చంద్రబాబు అండ్‌ కో భారీ భూస్కామ్‌లు చేసింది

రాజ్యాంగ వ్యతిరేక చర్యలపై సీఐడీ నోటీసులిస్తే తప్పేంటీ?

ప్రజలను మోసం చేసిన చంద్రబాబు సీఐడీ, కోర్టులకు జవాబు చెప్పాలి

పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కొడాలి నాని

విజయవాడ: అమరావతి పేరుతో దళితులను చంద్రబాబు నాయుడు మోసం చేశాడని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. బెదిరించి, భయపెట్టి దళితుల భూములను లాక్కున్నారని మండిపడ్డారు. మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో చంద్రబాబు అండ్‌ కో భారీ భూస్కామ్‌లు చేశారన్నారు. ఏకపక్ష జీవోలతో దళిత వర్గాలను మోసం చేశారని ధ్వజమెత్తారు. దళితులను బెదిరించి చంద్రబాబు బ్యాచ్‌ కోట్లు కొట్టేశారన్నారు. 

ఆంబోతుల అచ్చెన్నాయుడు, కుక్కల వెంకన్న అరుపులకు బెదిరేది లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగ వ్యతిరేక చర్యలపై సీఐడీ నోటీసులిస్తే తప్పేంటీ అని ప్రశ్నించారు. చంద్రబాబు స్క్రిప్ట్‌ ఫాలో అవుతూ రాజకీయాలు చేసే ప్రతిపక్షాల కంటే తమకు దళిత వర్గాల ప్రయోజనాలే ముఖ్యమన్నారు. ప్రజలను మోసం చేసిన చంద్రబాబు సీఐడీ, కోర్టులకు జవాబు చెప్పాలన్నారు. ప్రజలకు న్యాయం చేయడమే వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వ ధ్యేయమన్నారు. 
 

Back to Top