నెల్లూరు: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సమన్వయంతో పనిచేసి, గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుదామని వైయస్ఆర్‌సీపీ సర్వేపల్లి అభ్యర్థి, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని వెంకన్నపాలెం గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.మంత్రికి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పాలనలో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పేదల ప్రయోజనాలే లక్ష్యంగా కృషి చేశారన్నారు. ఆ పాలనా తీరు పార్టీలోని నాయకులు, కార్యకర్తలకు ప్రజల్లో గౌరవాన్ని తెచ్చిపెట్టిందన్నారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో వైయస్ఆర్‌సీపీ జెండాను ఎగురవేసి హ్యాట్రిక్ సాధిద్దామని మంత్రి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిన్ ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చారని, అందుకే ధైర్యంగా ఇంటింటికి వెళ్లి ఓట్లని అడుగుతున్నామని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. 2014 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీలు కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చాయని.. కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని ఆయన విమర్శలు గుప్పించారు. ఎన్నికలలో ఇచ్జిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారు. మళ్లీ ఇప్పుడు మరోసారి వాళ్లు ప్రజల ముందుకు వస్తున్నారని.. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మంత్రి కాకాని సూచించారు.