అగ్రిగోల్డ్‌ బాధితుల జీవితాల్లో వెలుగులు

సీఎం వైయస్‌ జగన్‌ చొరవతో డిపాజిట్‌దారుల్లో ఆనందం

ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం జరిగేలా చర్యలు

రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవ అగ్రిగోల్డ్‌ బాధితుల జీవితాల్లో వెలుగులు నింపిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే విడదల రజని, అగ్రిగోల్డ్‌ బాధితుల కమిటీ కోఆర్డినేటర్‌ లేళ్ల అప్పిరెడ్డిలతో కలిసి మంత్రి సుచరిత విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అన్నారు. సీఎం నిర్ణయంతో అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌ దారులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. చిన్న మొత్తాల్లో ఉన్న 65 శాతం బాధితులకు మేలు జరుగుతుందని వివరించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా సాయం అందుకోవాలని అగ్రిగోల్డ్‌ బాధితులు అంతా కోరారని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. గతంలో ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన చంద్రబాబు అగ్రిగోల్డ్‌ బాధితులను అన్ని విధాలుగా మోసం చేశాడన్నారు.

అగ్రిగోల్డ్‌ ఆస్తుల వివరాలను కోర్టు ముందు పెడతామని, ఆంధ్రరాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌ ఇలా చాలా రాష్ట్రాల్లో 23 వేల ఎకరాల పైచిలుకు అగ్రిగోల్డ్‌ ఆస్తులు ఉన్నాయని హోంమంత్రి సుచరిత చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు మిగిలిన వారికి కూడా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అగ్రిగోల్డ్‌ బాధితులు సుమారు రూ.3600 కోట్ల వరకు డిపాజిట్లు చెల్లించి ఉన్నారన్నారు.

దాచేపల్లిలో చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు కూడా తరలించడం జరిగిందని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు హోంమంత్రి సమాధానం ఇచ్చారు. దాచేపల్లి ఘటనపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సీరియర్‌ అయ్యారని, ఆ చిన్నారి చదువుకునేందుకు అన్ని విధాలుగా సౌకర్యం కల్పించాలని సీఎం ఆదేశించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందదన్నారు. గత ఐదేళ్లలో నేషనల్‌ క్రైం రిపోర్టుల్లో ఏపీ అగ్రగామి ఉందని, గతంతో పోల్చితే నేరాల సంఖ్య తగ్గిందని, పోలీస్‌ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుందన్నారు.

Read Also: స్పందన కార్యక్రమంపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాజా ఫోటోలు

Back to Top