ట్రాక్టర్‌ నడపడం రాదు.. రైతాంగం గురించి మాట్లాడటం

నారా లోకేష్‌కు చురకలు అంటించిన మంత్రి కన్నబాబు

మండలిలో టీడీపీ సభ్యుల వ్యాఖ్యలను ఖండించిన మంత్రి

శాసనమండలి: వ్యవసాయం దండగ అని చెప్పిన వ్యక్తులు ఇవాళ రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని, తెలుగుదేశం పార్టీ సభ్యులకు రైతాంగం గురించి మాట్లాడే అర్హత లేదని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. నివర్‌ తుపాన్‌ – ప్రభుత్వ చర్యలపై శాసనమండలిలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రతిపక్ష తెలుగుదేశం సభ్యులు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సభ్యుల వ్యాఖ్యలను మంత్రి కన్నబాబు తీవ్రంగా ఖండించారు. అసత్యాలు మాట్లాడడం, వెల్‌లోకి వెళ్లడం టీడీపీ సభ్యులకు ఫ్యాషన్‌గా మారిందని మండిపడ్డారు. కనీసం ట్రాక్టర్‌ నడపడం కూడా రాని వ్యక్తులు వ్యవసాయం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. వరదల్లో ట్రాక్టర్‌ తీసుకెళ్లి లోకేష్‌ పెద్ద యాక్షన్‌ చేశాడన్నారు. 9 నెలలు హైదరాబాద్‌లో దాక్కుని ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. 
 

Back to Top