బ్లాక్‌ మార్కెట్‌ దొంగలు చంద్రబాబు, రామోజీ

హెరిటేజ్‌ పాలు, ప్రియా పచ్చళ్లతో ఇద్దరూ బ్లాక్‌ మార్కెట్‌ను పెంచిపోషిస్తున్నారు

మార్కెట్‌లో నిత్యావ‌స‌ర‌ ధరలు తెలుసుకోకుండా అబద్ధాలు ప్రచురిస్తారా..?

బాబు చెప్పిన అబద్ధాలు ప్రచురించి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు

ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ5లను పూర్తిగా నిషేధిస్తున్నాం

ఎల్లో మీడియాను ఇంటర్వ్యూలు, డిబేట్లు, ప్రెస్‌మీట్లకు పార్టీ శ్రేణులు పిలవొద్దు

బాబు లాంటి వెధవలు ఎంతమంది వచ్చినా సీఎం సంకల్పాన్ని ఆపలేరు

రూ.230 చొప్పున 2.70లక్షల మెట్రిక్‌ టన్నుల సిమెంట్‌ పేదలకు అందించిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ది

హైదరాబాద్‌ రింగ్‌రోడ్డు, ఎయిర్‌పోర్టు నిర్మించింది దివంగత మహానేత వైయస్‌ఆర్‌

చంద్రబాబు వేసినట్టు నిరూపిస్తే రాజకీయాలకు వదిలేసి వెళ్లిపోతా

వైయస్‌ జగన్‌ను దించి చంద్రబాబు సీఎం కుర్చీలో కూర్చుంటే.. ఈ రాష్ట్రం వదిలేసి వెళ్లిపోతా..

చంద్రబాబుకు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఛాలెంజ్‌

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై, పార్టీ, ప్రభుత్వంపై నిత్యం విషంకక్కే ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ5లను ఈరోజు నుంచి పూర్తిగా నిషేధిస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. మంత్రులు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ్యులు, పార్టీ అధికార ప్రతినిధులు పార్టీ ఆఫీసుల్లో, వారు పాల్గొనే కార్యక్రమాలకు ఈనాడు, ఈటీవీ, టీవీ5, ఏబీఎన్, ఆంధ్రజ్యోతిలను పిలవొద్దని, ఎవ్వరూ వారికి ఇంటర్వ్యూలు, డిబేట్లకు, మీడియా సమావేశాలకు పిలవకూడదని మంత్రి కొడాలి నాని వైయస్‌ఆర్‌ సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సిగ్గులేకుండా చంద్రబాబు అబద్ధాలు చెబుతుంటే.. వాస్తవాలు తెలుసుకోకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ5, ఈటీవీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని, బాబు చెప్పేవి అబద్ధమా.. నిజమా అని తెలుసుకోవాలనే ఇంగితజ్ఞానం లేదా..? అని ప్రశ్నించారు. 

మార్కెట్‌లో లభించే నిత్యావసర సరుకుల ధరల కంటే ఎక్కువగా ప్రచురించి ప్రభుత్వంపై చంద్రబాబు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. హెరిటేజ్‌ కంటే తక్కువ ధరలకు మార్కెట్‌లో సరుకులు లభిస్తున్నాయని చెప్పారు. హెరిటేజ్‌ పాలు అమ్ముకునే చంద్రబాబు, ప్రియా పచ్చళ్లు అమ్ముకునే రామోజీరావు ఇద్దరూ కలిసి బ్లాక్‌ మార్కెట్‌ దందాను పెంచిపోషిస్తున్నారన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొడాలి నాని విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని ఏం మాట్లాడారంటే..

