ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాటతీస్తాం..

ప్రతి పేదవాడి హృదయంలో సీఎం వైయస్‌ జగన్‌ ఉన్నారు

పారిపోవడం చంద్రబాబు రక్తంలోనే ఉంది

పప్పు, తుప్పును నమ్ముకుంటే.. టీడీపీకి తెలంగాణలో పట్టిన గతే..

నామినేషన్లు వేసిన తర్వాత టీడీపీ బహిష్కరణ డ్రామా ఆడింది

ఎంపీటీసీలుగా గెలిచిన టీడీపీ అభ్యర్థులను చంద్రబాబు సస్పెండ్‌ చేస్తారా..?

చంద్రబాబు, టీడీపీ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలి

పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హెచ్చరిక

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనాన్ని తట్టుకోలేకి, ఓటమి భయంతో ఎన్నికల కమిషన్‌ను అడ్డంపెట్టుకొని పారిపోయిన చవట దద్దమ్మ, పిరికిపంద చంద్రబాబు అని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఎస్‌ఈసీగా ఉన్న సమయంలో ఎన్నికలు వాయిదా వేసి తప్పించుకున్న చంద్రబాబు.. కొత్త కమిషనర్‌ వచ్చిన తరువాత ఓటమి భయంతో పారిపోయాడన్నారు. కుప్పం, నారావారిపల్లె, నిమ్మకూరు, కవరోలులో ఎక్కడా తెలుగుదేశం పార్టీ గెలవదని, వైయస్‌ఆర్‌ సీపీని అడ్డుకోలేమని, ప్రజల్లో నవ్వుల పాలవుతామని బహిష్కరణ అంటూ ఆఖరి నిమిషంలో చేతులెత్తేశాడన్నారు. పంచాయతీ ఎన్నికలు మొదలు.. మున్సిపాలిటీ, కార్పొరేషన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని విజయం సాధించిందని మంత్రి కొడాలి నాని అన్నారు. ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ ఎప్పటికీ ఉండాలని రాష్ట్ర ప్రజలంతా దేవుళ్లకు మొక్కుతున్నారన్నారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొడాలి నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. 

‘‘పంచాయతీ ఎన్నికల్లో 85 శాతం వైయస్‌ఆర్‌ సీపీ గెలిస్తే.. సింబల్‌ లేదని చెప్పి మేమే గెలిచామని టీడీపీ ఆఫీస్‌ ముందు టపాకాయలు కాల్చుకున్నారు. చంద్రబాబు సాయంత్రానికి ఒక ప్రెస్‌మీట్‌ పెట్టి 81.03 శాతం, 79.22 శాతం గెలిచామని సొల్లు మాటలు చెప్పారు. పప్పు, తుప్పు టీడీపీ మొత్తం కలిసి విజయవాడలో, గుంటూరులో మీటింగ్‌లో పెట్టి ప్రజలను బూతులు తిట్టారు. సీఎం వైయస్‌ జగన్‌ ఇంట్లో నుంచి బయటకు రాలేదు. ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు.. వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రుల మీద ఉన్న నమ్మకంతో ప్రజలు దీవించారు. 

75 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగితే 74 గెలిచాం. 12 కార్పొరేషన్లకు 12 గెలిచాం. తిరుపతి ఉప ఎన్నికలో గతం కంటే అత్యధిక మెజార్టీతో గెలుపొందాం. ఈ రకంగా ప్రజలు, దేవుడు సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని దీవిస్తుంటే.. చూసి ఓర్వలేని చవట దద్దమ్మ సొల్లు కబుర్లు చెబుతున్నాడు. టీడీపీ ఎన్నికలు బహిష్కరిస్తే.. టీడీపీ ఓటు బ్యాంకు వైయస్‌ఆర్‌ సీపీకి టర్న్‌ అయిపోతుందా..? కుప్పంలో 4 జెడ్పీటీసీలకు కలిసి 21 వేల ఓట్లు టీడీపీకి వచ్చాయి. 80 వేలకు పైచిలుకు వైయస్‌ఆర్‌ సీపీకి వచ్చాయి. టీడీపీ ఎన్నికలు బహిష్కరించింది కాబట్టి వచ్చి వైయస్‌ఆర్‌ సీపీకి ఓటు వేశారా..? ఎంపీటీసీ ఎన్నికల్లో 15 శాతం ఇతర పార్టీలు గెలిచాయి. దాంట్లో 10 శాతం ఎంపీటీసీలు టీడీపీ గెలిచింది. వారంతా తిరుగుబాటు అభ్యర్థులా.. వారందరినీ చంద్రబాబు సస్పెండ్‌ చేస్తున్నాడా..? బాబును ధిక్కరించి పోటీ చేశారా..? 

తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా చంద్రబాబు పనికిరాడు. గెలిచిన ఎంపీటీసీ, జెడ్పీటీసీల్లో ఎవరినో ఒకరిని పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకోండి. ఓటుకు నోటు కేసులో దొంగలా దొరికి.. 10 సంవత్సతరాలు అవకాశం ఉన్న రాజధానిని వదిలేసి పారిపోయి వచ్చి కాల్వగట్టున దాక్కున్నాడు. కరోనా వస్తే ఇంట్లో దాక్కున్న చవట దద్దమ్మ చంద్రబాబు. పారిపోవడం చంద్రబాబు రక్తంలో జీర్ణించుకుపోయి ఉంది. 

