సిగ్గుంటే రాష్ట్రంలోకి పప్పూ, తుప్పూలు రాకూడదు

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని)

టీడీపీకి ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న వారే నాయకులు

చంద్రబాబును మళ్లీ ప్రజలు తిరస్కరించారు

మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను సీఎం నెరవేర్చారు

అందుకే ఈ ఘన విజయం  

తాడేప‌ల్లి:  మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి చ‌విచూసిన ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌కు సిగ్గుంటే రాష్ట్రంలోకి రాకూడ‌ద‌ని మంత్రి కొడాలి నాని సూచించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాల‌ని, ప్ర‌భుత్వానికి మంచి సలహాలు, సూచనలు చేయాలని చెప్పారు. సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ను చూసి చంద్రబాబు చాలా నేర్చుకోవాల‌ని హిత‌వు పలికారు.   తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఆదివారం సాయంత్రం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి  కొడాలి వెంకటేశ్వరరావు (నాని)  ఎమ్మెల్యేలు అబ్బయ్యచౌదరి, వల్లభనేని వంశీతో కలిసి మీడియాతో మాట్లాడారు.  

– ఇచ్చిన మాటను నిలబెట్టుకునేవాడు నాయకుడు. ప్రజల ఓటు కావాలని ప్రతి ఎన్నికలకూ మేనిఫెస్టో ఇచ్చి, నాలుగు మున్సిపాలిటీలు తిరిగి పనికిమాలిన మాటలు చెబితే ప్రజలు ఏ రకంగా గుణపాఠం చెబుతారో ఈ ప్రజా తీర్పు ఒక నిదర్శనం. శ్రీ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించారు. అందువల్లే మేనిఫెస్టోలో చెప్పిన కార్యక్రమాలను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చారు. రాష్ట్రంలో కరోనా వచ్చినా, ఆర్థిక సమస్యలు ఉన్నా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్నింటిని 21 నెలల నుంచి ప్రజలకు అందజేస్తున్నారు. మేనిఫెస్టోను ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, మంత్రుల ఆఫీసుల్లో పెట్టి వాటిని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. 

– రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఒక్క ప్రాంతానికే రాష్ట్ర సంపద తెచ్చి పెడితే మిగిలిన ప్రాంతాలు వెనకబడతాయని సీఎం భావించారు. అందుకే అభివృద్ధితో పాటు అధికారాన్ని వికేంద్రీకరణ చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. పరిపాలన రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, జ్యుడిషియల్‌ రాజధానిగా కర్నూలుగా నిర్ణయించారు. ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తూ సీఎం శ్రీ జగన్‌ ముందుకు వెళ్తున్నారు. 

– ప్రజలు ఆదరిస్తారన్న నమ్మకంతో ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్జ్‌లు, మంత్రులకు స్థానిక సంస్థల ఎన్నికలను సీఎం శ్రీ జగన్‌ అప్పజెప్పారు. స్థానిక ఎన్నికలు సందర్భంగా ప్రజలు వద్దకు సీఎం వచ్చి ఓటు వేయమని అడగలేదు. అయినా వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులకు ప్రజలు ఓటు వేసి మొత్తం 75 మున్సిపాలిటీలు, 11 కార్పొరేషన్లలో అఖండమైన మెజార్టీతో గెలిపించారు. పట్టణాలు, పల్లెలు అని తేడా ఏమీ లేదు. సీఎం శ్రీ జగన్‌ గారికి ఏకపక్ష విజయాన్ని ప్రజలు ఇచ్చారు. 

– జనానికి ఏం కావాలో.. శ్రీ జగన్‌ గారికి తెలుసు. శ్రీ జగన్‌ గారికి ఏం కావాలో జనానికి తెలుసు అని పలు సందర్భాల్లో చెప్పాను. మధ్యలో కొన్ని పార్టీలు ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేసి సీఎం శ్రీ జగన్‌పై విమర్శలు చేస్తున్నాయి. ఇవాళ ఆ విమర్శలు అన్నింటికీ కుక్కకాటుకి చెప్పుదెబ్బలా ప్రజలు గొప్ప తీర్పు ఇచ్చారు. 