‘‘4వ తేదీన చంద్రబాబు చెప్పాడని రామోజీరావు కొన్ని ధరలను ప్రచురించాడు.  పెసరపప్పు రూ.140 అని 4వ తేదీన వేశాడు. నిన్న 5వ తేదీన రూ.110 అని చంద్రబాబు చెప్పాడని వేశాడు. కందిపప్పు 4వ తేదీన రూ.147 అని, 5వ తేదీన రూ.118 రేట్‌ అని వేశాడు. చింతపండు రూ.270 అని 5వ తేదీన, రూ.354 అని 4వ తేదీన వేశాడు. వేరుశనగ పప్పు రూ.162 అని 4వ తేదీన, రూ.140 అని 5వ తేదీన వేశాడు. వేరుశనగ నూనె రూ.177 అని 4వ తేదీన, రూ.185 అని నిన్న వేశాడు. ఇవన్నీ రామోజీ ఈనాడు పేపర్‌లో రోజు వ్యవధిలోనే రేట్లు మార్చాడు. మొన్న ఒకరేటు, నిన్న ఒక రేటు చంద్రబాబు చెప్పాడని వేశాడు. 

నోటికి ఏదివస్తే అది చంద్రబాబు చెప్తాడు.. సిగ్గులేకుండా రాసేయడం తప్పించి మార్కెట్‌లో ఏ పరిస్థితి ఉందో తెలుసుకుందాం అనే ఇంగితజ్ఞానం కూడా కోల్పోయి ప్రతిపక్ష నేత, రామోజీ కలిసి విష ప్రచారం చేయాల్సిన అవసరం ఉందా..? ఈనాడు పత్రికలో వేసిన నిన్న, మొన్న వేసిన నిత్యావసర ధరలకు, రాష్ట్రంలోని నిత్యావసర వస్తువుల ధరలకు ఎటువంటి సంబంధం లేదు. తెలంగాణ, కర్ణాటకలో తక్కువ ఉందని దొంగ మాటలు చంద్రబాబు చెబితే.. దొంగ రాతలు రామోజీ రాస్తున్నాడు. సిగ్గు, శరం లేకుండా విషప్రచారం చేస్తున్నారు. 

చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌లో సరుకులు కొనుగోలు చేసి బిల్లులు తెచ్చాం. ఎవరైనా విచారణ చేసుకోవచ్చు. ఈనాడు పత్రికలో రామోజీ, చంద్రబాబు వేసిన ధరల కంటే హెరిటేజ్‌లో ధర తక్కువగా ఉంది. హెరిటేజ్‌లో ఉన్న రేటు కంటే మార్కెట్‌లోని షాపుల్లో ధరలు ఇంకా తక్కువగా ఉన్నాయి. కనీసం సిగ్గు, శరం లేకుండా, ఇంగితం లేకుండా, హెరిటేజ్‌లో ఎంత అమ్ముతున్నారో తెలుసుకోకుండా పనికిమాలిన చంద్రబాబు లాంటి దొంగలు చెప్పిన వార్తలను ఈనాడు పత్రికలో ప్రచురించడం అంటే రామోజీరావు ఎంత దిగజారిపోయాడో ప్రజలు అర్థం చేసుకోవాలి. 

హెరిటేజ్‌లో ఫ్రీడమ్‌ సన్‌ప్లవర్‌ ఆయిల్‌ లీటర్‌ రూ.137 ఉంటే.. మార్కెట్‌లో 130 ఉంది. హెరిటేజ్‌లో రూ.7 అదనం. రూ.177 ఉందని ఈనాడులో వేశారు. ఆశీర్వాద్‌ గోదుమపిండి కేజీ హెరిటేజ్‌లో రూ.59 ఉంటే మార్కెట్‌లో రూ.52 ఉంది. హెరిటేజ్‌ కంటే ఎక్కువ రేటు ఈనాడు పత్రికలో వేశారు. పెసరపప్పు కేజీ హెరిటేజ్‌లో రూ.145 ఉంటే.. మార్కెట్‌లో రూ.105 ఉంది. దొంగ, సన్యాసి చంద్రబాబు రూ.177 అని అబద్ధాలు చెప్తాడు.. దాన్ని రామోజీరావు ప్రింట్‌ చేస్తాడు. పల్లీలు హెరిటేజ్‌లో రూ.175 ఉంటే.. మార్కెట్‌లో రూ.135 ఉంది. రూ.200పైగా ఉందని ఈనాడు పేపర్‌లో వేసుకుంటున్నారు. కందిపప్పు కేజీ హెరిటేజ్‌లో రూ.124 ఉంటే.. మార్కెట్‌లో రూ.100 ఉంది. శనగ గుండ్లు హెరిటేజ్‌లో రూ.135 ఉంటే.. మార్కెట్‌లో రూ.110 ఉంది. ఈనాడు పేపర్‌లో రూ.170 అని విషప్రచారం చేస్తున్నారు. గోదుమపిండి మార్కెట్‌లో రూ.35–40 ఉంటే.. హెరిటేజ్‌లో రూ.70 ఉంది. రూ.85 అని సిగ్గులేని ప్రతిపక్షం, ఈనాడు దుష్ప్రచారం చేస్తున్నాయి. పచ్చిశనగ పప్పు రూ.89 హెరిటేజ్‌లో ఉంటే.. మార్కెట్‌లో రూ.70 ఉంది. రూ.100పైగా ఉందని ఈనాడులో రాస్తున్నారు. 

