పేదలను ఆదుకునేందుకు వైయస్‌ జగన్‌ అప్పులు తెస్తున్నారు

మంత్రి కొడాలి నాని 

నిన్న జరిగింది టీడీపీ ఆవిర్భావ దినోత్సవం కాదు..పగటి వేషగాళ్ల డ్రామా

ప్రజలే దేవుళ్లని ఎన్టీఆర్‌ అంటే..బాబు బూతులు తిడుతున్నారు

 ఎన్టీఆర్‌ సిద్ధాంతాలను, ఆశయాలను చంద్రబాబు తుంగలో తొక్కారు

 చంద్రబాబు హయాంలో 3లక్షల 60 వేల కోట్లు అప్పులు చేశారు

చంద్రబాబు ఏనాడూ ప్రజల మద్దతుతో సీఎం కాలేదు

చంద్రబాబు బతుకంతా వ్యవస్థలను మేనేజ్‌ చేసుకోవడమే

ఎల్లోమీడియా తప్పుడు రాతలు జనం నమ్మరు

తాడేపల్లి: కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అప్పులు తెచ్చి పేద ప్రజలను ఆదుకున్నారని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబు లక్షల కోట్లు అప్పులు తెచ్చి దుబారా చేశారని విమర్శించారు. ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగు దేశం పార్టీని చంద్రబాబు లాక్కొని..నిన్న ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారని, అది పగటి వేళగాళ్ల డ్రామాను రక్తికటించిందని మంత్రి దుయ్యబట్టారు. ప్రజలే దేవుళ్లని ఎన్టీఆర్‌ ఆనాడు అంటే..ఈనాడు చంద్రబాబు బూతులు తిడుతున్నారని ఫైర్‌ అయ్యారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళశారం మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.

వివిధ కులాలు, అనేక జాతుల సమ్మేళనంతో ఉన్న అట్టగుడు వర్గాల వారిని పైకి తెచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు. ఆయన పెట్టిన పార్టీని, పదవిని లాక్కున్న నీచుడు, ఆయన్ను దగా చేసిన దుర్మార్గులతో నిండి ఉన్న పార్టీ టీడీపీ. ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను తుంగలో తొక్కారు. సిగ్గు శరం లేకుండా ఆయన బొమ్మలకు పూలమాల వేసి, ఆయన ఆశయాలకు పునరాంకితమవుతామని  దొంగ మాటలు చెబుతూ నిన్నంతా ఒక పగటి వేషగాళ్ల డ్రామాను రక్తికట్టించారు. ఎన్టీఆర్‌ నాడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అంటే..ఇప్పుడు పార్టీ నడిపే నిష్ట దరిద్రుడు, వెన్నుపోటుదారుడు, కుట్రదారుడు, దొంగ, అవినీతి చక్రవర్తి చంద్రబాబు మాత్రం ఈ సమాజంలో ఉన్న మనుషులను కనీసం దేవుళ్లుగా కాదు..ప్రజలుగా కూడా గౌరవించని సన్యాసి చంద్రబాబు. మొన్న ఎన్నికల్లో చూశాం. ప్రజలకు బుద్ధి లేదు. ప్రజలకు సిగ్గు లేదు. మీరు మనుషులేనా? మీరు బతికున్నా చచ్చిన వారితో సమానం..మందుకోసం, డబ్బుకోసం అమ్ముడుపోయే మీ గురించి పోరాటం చేస్తుంటే బయటకు రారా అంటూ ప్రశ్నించే స్థాయికి చంద్రబాబు వచ్చారు.  ప్రజలే దేవుళ్లు అన్న పార్టీలో ఉన్న చంద్రబాబు ఇలా ప్రజలను అవమాన పరిచేలా దిగజారి మాట్లాడారు.

ఎన్టీఆర్‌ నాగలోకం అయితే..చంద్రబాబు నక్కతో సమానం. ఆయన ప్రజల పట్ల గౌరవంతో ప్రజలను దేవుళ్లుగా చూశారు. ఈయన కుమారుడు పప్పు శుద్ధ, చవటను  మంగళగిరిలో ఓడించారని ప్రజలను అమ్మానాభూతులు తిట్టే పరిస్థితికి చంద్రబాబు దిగజారాడు. కాబట్టి ఆ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగే హక్కు, స్థోమత చంద్రబాబుకు లేదు. చంద్రబాబును అభిమానించే కొంత మంది వేధవలు, సన్యాసులు ఉన్నారు. అతనే ముఖ్యమంత్రిగా ఉండాలని, రాష్ట్రాన్ని పంది కొక్కుల్లా దోచుకోవాలనే వారు ఉన్నారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చే హామీలకో, డబ్బుకో వైయస్‌ఆర్‌సీపీకి ఓట్లు వేస్తున్నారని కొందరు మాట్లాడుతున్నారు. ఆయనకున్న కుల సంఘాలు, ఎల్లోమీడియాను అడ్డం పెట్టుకొని ప్రజలను తిడుతున్నారు. టీడీపీని అభిమానించే వ్యక్తులు, చంద్రబాబును అభిమానించే వేధవలు ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలి. రాష్ట్రంలో వైయస్‌ జగన్‌ అప్పులు తెచ్చి ప్రజలకు పంచి పెడుతున్నారని ఆరోçపణలు చేస్తున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పక్క రాష్ట్రాలకు, సింగపూర్, మలేషియాకు అప్పులు ఇచ్చారా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో రూ.3.60 లక్షల కోట్లు అప్పులు చేసి ..మీ జేబులో ఖర్చులకు అడ్డంగా ఖర్చు చేసింది చంద్రబాబు కాదా? ఆయన అబ్బా ఖర్జుర నాయుడా? . ఇప్పుడు వైయస్‌ జగన్‌ రూ.90 వేలు కోట్లు అప్పులు తెచ్చారని ఆరోపిస్తున్నారు.