– 40 ఏళ్లు అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ప్రజల మన్ననలు పొందిన సీఎం శ్రీ జగన్‌కు తన అనుభవాలను సలహాలు, సూచనల రూపంలో తెలియజేసి రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలి. అంతే కాని నిత్యం సీఎంపై విషం కక్కుతూ చంద్రబాబు చేసే కార్యక్రమాలు మంచివి కావు. చంద్రబాబు, ఆయన పార్టనర్‌ పవన్‌ కళ్యాణ్‌ ట్వీట్లు చేశారు. ఓట్లు వేయకపోతే సంక్షేమ కార్యక్రమాలు తీసేస్తామని.. పొట్ట కొడతామని బెదిరించి ఓటేయించుకున్నామని ఆ ట్వీట్లలో చెబుతున్నారు. 

– ఎన్నికల ముందు ఏమో.. శ్రీ జగన్‌ ఏ సంక్షేమ కార్యక్రమమూ చేయటం లేదు. ఈ చేత్తో రూపాయి ఇచ్చి ఇంకో చేత్తో పది రూపాయలు తీసేసుకుంటున్నారని విమర్శలు చేశారు. రూ.10 వేలు ఇచ్చి లక్ష రూపాయలు తీసుకుంటున్నారని, అమ్మ ఒడిలో ఇచ్చి నాన్న బుడ్డి పేరుతో డబ్బులు తీసేసుకుంటున్నారని ఆరోపించారు. ఇవాళ ఏమో.. సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వరేమో అని భయపెట్టి ఓటేయించుకున్నారని చెబుతున్నారు. ప్రతిపక్షాలకు తమ మీద తమకే నమ్మకం లేదు. ఎన్నికల ముందు ఒక మాట.. ఎన్నికలు అయ్యాక మరొక మాట చెబుతారు. ఇప్పటికైనా చంద్రబాబు కావొచ్చు. ఆయన సారధ్యంలో నడుస్తున్న జనసేన, సీపీఐ పార్టీలు ఆలోచన చేయాలి. వయస్సులో చిన్నవాడు. పార్టీ పెట్టి ప్రజలకు ఎలా దగ్గర అయ్యాడో గమనించాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం శ్రీ జగన్‌ ఈ ఎన్నికల్లో ప్రచారానికి రాకుండా, ఓటేయమని వీడియో రూపంలోనూ, సమావేశాల్లో, సభల్లో కోరకపోయినా ప్రజలు గెలిపించారు. ఈ విషయంలో శ్రీ జగన్‌ గారిని చూసి ప్రతిపక్ష పార్టీలు నేర్చుకోవాలి. మాకు వయస్సు వచ్చింది. మాకు అనుభవం వచ్చిందని చెప్పటం కాదు. 

– ఎన్నికల ముందు రోజు గుంటూరు, విజయవాడలో చంద్రబాబు పర్యటించి ప్రజలకు సిగ్గు, శరం లేదంటారు. ఇంటికి ఒకరు ముందుకు రావాలంటారు. పాచి పనులు చేసుకోవటానికి మద్రాసు, బెంగళూరు, హైదరాబాద్‌ పోతారు కానీ, వైయస్‌ఆర్‌సీపీ జెండా పట్టుకుంటే తన్ని తరిమేయాలని చంద్రబాబు అనటం ఏంటి? ఈరోజు రాష్ట్ర ప్రజలే చంద్రబాబును తన్ని తరిమేశారు. ఈరోజు హైదరాబాద్‌లో పప్పూ, తుప్పూ నాయుడులే పాచిపనులు చేసుకుంటున్నట్లు ఉన్నారు. అయినా వారికి సిగ్గు లేదు. ప్రజలకు సిగ్గు ఉంది. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు అర్థమవుతున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు చూశాక అయినా చంద్రబాబు ఈ జిల్లాల్లో అడుగు పెట్టవద్దు.