సిగ్గు, శరం అన్నీ వదిలేసి దొంగరాతలు రాస్తున్నారు. చంద్రబాబు అంటే సిగ్గు, శరం వదిలేశాడు.. ఈనాడు కూడా వదిలేసింది. చంద్రబాబు ఏది చెబితే అది ప్రచురించడానికి సిగ్గు, శరం లేకుండా ప్రజలను మభ్యపెట్టాలని, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలనే దొంగ ఆలోచన తప్ప. పేపర్, విలువలు అన్నీ మర్చిపోయారు. 

రామోజీరావు నీతులు చెబుతున్నాడు. ప్రియ పచ్చళ్లు అనకాపల్లి నుంచి అమెరికా వరకు అమ్ముకుంటున్నాడు. టమాట పచ్చడి కేజీ రూ.280, అదే విజయవాడ నగరంలోని స్వగృహలో రూ.200. ఏ పచ్చడి అయినా సరే రూ.280కి రామోజీ అమ్ముకుంటున్నాడు. స్వగృహలో రూ.200, రూ.180కి పచ్చళ్లు దొరుకుతున్నాయి. హెరిటేజ్‌లో కూడా పాలు, పెరుగు అన్నీ కూడా దొంగ రేట్లు. 30 నుంచి 40 శాతం ఎక్కువకు అమ్ముకునే చంద్రబాబు, రామోజీ కలిసి పేదలపై వీరికి మమకారం ఉన్నట్టు బిల్డప్‌ ఇస్తున్నారు. బ్లాక్‌ మార్కెట్‌ దొంగలు చంద్రబాబు, రామోజీ. 

వీరిద్దరూ కలిసి రాష్ట్రంలో రేట్లు పెరిగిపోయాయి.. అరికట్టలేకపోతున్నారు.. అని బిల్డప్‌ ఇస్తున్నారు. అరికడితే నువ్వు ఎవరు అని అడుగుతారు. హెరిటేజ్‌ పాలు అమ్ముకునే చంద్రబాబు, పచ్చళ్లు అమ్ముకునే రామోజీ ఇద్దరూ కలిసి బ్లాక్‌ మార్కెట్‌ను పెంచిపోషిస్తున్నారు. హెరిటేజ్‌ ధరలను సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయించినట్టు దొంగ మాటలు మాట్లాడుతున్నారు. వయస్సు మీదపడుతున్నా.. జనం ఏమనుకుంటారనే ఇంగితజ్ఞానం ఉండాలి కదా..

సిమెంట్‌ ధరలు అని మాట్లాడుతున్నారు. 2.70 లక్షల మెట్రిక్‌ టన్నుల సిమెంట్‌ను పేదలకు ఇళ్లు కట్టుకోవడానికి, నాడు–నేడుతో స్కూళ్లు, ఆస్పత్రుల అభివృద్ధికి, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పబ్లిక్‌ అవసరాలకు సిమెంట్‌ కంపెనీలతో మాట్లాడి మార్కెట్‌లో రూ.350 ఉంటే.. రూ.230కి మించి విక్రయించడానికి లేదని ఆదేశాలిచ్చిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ది. ఆయనకు సిమెంట్‌ ఫ్యాక్టరీ ఉన్నప్పటికీ, ఆయన ఫ్యాక్టరీతో కలిసి మిగిలిన ఫ్యాక్టరీలకు కూడా ఆంక్షలు పెట్టి జీవో విడుదల చేసి పేదలు, రాష్ట్ర అవసరాల కోసం రూ.230కి మించి అమ్మడానికి వీల్లేదని నిబంధన తెచ్చారు. 2.70లక్షల మెట్రిక్‌ టన్నులు పేదలకు అందించిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ది. చంద్రబాబుకు, రామోజీరావుకు సీఎం గురించి మాట్లాడే  స్థాయి లేదు. 

పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే.. షాపులకు వెళ్లి నిత్యావసర సరుకులు కొనలేకపోతున్నామని పేదలు కడుపు మాడ్చుకునే పరిస్థితి గ‌తంలో ఈరాష్ట్రంలో ఉంటే.. వీరిద్దరి మధ్య ఉన్న దళారీలు హెరిటేజ్, ప్రియా పచ్చళ్లు వీరు రైతు దగ్గర తక్కువకు కొని, వినియోగదారుడికి ఎక్కువ అమ్ముకుంటూ లక్షల కోట్ల రూపాయలు లూటీ చేస్తున్న దుర్మార్గులు చంద్రబాబు, రామోజీరావు. సిగ్గులేకుండా చంద్రబాబు శ్రీరంగ నీతులు చెబుతుంటే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ5, ఈటీవీ అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు చెప్పేది అబద్ధమా.. నిజమా అని తెలుసుకోవాలనే ఇంగితజ్ఞానం లేదా..? 

ఈరోజు నుంచి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మంత్రులు, శాసనసభ్యులు, పార్టీ అధికార ప్రతినిధులు పార్టీ ఆఫీసుల్లో, వారు పాల్గొనే కార్యక్రమాల్లో ఈనాడు, ఈటీవీ, టీవీ5, ఏబీఎన్, ఆంధ్రజ్యోతిని పూర్తిగా నిషేధిస్తున్నాం. ఎవ్వరూ వారికి ఇంటర్వ్యూలు ఇవ్వడం, వారితో మాట్లాడటం, మీడియా సమావేశాలకు పిలవకూడదని వైయస్‌ఆర్‌ సీపీ శ్రేణులకు ఆదేశాలిస్తున్నాం. 

చంద్రబాబు నిన్న, మొన్న, ఈరోజు కుప్పంలో రాజకీయ ఉపన్యాసాలు చెబుతున్నాడు. సీఎం వైయస్‌ జగన్‌ను బలంగా ఢీకొట్టాలని ఒకపక్క చెబుతూ.. నీ తండ్రి వైయస్‌ఆర్‌ నన్ను ఏం చేయలేకపోయాడు అని అవాకులు చవాకులు పేలుతున్నాడు. కుప్పంలో పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్‌ ఎన్నికల్లో ఓడిపోయాడు. ముందు చంద్రబాబును తీసి పక్కకు పడేయాలి. టీడీపీకి పనికిమాలిన చవట దద్దమ్మ చంద్రబాబే. వెధవ నడిపే పార్టీలో చంద్రబాబు లాంటి వెధవలు తప్ప మరెవ్వరూ ఉంటారు. 

ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని, మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని సీఎం వైయస్‌ జగన్‌ నెరవేరుస్తున్నారు. ప్రజలకు చేదోడు వాదోడుగా ప్రతి కుటుంబంలో సభ్యుడిగా ఉంటూ అందరూ బాగుండాలని కోరుకుంటూ అడుగులు ముందుకేస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌. 