కరోనా సమయంలో పేద ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో పూట గడక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఆ రోజు ఎన్టీఆర్‌ చెప్పినట్లుగా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లుగా వైయస్‌ జగన్‌ కూడా భావించి..ఓ తండ్రి స్థానంలో ఆలోచించి ప్రతి నిరుపేద కుటుంబానికి నేరుగా డబ్బులు ఇచ్చి ఆదుకున్న నేత వైయస్‌ జగన్‌. అందుకే ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ను వన్‌సైడ్‌గా ప్రజలు ఆశీర్వదించారు. అప్పు ఈ రోజు కాకపోతే మరోరోజు కడుతాం. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ప్రజలను ఆదుకునే మహానుభావుడు వైయస్‌ జగన్‌. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి, ఎన్టీఆర్‌ వారసుడు కాబట్టే  పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టే అప్పులు తెచ్చి నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేసి కనీసం ఒకపూట తినడానికి తిండి అయినా పెట్టారు. ఇటువంటి విపత్కర సమయంలో మానవత్వం ఉన్న ముఖ్యమంత్రి దొరికినందుకు రాష్ట్ర ప్రజలంతా కూడా అభినందిస్తున్నారు. ఆనందపడుతున్నారు. మీలాంటి పనికిమాలిన పది మంది సన్యాసులు ఏడుస్తున్నారు. చంద్రబాబు సమయం అయిపోయింది. ఆయన ప్రజల మద్దతుతో ఎప్పుడు ముఖ్యమంత్రి కాలేదు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి సీఎం పీఠాన్ని లాక్కున్నారు. వాజ్‌పేయి కాళ్లు పట్టుకొని మరోసారి సీఎం అయ్యారు. 2004లో ఓడిపోయావు. 2014లో పవన్‌ కళ్యాణ్, బీజేపీ కాళ్లు పట్టుకొని సీఎం అయ్యావు. 

చంద్రబాబును నిమ్మగడ్డ రమేష్‌ కాపాడలేకపోయాడు. పంచాయతీ ఎన్నికల్లో నీ మాడుపగులగొట్టారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా నీవు, నీ నిమ్మగడ్డ తోక ముడుచుకొని పారిపోయేలా ప్రజలు తరిమికొట్టారు. ఇద్దరు పారిపోయి హైదరాబాద్‌లో బతుకున్నారు. అదేవిధంగా ఎబీఎన్, ఈనాడు, టీవీ5 లో డిబెట్‌ పెట్టి గాలి కొడితే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారా? ఎన్టీఆర్‌ బోళా శంకరుడు, కళ్లాకపటం లేని వ్యక్తి కాబట్టి..నీలాంటి దొంగలను ఇంట్లో పెట్టుకుంటే..ఆయన్ను వెన్నుపోటు పొడిచి ఆయన భిక్షతో పదవులు అనుభవించారు. ప్రజల మద్దతతు పార్టీ పెట్టి, అధికారంలోకి వచ్చారు. 60 శాతం ప్రజల మద్దతు వైయస్‌ జగన్‌కు ఉంది. ఎవరూ కూడా వైయస్‌ జగన్‌ను ఏమీ చేయలేరు. ఎన్ని నాటకాలు ఆడినా పదే పదే రాష్ట్ర ప్రజలు బుద్ధి చెబుతూనే ఉంటారు. మీరు తోక ముడుచుకొని పారిపోవాల్సిందే.

తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ఈ నాస్తికులకు విఫరీతమైన ప్రేమ పుట్టుకొచ్చింది.  ప్పుడే బొచ్చు గురించి డిబెట్‌ పెట్టారు. వైజాగ్‌లో నెత్తిమీద బొచ్చు లేని వ్యక్తి మాట్లాడుతున్నారు. తిరుపతిలో ఏం జరుగుతుందో రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దేశంలోనే అతిపెద్ద పార్టీ నోటాతో పోటీ పడుతోంది. ఇంకో పార్టీ ఉంది. ఆ పార్టీకి కనీసం డిపాజిట్లు అయినా తెచ్చుకొని గౌరవం కాపాడుకోవాలని పాట్లు పడుతున్నారు. దేశంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన మరో పార్టీ కూడా ఉప ఎన్నికలో పోటీ చేస్తోంది. వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో రేపు జరిగే ఎన్నికలో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి 5 లక్షల మెజారిటీతో గెలిచేలా ఆ స్వామి ఆశీర్వదిస్తారు. దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్న వ్యక్తులపై ఆ స్వామి కన్నె్రర చేస్తారనే నమ్మకం మాకుంది. ప్రజలను ప్రజలుగా గౌరవిస్తాం. అన్ని కులాలను, మతాలను సమానంగా గౌరవిస్తాం. చంద్రబాబుకు ఆవిర్భావ వేడుకలు జరిపే హక్కు లేదు.

టీడీపీ పెట్టినప్పుడు చంద్రబాబు కాంగ్రెస్‌లో ఉన్నారు. అలాంటి వ్యక్తి ఆవిర్భావ వేడుకలు ఎలా నిర్వహిస్తారు. తుప్పు, పప్పు సెప్టెంబర్‌ 1వ తేదీన టీడీపీ వెన్నుపోటు దినోత్సవం పెట్టుకొని కేకులు తినిపించుకోవాల. ఈ దొంగ నడుపుతున్న టీడీపీని భూస్థాపితం చేయాలని ఎన్టీఆర్‌ ఆ రోజు పిలుపునిచ్చారు. ఆయన చావుకు కారణమైన ఈ దుర్మార్గులు ఆయన ఫోటోకు దండలు వేయడం సిగ్గు చేటని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.
 

Back to Top