– పంచాయితీ ఎన్నికల్లో, మున్సిపల్‌ ఎన్నికల్లో గెలవటానికి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ, ఏబీఎన్‌ రాధాకృష్ణ, టీవీ5 బీ.ఆర్‌.నాయుడు, ఈటీవీ రామోజీ, కుల సంఘాలు అన్నీ కలిసిపోయాయి. దీనిపై ఒక కుట్ర కాదు. 8న మహిళా దినోత్సవం జరిగింది. ఐదారుగురు కలిసి .. రాధాకృష్ణ, బీ.ఆర్‌.నాయుడు, లోకేశ్, చంద్రబాబు మహిళలను అడ్డంపెట్టుకొని అమాయక రైతుల్ని రోడ్డు మీదకు తెచ్చి వారిని అరెస్ట్‌ చేయించి సీఎం శ్రీ జగన్‌ను, పోలీసు వ్యవస్థను ఇష్టమొచ్చినట్లు తిట్టించారు. తర్వాత 9వ తేదీన వారిని పరామర్శించటానికి చంద్రబాబు వెళ్తారు. ఇదేదో.. మహిళలకు, అమరావతి ప్రాంతానికి శ్రీ జగన్‌ ప్రభుత్వం అన్యాయం ఏదో చేస్తున్నారని చూపించే ప్రయత్నం చేశారు. మహిళా దినోత్సవం రోజున వారికి సహాయం చేయకపోగా రాజకీయ లబ్ది పొందటానికి చంద్రబాబు ప్రయత్నించారు. చంద్రబాబుకు చెంచాగిరీ చేసే రెండు, మూడు ఛానల్స్, రాజధాని ప్రాంతంలో కొంత మంది మహిళలను ఆర్గనైజ్‌ చేసి వారిని రోడ్డు ఎక్కించి వారే బట్టలు చించుకొని ప్రభుత్వం మీద, సీఎం మీద, వైయస్‌ఆర్‌సీపీ మీద అభాండాలు వేస్తారు. పైగా 9వ తేదీన కృష్ణా, గుంటూరు జిల్లాల వారికి వైయస్‌ఆర్‌సీపీకి ఓటు వేయవద్దని పిలుపు ఇస్తారు. 

– అమరావతిలో నిజమైన రైతులు, పొలాలు ఉన్న రైతులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. శ్రీ జగన్‌ గారు అమరావతిని తరలించి మొత్తం తీసి వేయటం లేదు. పరిపాలన రాజధాని మాత్రమే విశాఖ తీసుకువెళ్తున్నారు. జ్యుడిషియల్‌ రాజధాని కర్నూలుకు వెళ్తుంది. ఇప్పుటికైనా దొంగ చంద్రబాబు, ఏబీఎన్‌ రాధాకృష్ణ, టీవీ5 బీ.ఆర్‌.నాయుడు మాటల్ని నమ్మవద్దు. వీరెవ్వరికీ ప్రజల్లో బలం లేదు. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు తప్ప మీకు ఏరకంగా ఉపయోగపడరు. 

– ఇప్పటికైనా అమరావతి రైతులు దుర్మార్గులను వదిలేసి ప్రభుత్వంతో చర్చలు జరపాలి. అమరావతిలో ప్లాట్లు ఏం కావాలో, రోడ్లు ఏం కావాలో, ప్రభుత్వ సంస్థలు ఏం కావాలో, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే.. భూమి విలువ పడిపోకుండా ఉండాలంటే ఏం కావాలో ఒక ఎజెండాతో వస్తే.. సీఎం శ్రీ జగన్‌ చర్చిస్తారు. తద్వారా ఈ ప్రాంతం ఎక్కువ అభివృద్ధి చేయటానికి వైయస్‌ఆర్‌సీపీ, సీఎం శ్రీ జగన్‌ ముందు ఉంటారు. సీఎం శ్రీ జగన్‌ గారికి కులాలు, మతాలు, ప్రాంతాలు లేవు. అన్ని ప్రాంతాలను సమానదృష్టితో చూస్తారు. ఇప్పటికైనా పార్టీ కోసం, రాజకీయం కోసం మిమ్మల్ని వాడుతున్న దుర్మార్గుల్ని వదిలేయండి. వారి పదవుల కోసం మీ వెనకాల కొంతమంది తిరుగుతున్నారు. ఇప్పటికైనా రైతులు ఈ అమరావతి ఇష్యూను సెటిల్‌ చేసుకోవాలని కోరుతున్నాను.