డ్రామోజీరావులు, ఏబీఎన్‌ రాధాకృష్ణలు, బీఆర్‌ నాయుళ్లు, చంద్రబాబు లాంటి వెధవలు ఎంత మంది వచ్చినా.. సీఎం వైయస్‌ జగన్‌ సంకల్పాన్ని, ఆయన తలపెట్టిన మహాయజ్ఞాన్ని ఏ ఒక్కరూ ఆపలేరు. సీఎం వైయస్‌ జగన్‌ పాలన ఈరాష్ట్రంలో 30 సంవత్సరాలు ఉంటుంది. చంద్రబాబుకు జీవితకాలం సమయం ఇస్తున్నా.. సీఎం వైయస్‌ జగన్‌ను దించి చంద్రబాబు సీఎం కుర్చీలో కూర్చుంటే.. ఈరాష్ట్రం వదిలేసి వెళ్లిపోతా.. సీఎం కుర్చీ నుంచి వైయస్‌ జగన్‌ను దించలేకపోతే చంద్రబాబు హైదరాబాద్‌లోనే ఉండిపోతాడా..? 

హైదరాబాద్‌ రింగ్‌ రోడ్డు దద్దమ్మ చంద్రబాబు వేశాడంట. ఎయిర్‌పోర్టు కూడా కట్టాడంట. ఛాలెంజ్‌ చేస్తున్నా.. హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నువ్వు కట్టలేదు. వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. సోనియా గాంధీ, వైయస్‌ఆర్‌ కలిసి శంకుస్థాపన చేశారు. వైయస్‌ఆర్, సోనియా ఆ ఎయిర్‌పోర్టును ప్రారంభించారు. రింగ్‌రోడ్డుకు శంకుస్థాపన వైయస్‌ఆర్‌ చేస్తే.. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉండగా పూర్తయింది. రింగ్‌రోడ్డులో కూడా చంద్రబాబు ప్రమేయం లేదు. ఈ రెండూ ఆయనే కట్టినట్టు పదే పదే చెప్పుకుంటున్నాడు. 

చంద్రబాబుకు ఛాలెంజ్‌ చేస్తున్నా.. ఎయిర్‌పోర్టు, రింగ్‌ రోడ్డు వేసినట్టు నిరూపిస్తే రాజకీయాలకు వదిలేసి వెళ్లిపోతా.. నిరూపించలేకపోతే నువ్వు ఏం చేస్తావో చెప్పు చంద్రబాబూ. ఎంగిలిమెతుకులకు ఆశపడే వ్యక్తి చంద్రబాబు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఈ రాష్ట్రానికి పట్టిన శనిగాడివని, వైరస్‌వి, దరిద్రానివని చెప్పి ప్రజలు పక్కనబెట్టినా కూడా సిగ్గుశరం లేకుండా డబ్బా ఛానళ్లు, డబ్బా పత్రికలను పెట్టుకొని కుల సంఘాలు, కుల పత్రికలు, కుల మీడియాను పెట్టుకొని సీఎం వైయస్‌ జగన్‌పై విషంకక్కే ప్రయత్నం 24 గంటలు చేస్తూనే ఉన్నాడు. ఈ రాష్ట్రానికి పట్టిన నిష్టదరిద్రుడు, వైరస్‌ చంద్రబాబు, ఇతనికి బాకా ఊదే కుల పత్రికలు, కుల ప్రతినిధులు. 2024లో కూడా చంద్రబాబు చిన్న మెదడు చితికేలా ప్రజలు కొడతారు. అయినా సిగ్గు, శరం ఉండదు కాబట్టి.. కుల పత్రికలు, ఛానళ్లలో మళ్లీ చర్చలు పెట్టుకోవాల్సిందే కానీ సీఎం వైయస్‌ జగన్‌ను ఏమీ చేయలేరు. 

80 సంవత్సరాల వయస్సు వచ్చిన పెద్దలు రామోజీరావు విజ్ఞతతో ఆలోచించి.. బుద్ధితెచ్చుకొని చంద్రబాబు ట్రాప్‌లో పడకుండా పత్రికకు ఉన్న విశ్వసనీయత నిలబెట్టుకొని నడవాలి. చంద్రబాబుకే బాకా ఊదుతాను.. నాకు దేవుడు, ఒకటే కులం అని ప్రయత్నిస్తే.. ప్రజలు అమాయకులు కాదు.. మళ్లీ మళ్లీ చావుదెబ్బ కొడుతూనే ఉంటారు’’ అని హెచ్చరించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top