ప్రజలకు చేసిన  మేలు చెప్పి ఓట్లు అడుగుతాం

 మంత్రి కొట్టు సత్యనారాయణ

విజయవాడ: ప్రజలకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన  మేలు చెప్పి 2024లో ఓట్లు అడుగుతామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్నందున కొన్ని రాబంధులు వాలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. రాబంధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఇది పేదలకు, పెత్తందార్లకు మధ్య జరిగే ఎన్నికలని అభివర్ణించారు. సత్యానికి, అసత్యానికి మధ్య జరుగుతున్న పోరాటమన్నారు. న్యాయానికి, అన్యాయానికి మధ్య జరుగుతున్న పోరాటమిది అన్నారు. చంద్రబాబు, పచ్చ మీడియా అంతా ఒక్కవైపు ఉన్నారు.
 

Back to Top