– విజయవాడ, గుంటూరులో చంద్రబాబు అమరావతిని రెఫరెండంగా చెప్పారు. మేం ఏమీ చెప్పలేదు. ఇక్కడ ఓడిపోతే ప్రజలే వద్దు అనుకుంటున్నారని భావిస్తానని చంద్రబాబే స్వయంగా చెప్పిన విషయాన్ని కొడాలి నాని గుర్తుకు చేశారు. అమరావతి రావటం వల్ల కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అభివృద్ధి చెందలేదు. వెళ్లిపోవటం వల్ల ఈ ప్రాంతానికి వచ్చే నష్టమూ లేదు. ఈ ప్రాంతానికి ఏం కావాలో ఒక ఎజెండాతో వస్తే ప్రభుత్వంతో చర్చలు జరిపి న్యాయం చేయటానికి వైయస్‌ఆర్‌సీపీ, సీఎం శ్రీ జగన్‌ సిద్ధంగా ఉంటారు. 

– రాజకీయ ముసుగులో ఉన్న గుంటనక్క చంద్రబాబు ఈ ప్రాంతానికి రాకుండా చేయాలి. మనకు సిగ్గు, శరం లేదు. మనం చచ్చిన వాళ్లం అని వాళ్లు చెప్పారు. పప్పూ, తుప్పూనాయుడులకు సిగ్గు ఉంటే ఈ ప్రాంతంలో అడుగు పెట్టవద్దు. మేం చచ్చినవాళ్లతో సమానం అనుకుంటే వచ్చి తిరగండి. 

– పంచాయితీ ఎన్నికల్లో సింబల్‌ లేదు. అయినా మంగళగిరి టీడీపీ పార్టీ ఆఫీసులో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు ఏమో.. 38.7%, లోకేశ్‌ ఏమో..40.2%, 41.07% పిచ్చి లెక్కలు చెప్పి మేమే పంచాయితీలు గెలిచామన్నారు. ఈరోజు చంద్రబాబు మీడియా ముందుకు ఎందుకు రాలేదు. ఈరోజు టీడీపీ టపాసులు ఎందుకు కాల్చలేదు. పంచాయితీ ఎన్నికల్లోనే 85% వైయస్‌ఆర్‌సీపీని గెలిపించారు. రాష్ట్ర ప్రజలు కార్పొరేషన్, మున్సిపల్, పంచాయితీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చారు. 

– టీడీపీ నాయకులు నన్ను బూతుల మంత్రి అంటారు. ఇంకొకరిని కొబ్బరి చిప్పల మంత్రి అని, మరొకరిని పిట్టకథలు మంత్రి అని, ఇంకొకరిని హవాలా మంత్రి అని చంద్రబాబు చెబుతారు. మేం ఎవ్వరమూ బూతుల మంత్రులమూ కాదు. కొబ్బరి చిప్పలూ అమ్ముకోలేదు. చంద్రబాబు వెనకాల ఉన్నవారే కొబ్బరి చిప్పలు అమ్ముకున్నారు. కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌ వ్యవహారంలో మహిళలను వ్యభిచార వృత్తిలోకి దించిన సన్నాసులు టీడీపీలోనే ఉన్నారు. సీఎం శ్రీ జగన్‌ గారిని పప్పూ, తుప్పూ నాయుడులే బూతులు తిట్టారు. వారికి ఇష్టమైన వ్యక్తుల్ని ఏబీఎన్, టీవీ5 ల్లో గంటలు గంటలు చర్చలు పెట్టి అడ్డమైన మాటలు తిట్టించారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు చూశారు కాబట్టే ఇలాంటి తీర్పు ఇచ్చారు. ఏబీఎన్, టీవీ5లు చర్చలు ఆపవద్దు. పనికిమాలిన వాళ్లకు సూటు, బూటు వేసి మా ప్రభుత్వాన్ని తిట్టించాలి. తద్వారా తెలంగాణలో టీడీపీకి ఏ గతి పట్టించారో ఆ రకంగా రాష్ట్రంలో చంద్రబాబుకు, టీడీపీ గతి పట్టించే వరకు రాధాకృష్ణ, బీ.ఆర్‌.నాయుడు కృషి చేయాలి. ఈ విజయం అందించిన ఏబీఎన్, టీవీ5 అందులో వచ్చిన అపర మేధావులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 

