సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌కు జ‌న‌మంతా జై కొడుతున్నారు

వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి

గొల‌గ‌మూడిలో గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మంత్రి

నెల్లూరు: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పాల‌న‌కు ప్ర‌జ‌లంతా సంపూర్ణ‌ మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నార‌ని, మా న‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న‌న్న అని ముక్తకంఠంతో నిన‌దిస్తున్నార‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం అనికేపల్లి గ్రామ సచివాలయ పరిధిలో గొలగమూడి గ్రామంలో మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా గ్రామంలో మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ బాలికల పాఠశాలలో నాడు- నేడు పథ‌కం కింద నిర్మించిన అభివృద్ధి పనులను మంత్రి కాకాణి ప్రారంభించారు. అనంత‌రం ఇంటింటికీ తిరిగి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అందిస్తున్న సంక్షేమ పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్ర‌జ‌ల‌కు తెలియజేయడం, గ్రామాలలో ఇంకా ఏమైనా స‌మ‌స్య‌లు ఉంటే వాటిని వెంట‌నే ప‌రిష్క‌రించ‌డ‌మే ప్రధాన లక్ష్యంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామ‌న్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్  అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు అందిస్తున్నార‌న్నారు. అదే విధంగా అర్హ‌తే ప్రామాణికంగా సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తున్నార‌న్నారు. అక్క‌చెల్లెమ్మ‌ల‌కు ప్ర‌భుత్వం అండ‌గా నిలుస్తోంద‌న్నారు. ప్ర‌తి కుటుంబం సంతోషంగా ఉండాల‌నే ల‌క్ష్యంగా సంక్షేమ ప‌థ‌కాల‌ను పార‌ద‌ర్శ‌కంగా అమ‌లు చేస్తున్నార్నారు. అన్ని వ‌ర్గాల‌కు భ‌రోసాగా నిలుస్తున్న ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌లంతా అండ‌గా ఉండాలని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక వైయ‌స్ఆర్ సీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, స‌చివాల‌య అధికారులు, వ‌లంటీర్లు పాల్గొన్నారు. 

Back to Top