనుకుంటున్న వైయస్ జగన్ వంటి సీఎంను కలిగి ఉండటం ఈ రాష్ట్ర మహిళలు చేసుకున్న అదృష్టం.
చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ మహిళలు ఎంతో అభద్రతా భావంతో ఉన్నారు. వారికి భరోసా కల్పించేలా 'దిశ' చట్టాన్ని తేవడం, వారి రక్షణకు పూనుకోవడం పట్ల రాష్ట్ర మహిళలందరి తరఫునా నేను సీఎంగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దిశ ద్వారా ప్రతి జిల్లాలో ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తూ, నేరస్తులకు త్వరితంగా శిక్షలు పడేలా, అది కూడా కఠిన శిక్షలువేసేలా ఈ చట్టం రూపొదిస్తున్నారు. ఏ మాధ్యమం ద్వారా అయినా మహిళలను కించపరిచినా, అసభ్యంగా మాట్లాడటం, ప్రవర్తించడం చేసినా వాళ్లకు 2 సంవత్సరాలు కఠిన కారాగార శిక్షతో పాటు లక్ష జరిమానా 354 E సెక్షన్ తీసుకువస్తున్నాం. ఒకసారి ఈ శిక్ష పడ్డవాళ్లు తిరిగి అదే నేరానికి పాల్పడితే వారికి 4 సం. కఠిన శిక్ష పడేలా ఈ చట్టం రూపొందింది. 354 F బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, అత్యాచార, అఘాయిత్యాల ప్రయత్నం చేసినా గరిష్టంగా 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించేలా చట్టంలో మార్పులు తెస్తున్నారు. 354 G ద్వారా హాస్టల్ లేదా పాఠశాల విద్యార్థినీ విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు, వార్డెన్లు కానీ, మహిళా ఖైదీల పట్ల జైలు వార్డెన్లు కానీ అసభ్యంగా ప్రవర్తిస్తే వారికి కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది. మహిళలపట్ల ఈ రాష్ట్రం అభయాంధ్రప్రదేశ్ గా ఉండేలా ఈ చట్టాలను రూపొందించడం జరిగింది.
దిశ చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ మహిళలకు అభయాంధ్రప్రదేశ్ గా మారుతుంది.

Read Also: బాబుకు వయస్సు పెరిగింది కానీ జ్ఞానం పెరగలేదు

 

తాజా వీడియోలు

Back to Top