పప్పు ధాన్యాల పంటలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక బోర్డు  

మంత్రి కురసాల కన్నబాబు

పప్పు ధాన్యాల బోర్డు ఏర్పాటుపై అసెంబ్లీలో బిల్లు

అసెంబ్లీ: పప్పు ధాన్యాల పంటలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఇవాళ సభలో పప్పుధాన్యాలకు సంబంధించిన బిల్లును మంత్రి కన్నబాబు సభలో ప్రవేశపెట్టారు. ఆయన మాట్లాడుతూ.. కాయధాన్యాలు, పప్పు ధాన్యాలకు సంబంధించి ప్రత్యేక బోర్డును ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పేదల మాంసకృత్యాలు అయిన పప్పు ధాన్యాలను చాలా అవసరం. బియ్యం కంటే వీటిలో మూడు రెట్లు అధిక పోషకాలు ఉంటాయి.  రోజుకు 80 గ్రాముల పప్పు తినాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. 2013కి పప్పుధాన్యాల లభ్యత 41.9 గ్రాములకు పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ధరలు కూడా పెరిగిపోతున్నాయి. వీటిని నియంత్రించాలని, రైతులకు మేలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. స్పైసెస్‌, టోబాకో బోర్డు మాదిరిగా వీటికి కూడా బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. రైతులు పప్పుధాన్యాలను పండించేందుకు ఆసక్తి చూపడం లేదు. రైతులను ప్రోత్సహించేందుకు ఈ బిల్లు తీసుకువచ్చాం. రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు బోర్డు చూస్తుంది. ఈ బోర్డుకు కూడా ఒక చైర్మన్‌, నిపుణులైన అధికారులు, శాస్త్రవేత్తలు ఉంటారు. ఏపీలో కాయధాన్యాల సాగు విస్తిర్ణం పెరగడంతో పాటు రైతులకు మేలు జరుగుతుంది. ప్రాసెసింగ్‌ను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం. దీని ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

 

తాజా ఫోటోలు

Back to Top