– ఫేక్‌ ముఖ్యమంత్రి శ్రీ జగన్‌ అని చంద్రబాబు అంటారు. ఇవాళ ప్రజలు తీర్పు ఇచ్చారు. రాష్ట్ర ప్రజలే చంద్రబాబును చెప్పుతో కొట్టినట్లు తీర్పు ఇచ్చారు. అయినా తెల్లారేసరికి చంద్రబాబు ఏ మొహంతో రాష్ట్రంలోకి దిగిపోతారు. సీఎం శ్రీ జగన్‌ గారు రాష్ట్ర ప్రజలకు లక్ష కోట్లు ఇచ్చారు. వైయస్‌ఆర్‌సీపీ తరుపున, సీఎం శ్రీ జగన్‌ గారి తరుపున ఇవాళ తీర్పు ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. 

– ఇలాంటి ఫలితం వస్తుందని వైయస్‌ఆర్‌సీపీలో పని చేస్తున్న నాయకులు, కార్యకర్తలు అందరికీ తెల్సు. చంద్రబాబును, ఆయన్ను నమ్మిన అమాయకులు, జనసేన, పవన్‌ కళ్యాణ్‌ దొంగమాటలు నమ్మి శ్రీ జగన్‌ గారిపై వ్యతిరేకత ఉంటుందని కొన్ని చోట్ల పోటీ చేసి అప్రతిష్ట పాలయ్యారు. కొన్ని చోట్ల ఏకగ్రీవాలు అయ్యాయి. ఏకగ్రీవాలు అయితే భూకంపం వచ్చినట్లు, ప్రళయం వచ్చినట్లు చంద్రబాబు అనటం సరి కాదు. వ్యాపారాలు చేసుకునే వారికి చంద్రబాబు సీట్లు ఇస్తే ఓడిపోయిన తర్వాత వారి రాజకీయాలు వదిలేసి వెళ్లిపోయారు. ఆ ప్రాంతాల్లో ఏకగ్రీవాలు అయితే దాన్ని కూడా సీఎం శ్రీ జగన్‌ గారిపై చంద్రబాబు అభాండాలు వేసి రాజకీయ లబ్ధి పొందాలని చూశారు. 

– ఈ తీర్పును తలకు ఎక్కించుకోకుండా.. ప్రజలకు సేవ చేయటానికి మరింత కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.. అంటూ ప్రెస్‌ మీట్‌ ముగించిన మంత్రి కొడాలి నాని, ఆ తర్వాత మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..:

– ఓటమిపై ట్విట్టర్‌లో చంద్రబాబు స్పందించారు. మంచి రోజులు ముందు ఉన్నాయని అన్నారు. ముందు ఉంది మంచి రోజులు కావు.  చంద్రబాబుకు మొసళ్ల పండగ. తుప్పు, పప్పూనాయుడులకు సీఎం శ్రీ జగన్‌ గారి గన్‌లో బుల్లెట్‌లే కనపడలేదు. శ్రీ జగన్‌ గారు ఒక్క రౌండ్‌ నొక్కితేనే 151 మంది పడిపోయారు. అందులో మంగళగిరిలో పప్పూనాయుడు ఉన్నారు. అయినా సరే.. ఒక్క బుల్లెట్‌ తగిలినా తగల్లేదని చెబుతారు. శ్రీ జగన్‌ గారి దెబ్బకు టీడీపీ క్లోజ్‌. రాజకీయాల్లో పరిపక్వత ఉన్న ఏ వ్యక్తి అయినా శ్రీ జగన్‌ గారి దెబ్బకు టీడీపీ తట్టుకోలేదు. చంద్రబాబు మళ్లీ జీవితంలో ముఖ్యమంత్రి అవ్వలేరు. పప్పూ నాయుడు, ఇతర టీడీపీ నాయకులు మళ్లీ గెలవలేని పరిస్థితి ఉందని వారికీ తెల్సు. వెనకాల ఉన్న పది మందీ పారిపోకుండా చంద్రబాబు వారికి చెప్పే దొంగమాటలు ఇవి. 

– తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే పవన్‌ కళ్యాణ్‌ వచ్చి టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నామని అంటారు. ఎన్నికల ప్రక్రియ చూస్తే బీజేపీ, జనసేనకు రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్పారు. ఇప్పుడు ఎలాగైనా బీజేపీని వదిలించుకోవాలి. అంతకుముందు సీపీఐ, సీపీఎం, మాయావతితో పొత్తు పెట్టుకున్నారు. ఎన్నికలు అవ్వగానే వారి ముగ్గురినీ పవన్‌ వదిలేశారు. ఈరోజు బీజేపీని వదిలేసి తనను దత్తత తీసుకున్న చంద్రబాబు పంచన చేరాలని పవన్‌ ప్రయత్నిస్తున్నారు. దాని కోసం ఏదో ఒక వంక కావాలని పవన్‌ ప్రయత్నిస్తున్నారు. 

– తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల టీడీపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. అయినా చిత్తు చిత్తుగా ఓడిపోయారు. అలయెన్స్‌ ఏర్పాటు కోసం బీజేపీపై పవన్‌ రాళ్లు వేస్తున్నారు. మీరు కలిస్తే కలవండి. ఎస్‌ఈసీ, ఏబీఎన్, టీవీ5, టీడీపీ, పవన్‌ కళ్యాణ్‌ అందరూ కలిశారు. ఇన్ని శక్తులు కలిసినా సీఎం శ్రీ జగన్‌ గారిని ఏమీ చేయలేకపోయారు. ప్రజల్ని నమ్మి రాజకీయాలు చేయటానికి సీఎం శ్రీ జగన్‌ వచ్చారు. ఏ పార్టీతోనూ సీఎం శ్రీ జగన్‌ పొత్తు పెట్టుకోరు. ఏ ఎన్నిక వచ్చినా సింహం సింగిల్‌గానే వస్తుంది. శ్రీ జగన్‌ గారు కూడా ఒంటరిగానే వస్తారు. రేపు తిరుపతిలో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ 4 లక్షల మెజార్టీతో వైయస్‌ఆర్‌సీపీ గెలిచి తీరుతుంది. శ్రీ జగన్‌ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఐదు కోట్ల ప్రజల ఆశీస్సులు సీఎం శ్రీ జగన్‌ గారికి ఉన్నాయి. 

– ఐదు కోట్ల ఆంధ్రులు శ్రీ జగన్నాథ రథాన్ని లాగుతారు. ఎంతమంది అడ్డం వచ్చినా ఆ రథం కింద నలిగిపోక తప్పదు. 

– గెలిచిన స్థానాల్లో.. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇంఛార్జిలు ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో.. అన్ని కులాలను సమానంగా రాజకీయాల్లో ముందుకు తీసుకువెళ్లాలని సీఎం శ్రీ జగన్‌ నిర్ణయించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఒత్తిడులు ఉన్నా, బీసీ, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలకు సముచిత స్థానాన్ని కేబినెట్‌లో సీఎం శ్రీ జగన్‌ కల్పించారు. కులాలు, మతాలను దృష్టిలో ఉంచుకుని మేయర్లు, ఛైర్మన్‌లపై సీఎం ఒక నిర్ణయం తీసుకుంటార‌ని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.
 

Back to Top