కేసీఆర్‌కు భయపడి చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి పరారు

మంత్రి కన్నబాబు
 

అమరావతి: ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని మంత్రి కన్నబాబు తెలిపారు. బుధవారం శాసన మండలిలో మంత్రి కన్నబాబు మాట్లాడారు. కేసీఆర్‌కు భయపడి తెలంగాణ నుంచి చంద్రబాబు అన్ని సర్దుకుని ఏపీకి పరారై వచ్చారని దుయ్యబట్టారు. విభజన చట్టం ప్రకారం పదేళ్ల పాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉండాలన్నారు. చంద్రబాబును ఎక్కడ జైల్లో పెడతారని రాత్రికి రాత్రి ఏపీకి వచ్చేశారని తెలిపారు. ఓటుకు కోట్లు కేసు కోసం తెలంగాణలోని ఏపీ ఆస్తులు చంద్రబాబు తాకట్టుపెట్టారని విమర్శించారు. బకాయిలు,ఆస్తులకు సంబంధించి పోరాటం చేస్తున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top