సూక్ష్మసేద్యంలో దేశంలోనే ఏపీకి మంచి గుర్తింపు

అవసరమైనవారందరికీ డ్రిప్‌ సదుపాయాన్ని అందిస్తున్నాం

అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి సమాధానం

అసెంబ్లీ: డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలు అందించడంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మంచి గుర్తింపు లభించిందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి చెప్పారు. డ్రిప్‌ ఇరిగేషన్‌కు వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సూక్ష్మసేద్యంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కాకాణి సమాధానమిచ్చారు. 

‘‘డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలు రైతులు కోరిన విధంగా అందించడం వల్ల పండ్ల ఉత్పత్తిలో జాతీయస్థాయిలో ఏపీ భాగస్వామ్యం 15.6 శాతం ఉందని, కూరగాయల ఉత్పత్తిలో 7.05 శాతం ఏపీ భాగస్వామ్యం ఉంది. గత ప్రభుత్వంలో 969.40 కోట్ల రూపాయిల బకాయిలు ఉంటే వాటన్నింటినీ వైయస్‌ జగన్‌ ప్రభుత్వం క్లియర్‌ చేసింది. 64,281 మంది రైతులకు 1,75,816 ఎకరాలకు గానూ సూక్ష్మసేద్య పరికరాలను అందించడం జరిగింది. 

2022–23 సంవత్సరానికి సంబంధించి దేశస్థాయిలో రైతులకు డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలు ఎక్కువగా అందించిన మొదటి 10 జిల్లాల్లో ఏపీలోని అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలు ఉన్నాయని, 20 జిల్లాల్లో తీసుకుంటే ఆ మూడు జిల్లాలకు అదనంగా వైయస్‌ఆర్, ప్రకాశం జిల్లాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఆర్బీకేల్లో ఆన్‌లైన్‌ రిజిస్టర్‌ చేసుకుంటే ప్రయారిటీ ప్రకారం డ్రిప్‌ పరికరాలు అందిస్తున్నాం. రైతులకు ఎంత అవసరం అనుకుంటే వారు ఆర్బీకేల ద్వారా రిజిస్టర్‌ చేసుకుంటే ప్రాధాన్యత క్రమంలో ప్రతి ఒక్కరికీ సూక్ష్మసేద్య పరికరాలు అందిస్తున్నాం’’ అని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి చెప్పారు.  

Back to Top