భూమి గుండ్రంగా ఉంటుంది.. మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం.. అని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. తుప్పు మాటలను టీడీపీ నేతలు అర్థం చేసుకోవాలి. సొల్లు మాటలు చెప్పే పప్పు, తుప్పును నమ్ముకుంటే.. టీడీపీకి తెలంగాణలో పట్టిన గతే ఏపీలో కూడా పడుతుంది. రాబోయే రోజుల్లో టీడీపీకి అభ్యర్థులు దొరకే పరిస్థితి కూడా ఉండదు. 

పప్పు లోకేష్‌తో మొదలు.. గంజాయి అమ్ముకునే అయ్యన్నపాత్రుడు నోటికి ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రిని, మంత్రులను మాట్లాడుతున్నారు. చంద్రబాబు, లోకేష్‌లను దారుణంగా బూతులు తిట్టగలను. కానీ, వాళ్లు సంస్కారహీనులు, చంద్రబాబు పగ, ప్రతీకారాలతో నన్ను ఏదో చేయాలని చెప్పి.. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్‌.. కొందరు టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్టు నిందలు వేస్తున్నారు. ఈ రాష్ట్రంలోని ప్రజలు మన ప్రభుత్వానికి, పార్టీకి మద్దతుగా ఉన్నారు. పైనున్న దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ప్రజాసేవ చేయడానికి, పేదవాడికి పట్టెడు అన్నంపెట్టడానికి, వారి అవసరాలు తీర్చడానికి రాజకీయాల్లోకి వచ్చాం. మనం ఇటువంటి వాటికి బెదరాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యక్తులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుందామని ఒకటికి నాలుగుసార్లు సీఎం చెప్పబట్టి.. తుప్పు చంద్రబాబు, పప్పు లోకేష్‌ను వదిలేస్తున్నాను. 

ఒళ్లు దగ్గరపెట్టుకో చంద్రబాబు. అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలి. ఎవరైనా ఇంకోసారి ముఖ్యమంత్రి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. చంద్రబాబు, లోకేష్‌ను బట్టలూడదీసి రోడ్డు మీద నిలబెట్టి అమ్మనా బూతులు తిడతా.. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా.. ఒళ్లు దగ్గరపెట్టుకొని హైదరాబాద్‌లో శేషజీవితం గడుపుకోవాలి. దేవినేని ఉమా ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తాం. నీ సమస్యలేంటో నా దగ్గరకు రా.. 

డ్రగ్స్‌కు ఏపీ కేరాఫ్‌ అడ్రస్‌ అయిందని చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చొని చెబుతున్నాడు. కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌కు తెర తీసింది టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే. చంద్రబాబుకు ఆడపిల్లలు లేరు కాబట్టి.. సెక్స్‌రాకెట్‌ను ప్రోత్సహించాడు. ఆ రోజు సీపీగా ఉన్న ఇప్పటి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను సెలవుల మీద పంపించి కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ను నడిపించాడు చంద్రబాబు. అందుకే ప్రజలు టీడీపీకి 23 సీట్లు ఇచ్చారు. మంగళగిరిలో లోకేష్‌ను ఓడించారు. 

గుట్కాలు, మట్కాలు, పేకాట క్లబ్‌లు, చట్టవ్యతిరేక కార్యక్రమాలు జరగకూడదని అన్నింటినీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అడ్డుకున్నారు. చంద్రబాబు, ఏబీఎన్, టీవీ5, ఈటీవీ అంతా కట్టుకొని సీఎం వైయస్‌ జగన్‌ను పట్టుకొని వేలాడినా.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఊడిపోయిన వెంట్రుక కూడా కదపలేరు. కోట్లాది మందిహృదయాల్లో సీఎం వైయస్‌ జగన్‌ గూడు కట్టుకున్నారు. 

పేదవాడి పార్టీ అంటే వైయస్‌ఆర్‌ సీపీ, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే పార్టీ వైయస్‌ఆర్‌ సీపీ, పేదవాడికి ఇంగ్లిష్‌ మీడియం చదువులు చెప్పించేది వైయస్‌ఆర్‌ సీపీ, పేదవాడిని కార్పొరేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించే పార్టీ వైయస్‌ఆర్‌ సీపీ, 30 లక్షల నిరుపేదలకు సొంతిళ్లు నిర్మిస్తున్న వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌. రాష్ట్రంలోని ప్రతి వర్గానికి రాజకీయ పదవులు ఇచ్చి.. ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకువచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్న ఏకైక వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌. 

వైయస్‌ఆర్‌ను కోల్పోవడం వల్ల ఈ రాష్ట్రం రెండు ముక్కలైంది. ఆంధ్రరాష్ట్రంలోని పేదవాడు దిక్కులేని పరిస్థితికెళ్లిపోయాడు. అటువంటి పరిస్థితుల్లో ఆ మహానుభావుడి తనయుడు వైయస్‌ జగన్‌ను నమ్ముకొని రాష్ట్ర ప్రజలు 151 సీట్లతో ముఖ్యమంత్రిని చేశారు. ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ ఉండాలని కోట్లాదిమంది ప్రజలు దేవుడ్ని కోరుకుంటున్నారు. చంద్రబాబు, అచ్చెన్న, అయ్యన్నపాత్రుడు లాంటి నలుగురు వెదవలు సీఎం మీద బురదజల్లినా.. వారిపైనే పడుతుంది. సీఎం స్థాయిని 5పైసలు కూడా తగ్గించలేరు’’ అని మంత్రి కొడాలి నాని అన్నారు.
 

Back to Top